వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాస్మా థెరపీకి గుడ్‌ బై- కోవిడ్ చికిత్స నుంచి తప్పించిన ఐసీఎంఆర్‌-కారణాలివే

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా చికిత్స కోసం ప్రస్తుతం వాడుతున్న వైద్య విధానాల్లో ప్లాస్మా థెరపీ కూడా ఒకటి. అత్యవసర పరిస్దితుల్లో కరోనా నుంచి గతంలో కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మాను సేకరించి రోగికి ఇవ్వడం ద్వారా ప్రాణాలు పోసేందుకు ఈ విధానం అనుసరిస్తున్నారు. అయితే దీనిపై ముందు నుంచీ అనాసక్తిగా ఉన్న ఐసీఎంఆర్‌.. తాజాగా దాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది.

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వాడాల్సిన చికిత్సా విధానాలపై ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. తాజాగా విడుదల చేసిన కోవిడ్ చికిత్స మార్గదర్శకాల్లో ప్లాస్మా థెరపీని ఉపసంహరించుకుంటూ ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై కోవిడ్‌ చికిత్సలోఅధికారికంగా ప్లాస్మా థెరపీని వాడేందుకు అవకాశం ఉండదు. ఐసీఎంఆర్‌కు చెందిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌, ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల బృందం సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ICMR drops plasma therapy from COVID-19 treatment guidelines

Recommended Video

Gynaecologist Dr Abhinaya Alluri Interview PART 3 | oneindia telugu

ప్లాస్మాథెరపీ చికిత్స వాడకంపై గతేడాది 400 మందిపై జరిపిన ట్రయల్స్‌పై దీని వల్ల అంతగా ఉపయోగం లేదని తేలడంతో ఐసీఎంఆర్ తాజా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా కూడా ప్లాస్మా థెరపీని పలు దేశాలు నిషేధిస్తున్నాయి. దీనివల్ల కొత్త వైరస్‌ రకాలు సోకే ప్రమాదముందని ఐసీఎంఆర్‌తో పాటు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా యూకేలో ప్లాస్మాథెరపీని 5000 వేల మందిరోగులపై ప్రయోగించగా అంతగా ఫలితాలు రాలేదు. భారత్‌లోనూ అదే పరిస్ధితి ఉండటంతో కొత్త సమస్యలకు ఆస్కారం ఇచ్చేలాఉన్న ప్లాస్మాథెరపీని కరోనా చికిత్స విధానం నుంచి ఐసీఎంఆర్‌ ఉపసంహరించింది.

English summary
The use of convalescent plasma has been dropped from the recommended treatment guidelines for COVID-19, according to late Monday advisory from the Indian Council of Medical Research (ICMR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X