వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఐఈడీ బాంబు.. రంగంలోకి ఎన్ఎస్‌జీ.. 8 ఫీట్ల లోతు గొయ్యిలో ఉంచి పేల్చి..

|
Google Oneindia TeluguNews

దేశం అంత స్తబ్దుగా ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీలు, నేతుల బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో బ్యాగు కలకలం రేపింది. సీమపురి ప్రాంతంలో ఓ ఇంటి వద్ద లభించింది. దీంతో అక్కడున్న వారు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ బ్యాగును పరిశీలించారు. అయితే అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు.

వెంటనే ఎన్ఎస్ జీ బలగాలకు సమాచారం అందించారు. వారు ఆ బ్యాగును మైదాన ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చివేశారు. దిల్షాద్ గార్డెన్ వద్ద గల పార్క్‌లో పేల్చారు. పేలుడు శబ్దం తీవ్రత తగ్గించడానికి.. 8 ఫీట్ల లోతులో గల గొయ్యిలో ఉంచి పేల్చారు. గత నెలలో ఘాజీపూర్ వద్ద ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు లభ్యమయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విచారణ చేయగా.. సీమపురి ప్రాంతంలోని ఇంటిపై అనుమానాలు తలెత్తాయి. దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకోగా, పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగు కనిపించింది.

IED recovered from house in Delhis Seemapuri; NSG defuses it

ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ఇల్లు ఖాసిం అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఓ ప్రాపర్టీ డీలర్ ద్వారా ఒక కుర్రాడికి సెకండ్ ఫ్లోర్ అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిరోజులకు మరో ముగ్గురు కుర్రాళ్లు కూడా వచ్చి ఆ ఇంట్లో మకాం వేసినట్టు గుర్తించారు.

English summary
Delhi Police Special Cell found an improvised explosive device in a bag at a house in Seemapuri of Delhi while conducting searches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X