PM Kisan: అలా చేయకుంటే.. మీకు పీఎం కిసాన్ డబ్బులు రావు..!
రైతులకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకం కింద సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోంది. నాలుగు నెలకు ఒకసారి రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున జమ చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13 విడతలుగా కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేసింది. త్వరలో 14 వ విడత రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2018 నుంచి అమలు చేస్తోన్నారు.
మొదట్లో ఈ పథకాన్ని ఐదెకరాల లోపు ఉన్నవారికే ఇచ్చేవారు. తర్వాత ల్యాండ్ లిమిట్ కండిషన్ తీసివేశారు. అయితే ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు, ఆదాయం పన్ను కడుతున్నవారికి వర్తించదు. అయితే పీఎం కిసాన్ యోజన కింద రైతులు డబ్బులు పొందాలంటే.. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోకుంటే డబ్బులు ఖాతాల్లో జమ కావు. ఈకేవైసీ చేసుకోవాలని రైతులకు అధికారులు ఎప్పుటి నుంచో కోరుతోంది. అయితే ఇప్పటికీ కొంత మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు.

రైతులు ఈకేవీసీ చేసుకోవాలంట https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత ఎడమ వైపు ఈకేవైసీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ నే ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ పూర్తి అయిపోతుంది.
అలాగా పీఎం కిసాన్ యోజన పథకానికి కొత్త దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత ఎడమ వైపు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రాష్ట్రం అడుగుతుంది. వివరాలన్నీ నమోదు చేయాలి. తర్వాత ల్యాండ్ పాస్ బుక్ వివరాలు, రేషన్ కార్డు వివరాలు, బ్యాంకు పాస్ బుక్ వివరాలు నమోదు చేయాలి. అలాగే వాటి జిరాక్స్ కాపీలను అప్ లోడ్ చేయాలి.












Click it and Unblock the Notifications