Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఏమే, నీకు నా మొగుడే కావాలా ?, భార్య ఏం చేసిందంటే ?, ఫ్రెండ్స్ తో కలిసి !

సూరత్/ అహమ్మదాబాద్/ చెన్నై: ఇంట్లో చూసి యువకుడితో వివాహం చేసుకున్న యువతి హ్యాపీగా భర్తతో కలిసి జీవిస్తోంది. సంతోషంగా సాగిపోతున్న భార్య ఆమె భర్త తీరుతో అనుమానం పెంచుకునింది. సంతోషంగా తనతో కాపురం చేస్తున్న భర్త కొంత కాలంగా తనతో ఎందుకు అంటిముట్టనట్లు ఉంటున్నాడు ? అని భార్య ఆలోచించింది. తన భర్త పని చేస్తున్న కంపెనీలో కిలాడీ లేడిని తగులుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్యకు తెలిసింది. తనతో కాపురం చెయ్యాల్సిన భర్త వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్నాడని, నా మొగుడి ఎవరితోనో కులుకుతున్నాడని భార్య రగిలిపోయింది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళలను వెంట పెట్టుకుని భర్త ప్రియురాలి ఇంటి దగ్గరకు వెళ్లిన భార్య రెచ్చిపోయింది. ఇంట్లో ఉన్న భర్త ప్రియురాలిని బయటకు లాగి ఏమే, నీకు నా మొగుడే కావాలా ? అంటూ రెచ్చిపోయిన భార్య చేసిన పనితో చుట్టుపక్కల వాళ్లు షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అసలు కథ తెలుసుకుని రంగంలోకి దిగారు.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

గుజరాత్ లోని సూరత్ లో రంజిత్, సలోని (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంట్లో చూసిన రంజిత్ ను వివాహం చేసుకున్న సలోని భర్తతో హ్యాపీగా కలిసి జీవిస్తోంది. తన భర్త రంజిత్ తనను బాగా చూసుకోవాలని, తనను సుఖ పెట్టాలని సలోని కలలు కంటోంది.

నా భర్తకు ఏమైయ్యింది ?

నా భర్తకు ఏమైయ్యింది ?

సంతోషంగా కాపురం సాగిపోతున్న సమయంలో సలోనికి ఆమె భర్త రంజిత్ తీరుతో అనుమానం పెంచుకునింది. సంతోషంగా తనతో కాపురం చేస్తున్న భర్త రంజిత్ కొంత కాలంగా తనతో ఎందుకు అంటిముట్టనట్లు ఉంటున్నాడు ?, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తున్నాడు అంటూ భార్య సలోని ఆలోచించింది.

భర్త మీద నిఘా వేసిన భార్య

భర్త మీద నిఘా వేసిన భార్య

ఉదయం ఇంట్లో నుంచి భర్త రంజిత్ బయటకు వెళ్లిపోయిన తరువాత అతను ఏం చేస్తున్నాడు ?, ఎవరెవరిని కలుస్తున్నాడు ?, ఎక్కడికి వెలుతున్నాడు ? అంటూ అతని భార్య సలోని ఆరా తియ్యడం మొదలు పెట్టింది. తెలిసిన వాళ్ల సహాయంతో భర్త రంజిత్ మీద అతని భార్య సలోని నిఘా పెట్టించింది.

నా మొగుడికి ఓ ఫిగర్ ఉందా ?

నా మొగుడికి ఓ ఫిగర్ ఉందా ?

భర్త రంజిత్ మీద నిఘా వేసిన కొందరు సీక్రేట్ ఏజెంట్లు (తెలిసిన వాళ్లు) సలోనికి కొంత సమాచారం ఇచ్చారు. నీ భర్త కంపెనీలో ఉద్యోగం చేస్తున్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో తిరిుగుతున్నాడని, ఇలాగే వదిలేస్తే నీకు విడాకులు ఇచ్చేసి ఆమెను ఉండిపోతాడని లేనిపోనివి సలోనికి నూరిపోశారని తెలిసింది. తన భర్త రంజిత్ పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కిలాడీ లేడి స్వప్నాను తగులుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య సలోనికి తెలిసింది.

నాతో కాపురం చెయ్యకుండా దానితో జల్సా చేస్తాడా ?

నాతో కాపురం చెయ్యకుండా దానితో జల్సా చేస్తాడా ?

తనతో కాపురం చెయ్యాల్సిన నా భర్త రంజిత్ వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్నాడని, నా మొగుడితో స్వప్నా కులుకుతోందని భార్య సలోని రగిలిపోయింది. కొన్ని రోజుల క్రితం భర్త రంజిత్ ఆమె ప్రియురాలు స్వప్నాతో తిరుగుతున్న సమయంలో దూరం నుంచి చూసిన సలోని వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారని సమాచారం. అప్పటి నుంచి స్వప్నా భరతం పట్టాలని సలోని డిసైడ్ అయ్యింది.

నా మొగుడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా ?

నా మొగుడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా ?

చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళలతో మాట్లాడిన సలోని తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు బుద్ది చెప్పాలని, మీరు నా వెంట రావాలని చెప్పింది. పక్కింటిలో నివాసం ఉంటున్న ముగ్గురు మహిళలు (ఫ్రెండ్స్) సలోని వెంట బయలుదేరి నేరుగా స్వాప్నా ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంట్లో ఉన్న స్వప్నాను ఆమె జుట్టుపట్టుకుని బయటకు లాగి నామొగుడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ సలోని రెచ్చిపోయింది.

రెచ్చిపోయి జట్టు కత్తిరించిన భార్య

రెచ్చిపోయి జట్టు కత్తిరించిన భార్య

నీకు నా మొగుడే చిక్కాడా, నీ అందం, నీ జట్టు చూసి నా మొగుడు నీ వలలో పడిపోయాడా అంటూ సలోని రెచ్చిపోయింది. స్వప్నా బట్టలు చించేసి అసభ్యంగా ప్రవర్తించిన సలోని తదితరులు ఆమెజు జట్టు పట్టుకుని చితకబాదేశారని సమాచారం. అంతటితో కోపం తగ్గకపోవడంతో సాటి మహిళల సహాయంతో సలోని భర్త ప్రియురాలు స్వప్నా జుట్టును కత్తెరతో కత్తిరించి రోడ్డు మీద వెంట్రుకలు విసిరేసి నలుగురిలో ఆమెను అవమానించింది.

నడిరోడ్డులో రెచ్చిపోయిన భార్య

నడిరోడ్డులో రెచ్చిపోయిన భార్య

స్వప్నాను ఆమె ఇంటి ముందే చితకబాది జట్టు కత్తిరించడంతో చుట్టుపక్కల వాళ్లు సినిమా చూసినట్లు చూశారే తప్పా సలోని తదితరులను అడ్డుకోలేదని సమాచారం. బాధితురాలు స్వప్నా ఫిర్యాదు చెయ్యడంతో సూరత్ పోలీసులు రంజిత్ భార్య సలోనితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. బాధితురాలు స్వప్నా మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ అని, ఉద్యోగం కోసం సూరత్ వచ్చి ఉంటోందని సూరత్ పోలీసు అధికారులు చెప్పారు. భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య నడిరోడ్డులో చేసిన పని గురించి తెలుసుకున్న సూరత్ ప్రజలు షాక్ అయ్యారు.

Recommended Video

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
    అతను నాకు ఫ్రెండ్ మాత్రమే

    అతను నాకు ఫ్రెండ్ మాత్రమే

    సలోని భర్త రంజిత్ కు, స్వప్నాకు అక్రమ సంబంధం ఉందా ?, లేక ఇద్దరూ స్నేహితులా అనే విషయంలో క్లారిటీ లేదని పోలీసులు అంటున్నారు. సలోని భర్తతో తనకు స్నేహితుడు మాత్రమే అని బాధితురాలు స్వప్నా అంటోందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. సర్వసాధారణంగా ఇలాంటి సంగటనలు తమిళనాడులో జరుగుతుంటాయని, ఇప్పుడు గుజరాత్ లో కూడా మొదలైనాయని కొందరు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+