పాకిస్థాన్ లో చిక్కుకున్న IAF పైలట్..? భారత్ సంచలన ఆపరేషన్..!
భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదమే.. 1947 లో మన నుంచి విడిపోయిన దగ్గర్నుంచి ఆ దేశం మనపై దాడులు చేస్తూనే ఉంది. ఏదో రకంగా భారత్ ను బలహీన పరచాలని చూస్తూనే ఉంటుంది. 2001 పార్లమెంట్ దాడి, 2008 లో ముంబై దాడులు, అలాగే 2016 లో ఉరి దాడి, 2019 లో పుల్వామా దాడి, ఆ తర్వాత గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి .. ఇలా ప్రతి దాడి వెనుక పాకిస్థాన్ ఉందన్నది తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత్ మే 7-10 మధ్య ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.
పాకిస్థాన్ మాత్రం ఎంత కొట్టినా చావని పాములా మనదేశంపై దాడులు చేస్తూనే ఉంటుంది. భవిష్యత్తులోనూ ఆ దేశం నుంచి భారత్ కు ముప్పు ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధ సామాగ్రిని అప్డేట్ చేసుకుంటూ వెళ్తోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన రక్షణ వ్యవస్థను భారత్ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే భారత్ వద్ద అత్యాధునిక క్షిపణులు, ఫైటర్ జెట్స్, యుద్ధ ట్యాంకులు, ఎస్-400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు, రాఫేల్ లాంటి అత్యాధునిక యుద్ద విమానాలు, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు, వార్ హెడ్స్, జలాంతర్గాములను సిద్ధం చేసుకుంటోంది.
అయితే ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకున్న విషయం తెలిసిందే.. ఇరాన్- అమెరికా మధ్య భీకర యుద్ధం నెల రోజులకు పైగా నడిచింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన F-15E యుద్ధ విమానం ఇరాన్ లో కూలిపోయింది. ఈ ఘటనలో తప్పిపోయిన పైలట్ కోసం అమెరికా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ లో 36 గంటల పాటు ఆపరేషన్ చేపట్టి అతడ్ని సురక్షితంగా తమ దేశానికి తీసుకెళ్లింది. దీనిని కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ(CSAR) ఆపరేషన్ అంటారు.
ఒకవేళ భారత్ కు చెందిన IAF పైలట్ పాకిస్థాన్ లో చిక్కుకుంటే భారత్.. అమెరికా తరహాలో కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ(CSAR) ఆపరేషన్ చేసే విధానంపై యూరేషియన్ టైమ్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా తన కథనంలో వివరించారు. ఈ మేరకు అమెరికా తరహాలో భారత్ తన డిఫెన్స్ వ్యవస్థను ఎలా సిద్దం చేసుకుంటుందో వివరించిందీ కథనం..
అయితే 2019లో అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పాకిస్థాన్ లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో భారత్ రెస్క్కూ ఆపరేషన్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు అమెరికా స్థాయిలో భారత్ కూడా హంట్ అండ్ రెస్క్యూ సామర్థ్యాలను పెంపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత పైలట్ పాకిస్థాన్ లో పడిపోతే.. భారత్ వెంటనే ప్లే బుక్ వ్యూహం అమలు చేస్తుంది. పైలట్ పారాచూట్ ద్వారా కిందకు దిగిన వెంటనే వారి వద్ద ఉన్న ఎమర్జెన్సీ రేడియో సిగ్నల్స్ సాయంతో ఆ ప్రదేశాన్ని గుర్తిస్తారు.

అలాగే పైలట్ ను రక్షించే హెలికాప్టర్లకు సెక్యూరిటీగా సుఖోయ్ 30ఎంకేఐ లేదా రాఫేల్ యుద్ధ విమానం ఆకాశంలోనే గస్తీ నిర్వహిస్తుంది. ఇక IAF కు చెందిన గరుడ్ కమాండోలు ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషిస్తారు. ఇక CSAR కోసం భారత్ వద్ద ఉన్న వనరులు చూస్తే.. ఎల్సీహెచ్ ప్రచండ్.. ఇది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో వేగంగా పనిచేస్తుంటాయి. అలాగే అపాచీ, చినూక్ హెలికాప్టర్లు రాత్రిపూట శత్రుమూకలను చిక్కకుండా ఆపరేషన్ పూర్తిచేస్తాయి. అలాగే సీ-130జే సూపర్ హెర్కులస్.. ఇది గరుడ్ కమాండోలను వేగంగా బోర్డర్ కు చేరవేయడంలో సాయం చేస్తుంది.. ఈ మేరకు భారత్ సైతం అమెరికా తరహాలో భవిష్యత్తు పరిస్థితులను సిద్ధంగా ఉండాలని ఈ కథనం పేర్కొంది.
-
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications