Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉప రాష్ట్రపతిగా కూటమి కింగ్?

Vice President of India: ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి, వైద్యుల సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఈ లేఖలో తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం వెంటనే తన రాజీనామా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ధన్ ఖర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగమమైంది. 74 సంవత్సరాల ధన్‌ఖర్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది.

If Nitish Kumar should become the Vice President of India would be good for Bihar says MLA

రాజ్యసభ ఛైర్మన్‌ కూడా అయిన ధన్‌ఖర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ఆ పార్టీ ప్రతిపాదించే నాయకుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు అవుతారనే చర్చ ఊపందుకుంటోంది. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ తెరపైకి వచ్చింది. ఆయనను తదుపరి ఉప రాష్ట్రపతిగా నియమించాలనే డిమాండ్లు ఊపందుకుంటోన్నాయి.. ప్రత్యేకించి బిహార్ రాజకీయాల్లో.

నితీష్ కుమార్ గత 20 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం కలిగి ఉండటం, కేంద్ర, రాష్ట్ర రాజకీయాలలో ఆయన పాత్రను పరిగణనలోకి తీసుకుని నితీష్ కుమార్ పేరును బీజేపీ ఎమ్మెల్యే హరి భూషణ్ ఠాకూర్ బచౌల్ ప్రతిపాదించారు. ఈ పదవికి నితీష్ కుమార్ అన్ని విధాలా సమర్థుడని అన్నారు.

If Nitish Kumar should become the Vice President of India would be good for Bihar says MLA

నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా చేయాలనే డిమాండ్‌ను ఆయన సొంత పార్టీ జనతాదళ్ (యునైటెడ్) కాకుండా బీజేపీ లేవనెత్తడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత తరుణంలో కుర్మీ సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ను ఉప రాష్ట్రపతిని చేస్తే బీసీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని బిహార్ బీజేపీ చెబుతోంది.

సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తోన్న నితీష్ కుమార్ ను ఈ ఎన్నికల్లో ఓడించాలంటూ జేడీయూ- కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు పిలుపునిస్తోన్నాయి. నితీష్ కుమార్ వయస్సును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తోన్నాయి. ఆయన పనితీరుపై సైతం ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బిహార్ పీఠంపై వేరొకరికి అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ పలుమార్లు మీడియా సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ పరిణామాల మధ్య నితీష్ కుమార్ ను ఉప రాష్ట్రపతిని చేయాలనే డిమాండ్ ఊపందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నితీష్ కుమార్ గత 20 ఏళ్లుగా బీహార్‌కు సేవ చేస్తున్నారని, రాజకీయాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉందని హరిభూషణ్ ఠాకూర్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+