Ambedkar: కలలో కూడా ఆ పని చేయమన్న అమిత్ షా
Amit Shah on Ambedkar: తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎదురుదాడి చేశారు.
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ విలువలను ఉల్లంఘించారన్నారు అమిత్ షా. పార్లమెంట్లో అంబేడ్కర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించదన్నారు. అంబేద్కర్‌ను ఎప్పటికీ, కనీసం కలలోనూ అవమానించలేని పార్టీ నుంచి వచ్చినట్లు అమిత్ షా చెప్పారు.

'కాంగ్రెస్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వలేదు. కేంద్రంలో బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరణానంతరం ఆయన(అంబేద్కర్)కు భారతరత్న ఇచ్చింది. కాంగ్రెస్ ఏనాడూ అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించలేదు. బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ను ఎంతో గౌరవించిందని అమిత్ షా తెలిపారు.
ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టంగా ఉన్న నా ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉంది. కలలో కూడా అంబేడ్కర్ ఆలోచలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చా. ఎమర్జెన్నీ విధించడం ద్వారా రాజ్యాంగ విలువలను ఉల్లంఘించింది కాంగ్రెస్. ఆ వాస్తవాలన్నీ బయటకు రాగానే కాంగ్రెస్ తన పాత ట్రిక్కులను ఉపయోగించి వాస్తవాలను వక్రీకరిస్తుంది అని అమిత్ షా ధ్వజమెత్తారు.
అంతకుముందు అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు చేశారు. అంబేడ్కర్‌పై ప్రధాని మోడీకి గౌరవముంటే తక్షణం అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను సమర్థిస్తూ మోడీ ట్వీట్లు చేయడాన్ని ఖర్గే తప్పుబట్టారు. అమిత్ షా ఏం చెప్పారో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశం మొత్తం చూసిందన్నారు. ఆయన మాటలు కేవలం మనుస్మృతిలో మాత్రమే ఉంటాయని విమర్శించారు. అలాంటి వాటిని అంబేడ్కర్ ఎప్పుడూ సమర్థించలేదని ఖర్గే చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే.. కాంగ్రెస్ ఆయనను ఓడించిందని మండిపడ్డారు. అంబేద్కర్ కేంద్రమంత్రి పదవి నుంచి వైదొలగడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఫొటోను పార్లమెంటులో పెట్టనివ్వలేదన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications