Girlfriend: అక్రమ సంబంధం, రెండో పెళ్లికి ప్రియురాలు రెడీ, నా కోరికలు ఎవరు తీరుస్తారు, చెప్పు !

బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. మహిళకు తక్కువ వయసు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. అదే ఏరియాలో ఓ మహిళను వివాహం చేసుకున్న వ్యక్తికి పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన మహితో అతనికి పరిచయం కావడం, తరువాత ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడం చకచకా సాగిపోయాయి. భర్త చనిపోయిన మహిళను వేరే పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. మహిళ కూడా వేరే పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరువాత అక్కడ వ్యవహారం మొత్తం చెడింది.

భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ సమీపంలోని మత్తడహళ్లి ప్రాంతంలో హబీబా తాజ్ (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఆరు సంవత్సరాల క్రితం హబీబా తాజ్ కు ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. ఓ యువకుడిని వివాహం చేసుకున్న హబీబా తాజ్ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. హబీబా భర్త గత ఏడాది అనారోగ్యంతో చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత హబీబా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటున్నది.

 రొమాన్స్ చేద్దాం రా

రొమాన్స్ చేద్దాం రా

ఆర్ టీ నగర్ లో షేక్ మొహబూబ్ అలియాస్ మహబూబ్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మొహబూబ్ కు వేరే యువతితో వివాహం అయ్యింది. మొహబూబ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న మొహబూబ్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ప్రతిరోజు బెంగళూరు మొత్తం తిరుగుతున్న మొహబూబ్ కు భర్త చనిపోయిన హబీబా తాజ్ పరియయం అయ్యింది.

 అక్రమ సంబంధం..... ఎంజాయ్

అక్రమ సంబంధం..... ఎంజాయ్

ఇద్దరు పిల్లలకు తల్లి హబీబా, ఇప్పటికే పెళ్లి చేసుకున్న మొహబూబ్ కు ఎక్కువ చనువు పెట్టుకున్నారు. ఆటోడ్రైవర్ మొహబూబ్, హబీబ్ తాజ్ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. గత ఏడాది నుంచి వీరిద్దరూ అక్రమ సంబందం కొనసాగించారు. అయితే నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలని హబీబా తాజ్ మీద ఆమె కుటుంబ పెద్దలు ఒత్తిడి చేశారు. రెండో పెళ్లి చేసుకుంటే తనకు సమాజంలో గౌరవం, భద్రత లభిస్తాయని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్న హబీబా తాజ్ సంతోషంగా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

 నా కోరికలు ఎవరు తీరుస్తారు

నా కోరికలు ఎవరు తీరుస్తారు

నేను వేరే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, ఇక్కడితే మన అక్రమ సంబంధాన్ని నిలిపివేద్దామని హబీనా తాజ్ ఆమె ప్రియుడు మొహబూబ్ కు చెప్పింది. అప్పటికే తనతో అక్రమ సంబందం పెట్టుకున్న హబీబా తాజ్ వేరే పెళ్లి చేసుకునేందుకు మొహబూబ్ అంగీకరించలేదు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నా కోరికలు ఎవరు తీరుస్తారు అంటూ మొహబూబ్ నానా హంగామా చేశాడు. ఆ విషయంలో హబీబా తాజ్, మొహబూబ్ తాజ్ ల మధ్య గొడవ మొదలైయ్యింది.

 అర్దరాత్రి ఇంట్లోనే చంపేసిన కిరాతకుడు

అర్దరాత్రి ఇంట్లోనే చంపేసిన కిరాతకుడు

హబీబా తాజ్, మొహబూబ్ లమద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో హబీబా తాజ్ ఇంటికి వెళ్లిన మొహబూబ్ ఆమె రెండో పెళ్లి విషయంలో గొడవ పడ్డారు. ఆ సమయంలో నిందితుడు షేక్ మొహబూబ్ కత్తితో అతని ప్రియురాలు హబీబా తాజ్ ను దారుణంగా పొడిచేశారు. హబీబా తాజ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. అనంతరం ఇరుగుపొరుగు వారు వచ్చి హబీబా తాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స విఫలమై హబీబా తాజ్ మృతి చెందిందని పోలీసులు అన్నారు. హబీబా తాజ్ ను పొడిచేసిన నిందితుడు మొహబూబ్ అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి ఆర్ టీ నగర పోలీసులు మొహబూబ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 రోడ్డున పడిన పిల్లలు

రోడ్డున పడిన పిల్లలు

అప్పటికే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నపిల్లలకు తండ్రి లేరనే బాధ రాకూడదని హబీబా తాజ్ ఇంతకాలం పెంచి పోషించింది. అయితే, ఇప్పుడు హబీబా తాజ్ కూడా అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురి కావడంతో ఆమె ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. ఇక్క హబీబా తాజ్ ను హత్య చేసిన ఆటో డ్రైవర్ మోహబూబ్ కూడా అరెస్టు కావడంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. అక్రమ సంబంధం కారణంగా రెండు ఫ్యామిలీలలోని నలుగురు చిన్నారు ఇప్పుడు దిక్కులేనివారు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+