హస్తినలో ఆక్సిజన్, బెడ్ల కొరత, కెపాసిటీ పెంచండి, కేంద్రానికి కేజ్రీవాల్ రిక్వెస్ట్
కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో రోగులకు చికిత్స అందించడం కష్టం అవుతోంది. ఢిల్లీలో ఐసీయూ బెడ్ల కొరత ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆక్సిజన్ సమస్య కూడా ఉందని వివరించారు. రెమిడెసివర్‌కు డిమాండ్ ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఢిల్లీలో పరిస్థితి తీవ్రత ఎక్కువగానే ఉందని వివరించారు.
గత 24 గంటల్లో ఢిల్లీలో 24 వేల కరోనా కేసులు వచ్చాయి. కేసుల సంఖ్య 24 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే కరోనా కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. కరోనా కేసులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముంబైని ఢిల్లీ అధిగమించింది. ఢిల్లీలో బెడ్లు కూడా తక్కువగా ఉన్నాయని.. వివరించారు. రోగుల దృష్ట్యా పడకలు పెంచేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ వీలు కావడం లేదు. వీలయినంత త్వరగా బెడ్ల సంఖ్య పెంచుతామని కేజ్రీవాల్ వివరించారు.

డిల్లీలో గల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో గల వైద్యశాలలో బెడ్ల సంఖ్య పెంచాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు. ఆక్సిజన్ కూడా సరిపడ అందజేయాలని.. రెమి డెసివర్ టీకా కూడా ఉంచాలని కోరారు. అయితే కరోనా రిపోర్ట్ ఇచ్చేందుకు ల్యాబులు 3 నుంచి 4 రోజుల సమయం తీసుకుంటున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. టెస్టింగ్ కేపాసిటీ కన్నా ఎక్కువగా తీసుకోవడమే ఇందుకు కారణం అని వివరించారు. ఇదీ రోగులకు కూడా మంచిది కాదని చెప్పారు. వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆస్పత్రులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications