Illegal affair: శంకర్ రెడ్డి హత్య కేసులో ట్విస్ట్, భర్త శవం పక్కన పడుకొని రాణి డ్రామాలు, అర్దరాత్రి ఇంట్లో !
బెంగళూరు/చిత్తూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చిన దంపతులు ఇక్కడే కాపురం ఉంటున్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో అకౌటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్య, పిల్లలను ఏలోటు లేకుండా చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. రాత్రి పిల్లలతో కలిసి దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి పొద్దుపోయిన తరువాత తన అకౌంటెంట్ ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు. అకౌంటెంట్ పక్కనే ఉన్న అతని భార్యకు గాయాలైనాయి. అకౌంటెంట్ పిల్లలు కేకలు వేశారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి అకౌంటెంట్ ను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో అతని ప్రాణం పోయిందని వెలుగు చూసింది. గుర్తు తెలియన వ్యక్తి ఇంట్లోకి వచ్చిన తన భర్తను చంపేశాడని, తన మీద కత్తితో దాడి చేసి మంగళసూత్రం, నగలు లాక్కొని పరారైనాడని భార్య పోలీసులకు చెప్పింది. పోలీసులు ఇదంతా నిజం అని నమ్మేశారు. అయితే భార్య దగ్గర మంగళసూత్రం చిక్కడంతో అక్కడ కథ మలుపు తిరిగింది. చిత్తూరుకు చెందిన శంకర్ రెడ్డిని అతని భార్య రాణి హత్య చేయించిందని వెలుగు చూసింది. అక్రమ సంబంధం కారణంగా భర్త శంకర్ రెడ్డిని చంపించిన అతని భార్య రాణి భర్త శవం పక్కనే పడుకుని పిల్లల ముందు, స్థానికుల ముందు నాటకాలు ఆడిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

సంతోషంగా జీవించిన శంకర్ రెడ్డి, రాణి దంపతులు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన శంకర్ రెడ్డి (35) అనే వ్యక్తి ఢిల్లీ రాణి అలియాస్ రాణి (28) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న శంకర్ రెడ్డి, రాణి దంపతులు మొదట్లో చాలా సంతోషంగా కాపురం చేశారని వాళ్ల కుటుంబ సభ్యులు అంటున్నారు.

బెంగళూరులో కాపురం
బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చిన శంకర్ రెడ్డి, రాణి దంపతులు యశవంతపురంలోని ఎంకే నగర్ లో కాపురం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో శంకర్ రెడ్డి అకౌటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్న శంకర్ రెడ్డి అతని భార్య రాణి, పిల్లలను ఏలోటు లేకుండా చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు.

రాత్రి భోజనం చేసి నిద్రపోయారు
రాత్రి ఇంటికి వెళ్లిన శంకర్ రెడ్డి అతని భార్య రాణి, పిల్లలతో కలిసి నిద్రపోయారు. రాత్రి పొద్దుపోయిన తరువాత అకౌంటెంట్ శంకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కత్తితో పొడిచి చంపేశాడు. అకౌంటెంట్ శంకర్ రెడ్డి పక్కనే ఉన్న అతని భార్య రాణికి గాయాలైనాయి. ఆ సమయంలో అకౌంటెంట్ శంకర్ రెడ్డికి తీవ్రగాయాలైనాయి.

శంకర్ రెడ్డి భార్య ఏం చెప్పిందంటే ?
చుట్టుపక్కల వాళ్లు వచ్చి అకౌంటెంట్ శంకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో శంకర్ రెడ్డి ప్రాణం పోయిందని వెలుగు చూసింది. గుర్తు తెలియన వ్యక్తి ఇంట్లోకి వచ్చిన తన భర్త శంకర్ రెడ్డిని చంపేశాడని, తన మీద కత్తితో దాడి చేసి మంగళసూత్రం, నగలు లాక్కొని పరారైనాడని శంకర్ రెడ్డి భార్య రాణి యశవంతపురం పోలీసులకు చెప్పింది.

కిలాడీ పెళ్లామ్ స్టోరీ ఏమిటంటే ?
పోలీసులు శంకర్ రెడ్డి భార్య రాణి చెప్పిందంతా నిజం అని నమ్మేశారు. అయితే శంకర్ రెడ్డి భార్య రాణి దగ్గర మంగళసూత్రం చిక్కడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. శంకర్ రెడ్డి భార్య రాణికి ఆసుపత్రిలో చికిత్స అందించి తరువాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

భర్తను చంపేంచి శవం పక్కనే పడుకున్న భార్య
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన శంకర్ రెడ్డిని అతని భార్య రాణి హత్య చేయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాణికి అక్రమ సంబంధం ఉందని పోలీసులు అంటున్నారు. అక్రమ సంబంధం కారణంగా భర్త శంకర్ రెడ్డిని చంపించిన అతని భార్య రాణి భర్త శవం పక్కనే పడుకుని పిల్లల ముందు, స్థానికుల ముందు నాటకాలు ఆడిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. రాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శంకర్ రెడ్డిని హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.