పాక్ వ్యక్తిని రక్షించే కేజ్రీ... గర్ల్స్‌ని రక్షించలేరా: శివసేన
ఢిల్లీ/ముంబై: ఢిల్లీలో అత్యాచారాల అంశంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన శివసేన మండిపడింది. పాకిస్తాన్ నుంచి వచ్చే గులాం అలీని కాపాడగలికే కేజ్రీవాల్... ఢిల్లీలోని మహిళలను కాపాడలేరా అని గట్టి కౌంటర్ ఇచ్చారు.
పాక్ గాయకుడు గులాం అలీకి రక్షణ కల్పిస్తాం.. ఢిల్లీ రమ్మని ఆహ్వానించిన సిఎం కేజ్రీవాల్... మహిళలను మాత్రం ఎందుకు రక్షించలేకపోతున్నారని ప్రశ్నించింది. గులాం అలీ ముంబైలో ప్రదర్శన ఇవ్వడాన్ని శివసేన అడ్డుకుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయనను ఢిల్లీలో కచేరీ చేసేందుకు ఆహ్వానించారు. దానికి గులాం అలీ అంగీకరించారు. అనంతరం ఢిల్లీలో ఇద్దరు చిన్నారుల పైన అత్యాచారం జరిగింది. ఢిల్లీ పోలీసు యంత్రాంగమంతా కేంద్రం కిందే పని చేస్తోందని, అందుకే తాను ఏం చేయలేకపోతున్నానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
దీనిపై శివసేన స్పందించింది. పాకిస్తాన్ దేశస్థులను రక్షించగల కేజ్రీవాల్, తన రాష్ట్రంలోని మహిళలను మాత్రం ఎందుకు రక్షించలేకపోతున్నారని శివసేన అధికార పార్తినిధి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. భద్రత కేంద్రం పరిధిలో ఉందని చెబుతున్న కేజ్రీవాల్.. మహిళలను రక్షించకుండా పాక్ గాయకుడిని ఎలా రక్షించగలరన్నారు.












Click it and Unblock the Notifications