చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీపై విమర్శలు, నిషేధం: మద్రాసు ఐఐటీ వివాదాస్పద నిర్ణయం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: మద్రాసు ఐఐటీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రధాని నరేంద్రమోడీని, ఆయన విధివిధానాలను విమర్శించినందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంపై నిషేధం విధించింది. క్యాంపస్‌లోని అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఎస్సీ)పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

అంతకముందు ఈ గ్రూప్ ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ, ఏపీఎస్సీ పంచిన కరపత్రాలతో క్యాంపస్‌లోని కొందరు విద్యార్ధులు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేంద్ర మానవ వనరుల శాఖ అదేశాల మేరకు ఏపీఎస్పీ నిషేధిస్తున్నట్లు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రిస్కా మాథ్యూ లేఖలో పేర్కొన్నారు.

IIT-Madras bans student group for criticising PM Modi, his policies

ఐఐటీ డీన్ శివకుమార్ ఎమ్ శ్రీనివాసన్ ఏపీఎస్సీ కోఆర్డినేటర్స్‌కు ఈ విషయంపై ఘాటైన ఈమెయిల్ పంపారు. క్యాంపస్‌లోని కొన్ని హిందు మత సంస్ధలు తమపై ఫిర్యాదు చేశాయని ఆరోపిస్తున్న ఏపీఎస్పీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

English summary
In a controversial move, IIT-Madras has banned a discussion forum for students following an anonymous complaint that it tried to spread "hatred" against Prime Minister Modi by mobilizing SC/ST students to question government policies on the use of Hindi and the ban on cow slaughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X