వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ భారీ విజయానికి కారణమిదే ? జై శంకర్ చెప్పిన రహస్యమిదే ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ చేపట్టిన విదేశాంగ విధానమే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణమన్నారు కేంద్రమంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ఆయన ఇటీవల విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో మోడీ సర్కార్ చేసిన పనులే విజయానికి దోహదపడ్డాయని స్పష్టంచేశారు.

విదేశాంగ విధానం భేష్ ..
మోడీ సర్కార్ విదేశాంగ విధానమే ఎన్నికల్లో విజయానికి కారణమని కొత్త భాష్యం చెప్పారు కేంద్రమంత్రి జయశంకర్. అఖండ భారతంలో బీజేపీ ఘన విజయానికి ఇదీ కూడా ఒక కారణమని అభివర్ణించారు. ఇప్పడు ప్రజల ఆలోచనాధోరణి మారిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశ స్థానం గురించి ప్రజలు యోచిస్తున్నారని .. అందుకోసమే బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని పునరుద్ఘాటించారు. ప్రజల ఆలోచనలే బీజేపీకి ఓట్ల రూపంలో వ్యక్తమైనట్టు గుర్తుచేశారు. అంతేకాదు మోడీ మొదటి విడతలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ర్యాంకు కూడా మెరుగుపడినట్టేనని ప్రజలు భావించారని పేర్కొన్నారు. అంతేకాదు మిగతా దేశాలు కూడా గతంలో కన్నా విభిన్నంగా చూస్తున్నాయని .. ఇందుకు కారణం ... అభివృద్ధి, దాంతోపాటు దౌత్యపరంగా తీసుకున్న చర్యలేనని నొక్కి వక్కానించారు.

if bjp won majority for this things only

ఆదర్శం ...
గత ఐదేళ్లలో భారత్ చేపట్టిన విదేశాంగ విధానం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు దేశంలో మార్పును మోదీ సర్కార్ సజీవ సాక్ష్యంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. మనం ఆర్థికంగా బలంగా మారాలంటే .. విదేశి విధానం మరింత పటిష్టంగా మార్చాలని ... ఇప్పుడు మోడీ అదే చేశారని పేర్కొన్నారు. దీంతోపాటు జాతీయభావం ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఉందని .. కానీ భారత్‌లో మాత్రం ఓట్ల రూపంలో వ్యక్యమైందని పేర్కొన్నారు.

English summary
Narendra Modi's foreign policy is the cause of the BJP victory in the general election, Jai Shankar, Union Minister Subramaniam. He recently became the Foreign Minister of India. Today, spoke to the media in Delhi. Modi govt in five years has helped to achieve success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X