Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్త లేడు, నాటుకోడి లేడీతో మేస్త్రీ మస్త్ మజా, చంపేసి శవం పక్కన నిద్రపోయి !

బెంగళూరు/ చిక్కబళ్లాపురం: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. అనారోగ్యంతో భర్త చనిపోయాడు. భర్త చనిపోవడం, మహిళ నాటుకోడి లాగా బలంగా, గుడ్రంగా ఉండటంతో మేస్త్రీకి ఆమె మీద కన్నుపడింది. భర్త లేకపోవడంతో విరహంతో ఉన్న మహిళ కూడా మేస్త్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .అప్పటి నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో మేస్త్రీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రి మహిళను ఇంటికి పిలిపించుకున్న మేస్త్రీ ఆమెతో ఎంజాయ్ చేశాడు. మోజు తీర్చుకున్న తరువాత ఇద్దరి మద్య ఓ విషయంలో గొడవ జరిగింది. అంతే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను దారుణంగా చంపేసి పీడపోయింది అనుకున్న ప్రియుడు పీకలదాక మద్యం సేవించి ఆమె శవం పక్కనే నిద్రపోవడం కలకలం రేపింది.

 భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా (బెంగళూరు శివార్లు) గౌరిబిదనూరు తాలు సాదేనహళ్ళి (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లో అంజినమ్మ అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం అంజినమ్మ వివాహం జరిగింది. అంజినమ్మ దంపతులకు పిల్లలు లేరు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అంజినమ్మ భర్త చనిపోయాడు.

 పనికోసం చిక్కబళ్లాపురంకు మకాం మార్చింది

పనికోసం చిక్కబళ్లాపురంకు మకాం మార్చింది

సొంత ఊర్ల పని లేకపోవడంతో పొట్టకూటి కోసం అంజినమ్మ చిక్కబళ్లాపురం చేరుకుంది. చిక్కబళ్లాపురంలో నివాసం ఉంటున్న అంజినమ్మ మేస్త్రీ వేణుగోపాల్ అనే వ్యక్తి దగ్గర భవన నిర్మాణ కార్మికురాలిగా పనిలో చేరింది. చాలాకాలంగా మేస్త్రీ వేణుగోపాల్ దగ్గర అంజినమ్మ పని చేస్తోంది.

 నాటుకోడిలా ఉందని వలలో వేసుకున్న మేస్త్రీ

నాటుకోడిలా ఉందని వలలో వేసుకున్న మేస్త్రీ

అంజినమ్మ భర్త చనిపోవడం, ఆమె నాటుకోడి లాగా బలంగా, గుడ్రంగా ఉండటంతో మేస్త్రీ వేణుగోపాల్ కు ఆమె మీద కన్నుపడింది. భర్త లేకపోవడంతో విరహంతో ఉన్న అంజినమ్మ కూడా మేస్త్రీ వేణుగోపాల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరువాత మేస్త్రీ వేణుగోపాల్, అంజినమ్మ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

 ఇద్దరూ మోజు తీర్చుకుంటున్నారు

ఇద్దరూ మోజు తీర్చుకుంటున్నారు

మేస్త్రీ వేణుగోపాల్ దగ్గర పని చేస్తున్న అంజినమ్మ అతనితో మాట్లాడుతుంటే మొదట ఎవ్వరికి అనుమానం రాలేదు. భర్త చనిపోయిన అంజనమ్మ ఆమె మోజు తీర్చుకోవడమే కాకుండా మేస్త్రీ వేణుగోపాల్ కు ఎలాకావలంటే అలా అతని కోరికలు తీర్చి ఆమె అవసరాలకు డబ్బులు తీసుకుంటూ కాలం గడిపింది.

 ఇంటికి పిలిపించుకున్న మేస్త్రీ

ఇంటికి పిలిపించుకున్న మేస్త్రీ

చిక్కబళ్లాపురంలోని నక్కలకుంటలోని శాంతినగర్ లో సొంత ఇంటిలో మేస్త్రీ వేణుగోపాల్ నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణుగోపాల్ భార్య ఊరికి వెళ్లింది. తన ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండటంతో అక్కడే ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న వేణుగోపాల్ అతని ప్రియురాలు అంజినమ్మను ఆదివారం అతని ఇంటికి పిలిపించుకున్నాడు.

 ప్రియురాలిని ఇంట్లోనే చంపేశాడు

ప్రియురాలిని ఇంట్లోనే చంపేశాడు

ఆదివారం రాత్రి మద్యం సేవించిన మేస్త్రీ వేణుగోపాల్ అతని ప్రియురాలు అంజినమ్మతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. అంజినమ్మను ఇంటికి పిలిపించుకున్న మేస్త్రీ వేణుగోపాల్ రాత్రి పొద్దుపోయే వరకు ఆమెతో ఎంజాయ్ చేశాడు. మోజు తీర్చుకున్న తరువాత వేణగోపాల్, అంజినమ్మల మద్య పెళ్లి చేసుకునే విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. అంతే అక్రమ సంబంధం పెట్టుకున్న అంజినమ్మను పెద్ద కర్రతొ కొట్టిన మేస్త్రీ వేణుగోపాల్ ఆమెను దారుణంగా ఇంట్లోనే చంపేశాడు.

 రక్తం దుర్వాసన రాకుండా ఉప్పు చల్లిన కేటుగాడు

రక్తం దుర్వాసన రాకుండా ఉప్పు చల్లిన కేటుగాడు

అంజినమ్మను చంపేసిన వేణుగోపాల్ మద్యం మత్తులో ఆమె శవాన్ని బయటకు తరలించడానికి ప్రయత్నించినా వీలుకాలేదని తెలిసింది. అంజినమ్మ హత్య చెయ్యడంతో ఆమె రక్తం ఇంట్లో కారిపోవడంతో దుర్వాసన రాకుండా ఉండటానికి వేణుగోపాల్ ఆ రక్తం శుభ్రం చేసి అక్కడ, శవం మీద ఉప్పు చల్లాడు.

 పీకలదాక తాగేసి శవం పక్కన నిద్రపోయాడు

పీకలదాక తాగేసి శవం పక్కన నిద్రపోయాడు

అప్పటికే మద్యం సేవించిన వేణుగోపాల్ తరువాత మరో రెండు క్వాటర్లు తాగేసి ప్రియురాలు అంజినమ్మ శవం పక్కనే హాయిగా నిద్రపోయాడు. రెండు రోజులు అయినా మేస్త్రీ వేణుగోపాల్ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అతని దగ్గర పని చేస్తున్న వాళ్లు వెళ్లి చూడగా అంజినమ్మ శవం పక్కన అతను నిద్రపోతున్న విషయం వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+