విహారం కామనే, మోదీకి భార్య లేదు కదా : ఆనంద్ శర్మ కాంట్రవర్సీ కామెంట్స్
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దంపతలు విహార యాత్రపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాహల్ సహా కీలక నేతలు కౌంటర్ అటాక్ చేశారు. ఒకడుగు ముందుకేసిన ఆనంద్ శర్మ .. మోదీకి ఫ్యామిలీ లేదని, భార్య ఉంటే విహార యాత్ర చేస్తేండేవారని విమర్శించారు.
విహారం కామనే కదా ...
'ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లడం సాధారణం. రాజీవ్ కూడా భార్య సోనియాగాంధీతో వెళ్లారు. ప్రస్తుత ప్రధాని మోదీకి భార్య లేదు, కుటుంబ విలువలు తెలియవు కాబట్టి ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. ఒక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు' అని మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలపై ఆనంద్ శర్మ భార్య అంశాన్ని లేవనెత్తడం వివాదాస్పదమవుతోంది. దీనిపై బీజేపీ కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేకం కాదు ...
ప్రధానిగా ఉన్న సమయంలో రాజీవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కాంగ్రెస్ నేతలు స్పష్టంచేశారు. ఇదివరకు రాజీవ్ కోసం ప్రత్యేకంగా విరాట్ తీసుకెళ్లడం గానీ, దాని రూట్ మార్చడం గానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా విధులు నిర్వహించిన రాందాస్ వివరణ ఇచ్చారు. విరాట్ నౌక లక్షదీవులకు వెళుతుందని రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని .. వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications