వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఒక్కడు తప్ప అందరూ మృత్యువాత.. పైలట్ వరుణ్‌కు ట్రీట్ మెంట్, శౌర్య చక్ర అవార్డు కూడా

|
Google Oneindia TeluguNews

తమిళనాడు కూనూరులో జరిగిన ప్రమాదంలో 13 మంది చనిపోయారు. సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక కూడా మృత్యు ఒడిలోకి చేరిపోయారు. హెలికాప్టర్‌లో ఉన్న పైలట్ వరుణ్ సింగ్ మాత్రం మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగానే గాయపడినట్టు సమాచారం.

వరుణ్‌కు చికిత్స

ఇండియ‌న్ ఎయిర్‌ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. మిల‌ట‌రీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ారు. వరుణ్ సింగ్ నిష్ణాతుడైన పైలట్.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా వ‌రుణ్ సింగ్ శౌర్య చ‌క్ర అవార్డును అందుకున్నారు. 2020లో ఎల్‌సీఏ తేజ‌స్ ఫైట‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఏరియ‌ల్ ఎమ‌ర్జెన్సీలో సేవ్ చేసినందుకు శౌర్య చ‌క్ర అవార్డుతో స‌త్క‌రించారు.

నిష్ణాతుడే.. కానీ

నిపుణుడు అయిన వరుణ్ సింగ్ హెలికాప్టర్ నడిపారు. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అత్యాధునిక హెలికాప్టర్ అయినా.. పొగ మంచు వల్ల వాతావరణాన్ని వరుణ్ సింగ్ అంచనా లేకపోయి ఉండొచ్చు. రెప్పపాటులో హెలికాప్టర్ కిందకి దిగిపోయి ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న పెద్ద చెట్టుకు ఢీ కొంది. ఆ వెంటనే మంటలు.. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలోనే 11 మంది చనిపోయి ఉంటారని తొలుత వార్తలు వచ్చాయి. రావత్‌ను మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వరుణ్ తప్ప అందరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Recommended Video

IAF Mi 17 V5 : Russian Made Chopper Facts Explained || Oneindia Telugu
ఎలా జరిగిందంటే

ఎలా జరిగిందంటే

తమిళనాడు కూనూరు వద్ద కూలిన హెలికాప్టర్ ప్రమాదం గురించి అంతకుముందు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలియజేశారు. ముగ్గురు కాలిపోతూ కిందకి రావడం తాను చూశానని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేశాం అని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రమాదం జరిగిందని.. స్వామి తెలిపారు. తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. హెలికాప్టర్ కూలిన తర్వాత ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు. తమ చుట్టు పక్కల ఉండేవారిని సాయం చేసేందుకు పిలిచానని తెలిపారు. ఫైరింజన్, అత్యవసర సేవలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని పేర్కొన్నారు.

English summary
Indian Air Force Group Captain Varun Singh, who was injured in the m-17 v5 crash on wednesday. he was awarded shaurya chakra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X