వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు... వారంతా సంఘ విద్రోహ శక్తులే'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్ధలకు పూర్తి స్ధాయిలో మద్దతిస్తున్న పాకిస్ధాన్ ప్రభుత్వం, ఐఎస్ఐఎస్‌లపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులకు సహాయ, సహకారాలు అందజేయడాన్ని వెంటనే ఆపాలని కోరారు.

ప్రపంచంలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరని, వారంతా సంఘ విద్రోహ శక్తులేనని చెప్పారు. ఉగ్రవాదులకు పాకిస్ధాన్ మద్దతు ఆపితేనే, దక్షిణాసియాలో పరిస్ధితి మెరుగుపడుతుందని చెప్పారు. పాకిస్ధాన్ దేశ స్వప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని వాడుకోవాడం ఆపాలని సూచించారు. ఉగ్రవాదం ప్రపంచాలని సవాలు విసురుతోందని, ఆధునిక పరిజ్ఞానంతో యువతను పెడమార్గం పట్టిస్తోందన్నారు.

If Pakistan stops aiding terror, South Asia situation will improve: Rajnath Singh

గత కొన్ని దశాబ్దలుగా దేశ సరిహద్దుల్లో పాక్ నుంచి టెర్రిరిజంను ఎదుర్కొంటున్న బాధిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. సరిహద్దుల్లో ఇప్పటికీ లష్కరే తోయిబా, జైష్ ఈ మహ్మద్ లాంటి సంస్ధలు తమ కార్యాకలాపాల్ని కొనసాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.

ఐఎస్ఐఎస్ బారిన భారతీయ ముస్లింలు ఆకర్షితులు కాకపోవడం సంతోషించే విషయమని అన్నారు. భారతీయ ముస్లింలు దేశభక్తులు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్ధితుల్లో దరిచేరనీయరని అన్నారు. రాజస్ధాన ప్రభుత్వం సర్ధార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్ వారితో కలిసి కౌంటర్-టెర్రరిజం పేరుతో మూడు రోజుల కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తుంది.

English summary
Launching a scathing attack on Pakistan, Union home minister Rajnath Singh said on Thursday if the neighbouring country stops supporting terrorists, the security situation in South Asia will improve significantly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X