Illegal affair: బెడ్ రూమ్ లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కన్నింగ్ భార్య, ఏదో అనుకుంటే !
బెంగళూరు/మండ్య: యువతి, యువకుడికి పెళ్లి జరిపించాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. యువతి, యువకుడి అంగీకారంతో పెళ్లి జరిగింది. దంపతులు ఐటీ హబ్ లో కాపురం పెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు భర్త డబ్బు సంపాదనతో బిజీగా ఉంటున్నాడు. కొంతకాలం నుంచి దంపతుల మద్య ఫైటింగ్ జరుగుతోంది. మూర్చవ్యాదితో తన భర్త చనిపోయాడని భార్య ఆమె భర్త శవాన్ని అంబులెన్స్ లో సొంతఊరికి తీసుకెళ్లింది అంత్యక్రియలు చెయ్యడానికి బంధువులు అందరికి సమాచారం ఇచ్చారు, అంత్యక్రియలకు ముందు భర్త శవానికి స్నానం చేయిస్తున్న సమయంలో అతని శరీరం మీద గాయాలు చూసిన అతని కుటుంబ సభ్యులకు అనుమానం మొదలుకావడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

కొన్ని నెలల క్రితమే పెళ్లి
కర్ణాటకలోని మండ్యలో మహేష్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మండ్య జిల్లాలోనే శిల్పా (27) అనే యువతి నివాసం ఉంటున్నది. మహేష్, శిల్పాకు పెళ్లి జరిపించాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. మహేష్, శిల్పా అంగీకారంతో కొన్ని నెలల క్రితం మండ్యాలో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.

బెంగళూరులో కాపురం
వివాహం చేసుకున్న మహేష్, శిల్పా దంపతులు ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని కోణెనకుంట క్రాస్ లో కాపురం పెట్టారు. వివాహం జరిగిన తరువాత మహేష్, శిల్పా దంపతులు చాలాసార్లు మండ్య వెళ్లి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు మహేష్ డబ్బు సంపాదనతో బిజీగా ఉంటున్నాడు. భర్త మహేష్ బయటకు వెళ్లి వస్తుంటే అతని భార్య శిల్పా మాత్రం ఇంట్లోనే ఉంటున్నది.

ప్రియుడితో జల్సా చేస్తున్న భార్య
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శిల్పా అసలు సినిమా స్టోరీ మొదలుపెట్టింది. భర్త మహేష్ బయటకు వెళ్లిన తరువాత శిల్పా ఆమె ప్రియుడు బాబుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. కొంతకాలంగా శిల్పా ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లి జల్సా చెయ్యడం మొదలుపెట్టింది.

ప్రియుడితో తిరుగుతూ భర్తకు చిక్కిపోయిన భార్య
ఇటీవల మహేష్ కు అతని భార్య శిల్పా మీద అనుమానం మొదలైయ్యింది. భార్య శిల్పాకు బయటకు వెలుతున్నానని చెప్పిన మహేష్ ఆమెకు తెలీకుండా ఆమె మీద నిఘా వేశాడు. భర్త మహేష్ బెంగళూరులో లేడని అనుకున్న శిల్పా ప్రియుడితో తిరుగుతూ ఆమె భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. ఇదే విషయంలో శిల్పా, మహేష్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భర్తను చంపేసి నాటకాలు
మహేష్ అతని భార్య శిల్పా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. శిల్పా మొబైల్ ఫోన్ లాక్కొని ఆమె ప్రియుడు బాబుతో మాట్లాడకుండా చేశాడు. తన భర్త బతికుంటే తన విలాసాలకు తిరగడం కదరదని శిల్పా రగిలిపోయింది. రాత్రి ప్రియుడు బాబును ఇంటికి పిలిపించుకున్న శిల్పా నిద్రపోతున్న ఆమె భర్త మహేష్ గొంతునులిమి చంపేసింది.

కిలాడీ పెళ్లామ్ స్కెచ్
తన భర్త మహేష్ మూర్చవ్యాదితో చనిపోయాడని అందరికి ఫోన్లు చేసి చెప్పింది. మూర్చవ్యాదితో తన భర్త మహేష్ చనిపోయాడని అందరిిక చెప్పిన శిల్పా ఆమె భర్త శవాన్ని అంబులెన్స్ లో మండ్యాకు తీసుకెళ్లింది. మహేష్ శవానికి అంత్యక్రియలు చెయ్యడానికి బంధువులు అందరికి సమాచారం ఇచ్చారు,

శరీరం మీద గాయాలు
అంత్యక్రియలకు ముందు మహేష్ శవానికి స్నానం చేయిస్తున్న సమయంలో అతని శరీరం మీద, గొంతు మీద గాయాలు చూసిన అతని కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శిల్పాను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ బయటకు వచ్చింది.

ప్రియుడి కోసం కిలాడీ లేడీ ఎంతకు తెగించింది ?
మహేష్ ను గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం లో వెలుగు చూసింది. పోలీసులు శిల్పాను అరెస్టు చేసిన తరువాత ఆమె ప్రియుడు పరారైనాడు. చివరికి శిల్పాను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. భర్త మహేష్ ను చంపేసి ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న శిల్పాకు చివరికి చిప్పకూడు మిగిలింది.












Click it and Unblock the Notifications