నన్ను అడిగి రాయండి: ఐఐటీ ల్యాండ్ అకాడమీ కాంట్రోవర్సీపై సచిన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ సారథి, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తన పైన వచ్చిన మీడియా ఆరోపణలను ఆదివారం నాడు కొట్టి పారేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో అకాడమీ ఓపెన్ చేసేందుకు సచిన్ కొంత భూమి అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.
దీని పైన సచిన్ స్పందించారు. తాను ఐఐటీలో అకాడమీ ఓపెన్ చేసేందుకు ల్యాండ్ అడిగినట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. సచిన్ టెండుల్కర్ రాజ్యసభ సభ్యుడు. తన పైన జరిగిన ప్రచారం పైన ఆయన సామాజిక అనుసంధాన వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

తన పైన వచ్చిన కథనం తనను ఆందోళనకు గురి చేసిందని పేర్కొన్నారు. అది వాస్తవ దూర కథనం అని చెప్పారు. తాను ఎలాంటి అకాడమీని ప్రారంభించాలనుకోలేదని, అందుకు ఐఐటీ ఢిల్లీని కోరలేదని పేర్కొన్నారు. ఎవరైనా తన పైన కథనాలు రాసేముందు తనను అడిగి, అది సరైందో కాదో తెలుసుకోవాలని చెప్పారు.
I am appalled to read the stories that suggest some land has been asked from IIT-D for academy in my name.
— sachin tendulkar (@sachin_rt) December 28, 2014 I have not even planned any academy neither do I want any piece of land for any purpose.
— sachin tendulkar (@sachin_rt) December 28, 2014 Wish that basic facts are checked from me before publishing such fiction using my name.
— sachin tendulkar (@sachin_rt) December 28, 2014 











Click it and Unblock the Notifications