నారాయణమూర్తి ఆవేదన: పరిణామాలు బాధిస్తున్నాయని కామెంట్..
బన్సల్ కు సాధారణంగా చెల్లించే 12నెలల ప్యాకేజీ కన్నా.. 10రెట్లు అధిక మొత్తాన్ని చెల్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెంగుళూరు: ఇన్ఫోసిస్ లో తలెత్తిన పారదర్శకత లోపాలపై సంస్థ వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్ తొలి చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి స్పందించారు. ఇన్ఫోసిస్ లో సంక్షోభం తలెత్తిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. పారదర్శకతకు ఎక్కువ ప్రాధాన్యతినిస్తూ, అత్యుత్తమ ప్రమాణాలతో సాగుతున్న సంస్థలో ఇలాంటి పరిణామాలు బాధిస్తున్నాయని అన్నారు.
సమస్యంతా సీఈవో విశాల్ సిక్కాతో కాదని బోర్దులో పారదర్శకత లోపించడమే ప్రధాన సమస్య అని చెప్పారు. పారదర్శకత ప్రామాణికతలో తేడాల వల్ల కార్పోరేట్ గవర్నెన్స్ దారుణంగా దెబ్బతిన్నదని తెలిపారు. ఇటీవలే సంస్థను వీడిన డేవిడ్ కెన్నెడీ, సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ తదితురల సెవరెన్స్ ప్యాకేజీలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధిక మొత్తంలో ప్యాకేజీల చెల్లింపుతో పాటు.. ఎలాంటి ప్రత్యేక సమావేశం నిర్వహించకుండా.. దీనిపై నిర్ణయం తీసుకోవడం పట్ల మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. బన్సల్ కు సాధారణంగా చెల్లించే 12నెలల ప్యాకేజీ కన్నా.. 10రెట్లు అధిక మొత్తాన్ని చెల్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి దీనిపై రెమ్యునరేషన్ కమిటీ ఛైర్మన్(జెఫ్రీ లేమన్) నిర్ణయం తీసుకుంటారని, కానీ ఎలాంటి ప్రత్యేక సమావేశం లేకుండా ఈ చెల్లింపు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి అసాధారణ చెల్లింపులకు కారణమేంటి? అని ప్రశ్నించారు. సాధారణ ఉద్యోగుల్లోకి ఇది ఎలాంటి సంకేతాలను పంపిస్తుందని నిలదీశారు.
కాగా, కంపెనీలో మూర్తి ఏకైక పెద్ద వాటాదారుగా(3.44శాతం) ఉన్న సంగతి తెలిసిందే. సంస్థలో చోటు చేసుకున్న ఈ పరిణామాల పట్ల మిడ్, జూనియర్ లెవల్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీనికి సంబంధించి ఇప్పటికే 1800పైగా మెయిల్స్ తనకు అందాయని పేర్కొన్నారు.
దశాబ్దాల పాటు కష్టపడి ఉత్తమ నైతిక విలువలతో, సంస్థను నిర్మించకుంటూ వస్తే.. ఇప్పుడిలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. కాగా, సంస్థకు రాజీనామా చేసిన మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్, జనరల్ కౌన్సిల్ డేవిడ్ కెనడీలకు బోర్డు సెవెరెన్స్ ప్యాకేజీలను ఇచ్చింది.
డిసెంబర్ లో బాధ్యతల నుంచి తప్పుకున్న కెనడీకీ 8.68లక్షల డాలర్లతో పాటు, ఏడాది పాటు భీమా కవరేజీ కొనసాగింపుకు సంస్థ అంగీకరించింది. అంతకుముందు 2015అక్టోబర్ లో కంపెనీని వీడిన రాజీవ్ కు రూ.17.38కోట్ల చెల్లింపులు జరిపింది. అయితే ఈ చెల్లింపులన్ని కంపెనీ నిబంధనలకు అనుగుణంగానే జరిగినట్టుగా అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ మొత్తం పరిణామాలతో కంపెనీలో పారదర్శకతపై పెద్ద ఎత్తున అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి8,9 తేదీల్లో దీనిపై మరింతగా ఆందోళ వ్యక్తమైంది. యాజమాన్యానికి సీఈవోకు నడుమ ఉన్న పేచీలే ఈ విబేధాలకు కారణమంటూ వార్తలు వచ్చినా.. సీఈవో విశాల్ సిక్కా దీన్ని ఖండించారు.
ఉద్యోగులు ఈ పరిణామాల పట్ల అప్రమత్తతో ఉండాలని, ఊహాగానాలను నమ్మవద్దని విశాల్ సిక్కా విజ్ఞప్తి చేశారు. సంస్థ ఉద్యోగులకు పంపించిన ఈమెయిల్స్ లో ఆయన ఈ వివరణ ఇచ్చుకున్న సంగతి విదితమే.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications