వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ డీల్ : రష్యా నుంచి ఆర్-27 క్షిపణుల కొనుగోలుకు భారత్ ఒప్పందం

|
Google Oneindia TeluguNews

భారత రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆర్-27 క్షిపణులను కొనేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూ.1500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ క్షిపణులు ఎస్-యూ 30ఎమ్‌కేఐ యుద్ధవిమానాల్లో అమర్చుతారు. ఈ క్షిపణులను అమర్చడం వల్ల ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాల చేధింపు బలోపేతం కానుంది.

గాల్లో లక్ష్యాలను ఈ ఆర్-27 క్షిపణులు ధ్వంసం చేయగలవు. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ ఇవి లక్ష్యాలను చేధించగవని ఇండియన్ఉంటుంది. ఆర్-27 క్షిపణి 25 కిమీటర్ల ఎత్తునుంచి కూడా ప్రయోగించొచ్చు. 60 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ఉంటుంది. అంతేకాదు ఇందులోని గైడెన్స్ వ్యవస్థలో సెమీ యాక్టివ్ రాడార్‌లు కలిగి ఉన్నాయి.

IAF signs deal with Russia, to buy R-27 missiles worth Rs.1500 crore

10-ఐ ప్రాజెక్టులో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో భారత త్రివిధ దళాలు తమ తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. గత 50 రోజుల్లో రక్షణ వ్యవస్థకు సంబంధించి రూ.7600 కోట్లు విలువ చేసే ఎక్విప్‌మెంట్‌ల కొనుగోలు ఒప్పందంపై భారత వాయుసేన సంతకాలు చేసింది. ఇందులో భాగంగానే స్పైస్ -2000, స్ట్రమ్ అటాకా ఏటీజీఎం క్షిపణులతో పాటు ఇతర క్షిపణులను కూడా ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకుంది. వీటన్నిటీ అత్యవసర సమయంలో ప్రయోగిస్తారని సమాచారం. పుల్వామా దాడుల తర్వాత భారత ప్రభుత్వం దేశ రక్షణ కోసం త్రివిధ దళాలకు అన్ని అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
The Indian Air Force (IAF) has signed a deal with Russia for buying R-27 air-to-air missiles worth over Rs 1500 crore. The missiles will be fitted on the Su-30MKI fighter planes. The missiles will further strengthen the air-to-air combat capability of the air force.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X