వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన ఘట్టం- వాయుసేన ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సక్సెస్- ఇద్దరు కేంద్రమంత్రులతో

|
Google Oneindia TeluguNews

భారత ఉపఖండంలో ప్రస్తుతం పరిస్ధితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ సహా ఉపఖండంలో శత్రువులు పెరుగుతున్నారు. ఇలాంటి తరుణంలో మన సాయుధ దళాల సన్నద్దతను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఓ ఎయిర్ ఫోర్స్ అత్యవసర ల్యాండింగ్ డ్రిల్ నిర్వహించింది. ఇందులో ఇద్దరు కేంద్రమంత్రులు కూడా పాల్గొని విజయవంతం చేశారు.

రాజస్ధాన్ లోని బార్మర్ లోని జాతీయ రహదారిపై ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏసీ-130J సూపర్ హెర్క్కులస్ రవాణా విమానం ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ డ్రిల్ లో పాల్గొంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బహదూరియాతో పాటు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ కూడా ఎక్కారు. ఇది అనుకున్న సమయానికి అనుకున్ విధంగా రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగలిగింది. దీంతో ఈ డ్రిల్ విజయవంతమైనట్లు ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

IAF Aircraft Emergency Landing Drill Success with two union minister on board

ఈ అరుదైన డ్రిల్ విజయవంతం కావడంపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేసారు. డ్రిల్ లో పాల్గొన్న ఎయిర్ ఫోర్స్ అధికారుల్ని అభినందించారు. మీరు సాధారణంగా కార్లు, ట్రక్కులను చూసిన చోట, ఇప్పుడు విమానాలు చూస్తారు ... ఎందుకంటే ఈ ప్రదేశం (బార్మర్ ) 1971 లో యుద్ధాన్ని చూసింది . అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉంది. అత్యవసర ల్యాండింగ్ ఫీల్డ్, లేదా ELFలో జరిగిన ఈ డ్రిల్ ఎయిర్ ఫోర్స్ లో విశ్వాసాన్ని నింపుతుందన్నారు. భారత దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి వాయుసేన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఇది నిరూపిస్తోందన్నారు. ఇది యుద్ధానికి మాత్రమే కాదు. హెలిప్యాడ్ లు లేని చోట, సహాయక చర్యలు జరుగుతున్న చోట కూడా అత్యవసర పరిస్ధితులు ఎదుర్కోవడానికి ఉపయోగపతుందని రాజ్ నాథ్ అన్నారు.

IAF Aircraft Emergency Landing Drill Success with two union minister on board

C-130J సూపర్ హెర్క్యులస్ 'ఫీల్డ్ ల్యాండింగ్' (జాగ్వార్స్ మరియు సుఖోయ్ Su-30 MKI ల వంటి యుద్ధ విమానాలు ల్యాండింగ్ మరియు టేకాఫ్ తర్వాత), సహాయక చర్యలు చేపట్టే సమయాల్లో అత్యవసర ఎయిర్‌స్ట్రిప్‌లుగా రోడ్డు మౌలిక సదుపాయాల నాణ్యతను పరీక్షించడం దీని వెనుక ఉన్న ఉద్దేశమని అధికారులు తెలిపారు. అత్యవసర సమయాల్లో రోడ్లను సైతం హెలిప్యాడ్ లుగా వాడుకునేందుకు సన్నద్ధతగా ఈ డ్రిల్ చేపట్టామన్నారు.

English summary
A C-130J Super Hercules transport aircraft, carrying Defence Minister Rajnath Singh, Roadways Minister Nitin Gadkari and Air Chief Marshal RKS Bhadauria, completed an 'emergency field landing Successfully as a part of readiness drill by the armed forces in rajasthan today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X