Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సత్తా చాటిన కోల్‌కతా ఐఐఎం: భారీ ప్యాకేజీలతో 470మందికి ప్లేస్‌మెంట్లు

కోల్‌కతా నగరంలోని ఐఐఎమ్‌ విద్యార్థులు ప్లేస్‌మెంట్లలో సత్తా చాటారు. మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ చేస్తున్న విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు దక్కాయి. తమ విద్యా

కోల్‌కతా: నగరంలోని ఐఐఎమ్‌ విద్యార్థులు ప్లేస్‌మెంట్లలో సత్తా చాటారు. మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ చేస్తున్న విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు దక్కాయి. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలు అందుకున్నట్లు ఐఐఎమ్‌ ప్రతినిధులు తెలిపారు.

ఫిబ్రవరి రెండో వారంలో ఐఐఎమ్‌ కోల్‌కతా క్యాంపస్‌లో ప్రముఖ సంస్థలైన హెచ్‌ఎస్‌బీసీ, అవెండస్‌, ఏబీజీ, సీకే బిర్లా, అమెజాన్‌, విప్రో తదితర కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. కాగా, ఫైనాన్స్‌ రంగంలో ఎక్కువ మంది కొలువులు సాధించినట్లు ఐఐఎమ్‌ ప్రతినిధులు తెలిపారు.

iic culcutta

ఐఐఎమ్‌ కోల్‌కతా క్యాంపస్‌ నుంచి మొత్తం 474మంది ఎంపికైనట్లు వెల్లడించారు. వీరిలో కొంతమందికి అంతర్జాతీయ ఆఫర్లు కూడా అందాయని చెప్పారు. తమ విద్యార్థులు ఈ ఏడాది అత్యధికంగా రూ.70లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకున్నారని వివరించారు.

విదేశాల్లో పనిచేసేందుకు 90వేల యూరోల(రూ. 63లక్షలు) వార్షిక వేతనంతో తమ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినట్లు ఐఐఎమ్‌ తెలిపింది. ఫైనాన్స్‌ రంగంలో 29శాతం, కన్సల్టింగ్‌ విభాగంలో 22శాతం, జనరల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో 15శాతం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌లో 12శాతం, ఈ కామర్స్‌ అండ్‌ ఐటీ కంపెనీల్లో 14శాతం ఉద్యోగాలు పొందినట్లు ఐఐఎమ్‌ యాజమాన్యం వివరించింది. భారత్‌లో పని చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్దదని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+