టెక్కీలకు శుభవార్త: చెన్నై ఐఐటీ విద్యార్థికి రూ.1.39 కోట్లు, బంపరాఫర్లిస్తున్న కంపెనీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నై ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూల సందర్భంగా విద్యార్థులకు దిగ్గజ కంపెనీలు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ విద్యార్థికి రూ.1.39 కోట్ల భారీ ప్యాకేజీని అందించనున్నట్టు ప్రకటించింది.

టెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలు

చెన్నై ఐఐటీ క్యాంపస్‌లో పలు ఐటీ కంపెనీలు విద్యార్థులను తమ కంపెనీల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకొనే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డిసెంబర్ రెండవ తేదిన ప్రారంభమైంది.

పలు ఐటీ కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేసుకొనేందుకు క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ దపా క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం విద్యార్థులకు కంపెనీలు భారీ మొత్తంలో వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి.

చెన్నై ఐఐటీ విద్యార్థులకు బంపరాఫర్లు

చెన్నై ఐఐటీ విద్యార్థులకు బంపరాఫర్లు

ఐఐటీ మద్రాసులో ప్రస్తుతం జరుగుతున్న క్యాంపస్‌ నియామకాల్లో దిగ్గజ కంపెనీలు విద్యార్థులకు బంపరాఫర్లు దగ్గర చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఓ విద్యార్థికి రూ. 1.39 కోట్ల భారీ ప్యాకేజీని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ట్యాక్సీ సేవల సంస్థ ఉబర్‌ ఓ విద్యార్థికి రూ. 99.87 లక్షల ప్యాకేజీని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరో ఐటీ దిగ్గజం యాపిల్ తొలిసారిగా రూ.15 లక్షల ప్యాకేజీని ఇచ్చేందుకు నిర్ణయించింది.

ఐఐటీ చెన్నై విద్యార్థులపై కంపెనీల ఆసక్తి

ఐఐటీ చెన్నై విద్యార్థులపై కంపెనీల ఆసక్తి

చెన్నైలోని ఐఐటీ విద్యార్థులపై పలు కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. గోల్డ్‌ మన్‌ సాక్స్‌, ఐబీఎం, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఐటీసీ, శాంసంగ్ తదితర ఎన్నో కంపెనీలు, ఈ రిక్రూట్ మెంట్ లో పాల్గొంటున్నాయి. ఐఐటీ చెన్నై విద్యార్థుల అపూర్వ ప్రతిభ కారణంగానే కంపెనీలు భారీ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీ ఐఐటీలో కూడ భారీ ప్యాకేజీలు

ఢిల్లీ ఐఐటీలో కూడ భారీ ప్యాకేజీలు

ఢిల్లీ ఐఐటీలో కూడ క్యాంపస్ రిక్రూట్ మెంట్లు సాగుతున్నాయి. ప్రాంగణ నియామకాల్లో మైక్రోసాఫ్ట్‌, ఉబర్‌ సహా 15 కంపెనీలు, బొంబాయి ప్రాంగణ నియామకాల్లో 17 కంపెనీలు పాల్గొన్నాయి. ఈనెల 15వ తేదీ వరకు తొలి దశ, నెలాఖరు వరకు రెండో దశ ప్రాంగణ నియామకాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.

జోరుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు

జోరుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు


దేశంలోని పలు ఐఐటీ క్యాంపస్‌లలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే విద్యార్థులను ఎంపిక చేసుకొనే కంపెనీల సంఖ్య 250 పెరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌లో 99 మంది, ఐఐటీ రూర్కీలో 68 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IIT placements: Day 1; Microsoft makes Rs 1.39-crore offerTHE FIRST day of placements at the Indian Institutes of Technology (IITs) was off to a good start on Friday as offshore offers with pay packages above Rs 1 crore were made to students.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి