వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన ఒక్కో జవాన్‌కు పదిమంది పాక్ సైనికులను చంపండి: సీఎం సంచలన వ్యాఖ్యలు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో అమరులైన ఒక్కో భారతీయ జవానుకు ప్రతిగా పదిమంది పాక్ సైనికులను చంపిపారేయాలని భారత ఆర్మీని ఉద్దేశించి అన్నారు.

తాజాగా కశ్మీర్‌లోని భారత సరిహద్దు వెంట పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా, రామ్‌గఢ్‌ సెక్టార్లలోని భారత ఔట్‌ పోస్టులపై బుధవారం రాత్రి నుంచి పాక్‌ కాల్పులు ప్రారంభించింది.

If one jawan dies, 10 of Pakistan's must die: Captain Amarinder Singh on ceasefire violations

ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ సురేష్ అమరుడయ్యాడు. ఆయనకు భార్య, 13 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల బాబు ఉన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

''మన జవాను ఒక్కరు చనిపోతే, పదిమంది పాక్ సైనికులను చంపాల్సిందే. నేను ఇదే చూడాలనుకుంటున్నా..'' అని ఆవేశంగా అన్నారాయన. మరోవైపు పాకిస్తాన్ తీరుపై హోంమంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ స్వభావంలో ఏమాత్రం మార్పు రావడం లేదని సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పంథాను కొనసాగిస్తే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలను మూసివేశారు.

English summary
Taking a strong stance against the rise of infiltration and ceasefire violations by Pakistani troops and terrorists, Punjab Chief Minister Amarinder Singh on Thursday said that Indian Army should give a stern response to the neighbouring nation. “I want, if one of our jawans dies, 10 of their's must die. That is how I look at life,” said Captain Singh. Singh was a part of Indian armed forces for a long time and also served as the Captian during the 1965 Indo-Pakistan War. Earlier today, Suresh, a jawan from Border Security Force (BSF) was killed after Pakistan opened fire and shelled Indian positions along the International Border in R S Pura sector of Jammu and Kashmir. Meanwhile, Hansraj Gangaram Ahir, the Minister of State Home Affairs, said, “I do not see any indication in a change in the attitude of Pakistan. If they keep doing this, they will receive a befitting reply from us, like it is happening now.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X