Girlfriend: గర్ల్ ఫ్రెండ్ కళ్లల్లో ఆనందం కోసం కొత్త పెళ్లి కూతురిని చంపేసిన భర్త, సీన్ లో గర్ల్ ఫ్రెండ్, లేడీ
ఆగ్రా/లక్నో: ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగానే ఉన్నారని అందరూ అనుకున్నారు. కొత్త జంట జీవితాంతం సుఖంగా జీవించాలని కుటుంబ సభ్యులు, బంధులు ఆశపడ్డారు. భార్యతో ఆమె భర్త సంతోషంగా ఉన్నట్లు పైకి నటించాడు. రాత్రి దంపతులు భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు భార్య శవమై కనిపించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న యువతి గొంతును గుడ్డతో బలంగా బిగించి ఆమె ముఖం మీద దిండుపెట్టి ఊపిరిరాకుండా చేసి చంపేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. భార్య హత్య కేసులో ఆమె భర్తతో పాటు అతని గర్ల్ ఫ్రెండ్, వాళ్ల స్నేహితురాలు అరెస్టు కావడం కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగా కొత్త పెళ్లి కూతురు హత్యకు గురైయ్యిందని వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ కేసులో వివరాలు బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.

ఆరు నెలల క్రితం పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో నాగ్లే హవేలీ ప్రాంతంలో ఉపేంద్ర సింగ్ అలియాస్ ఉపేంద్ర అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రీతి (25) అనే యువతని ఉపేంద్ర సింగ్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సెట్ చేసిన ప్రీతిని పెళ్లి చేసుకున్న ఉపేంద్ర సింగ్ భార్యతో సంతోషంగా ఉన్నట్లు నటించాడు.

సంతోషంగా ఉంటారని అనుకున్నారు
ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఉపేంద్ర సింగ్, ప్రీతి దంపతులు సంతోషంగానే ఉన్నారని అందరూ అనుకున్నారు. ఉపేంద్ర సింగ్, ప్రీతి జీవితాంతం సుఖంగా జీవించాలని కుటుంబ సభ్యులు, బంధులు ఆశపడ్డారు. భార్య ప్రీతితో ఆమె భర్త ఉపేంద్ర సింగ్ సంతోషంగా ఉన్నట్లు నటించి అందరిని నమ్మించాడు.

పెళ్లికి ముందే భర్తకు లవ్ స్టోరి
ఉపేంద్ర సింగ్ ప్రీతిని పెళ్లి చేసుకోకముందు నుంచి మోనికా భరద్వాజ్ అలియాస్ మోనికా అనే యువతితో తిరుగుతున్నాడు. మోనికా, ఉపేంద్ర సింగ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే మోనికాను ఉపేంద్ర సింగ్ పెళ్లి చేసుకోవడం అతని కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిసింది.

ప్రియురాలి సహాయంతో భార్యను చంపేశాడు
రాత్రి ఉపేంద్ర సింగ్, అతని భార్య ప్రీతి భోజనం చేసి నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత ఉపేంద్ర సింగ్ అతని ప్రియురాలు మోనికాను, మరో స్నేహితురాలు పల్లవిని ఇంటికి పిలిపించుకున్నాడు. తరువాత మోనికా, పల్లవి కలిసి నిద్రపోతున్న ప్రీతి కాళ్లు చేతులు గట్టిగా పట్టుకున్నారని, భర్త ఉపేంద్ర సింగ్ గుడ్డ తీసుకుని అతని భార్య ప్రీతి గొంతు బిగించి, ఆమె ముఖం మీద దిండుపెట్టి ఊపిరిరాకుండా చంపేశాడు.

భర్తకు అక్రమ సంబంధం
భార్య ప్రీతిని చంపేసిన ఉపేంద్ర సింగ్ ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని డ్రామాలుఆడాడు. అయితే పోలీసులు ఉపేంద్ర సింగ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు చెప్పాడు. తన కళ్లముందే నీ భార్య ప్రీతిని చంపేయాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని మోనికా బెదిరించిందని, ప్రియురాలి కోసం ఉపేంద్ర సింగ్ అతని భార్య ప్రతీని చంపేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రీతి హత్య కేసులో ఆమె భర్త ఉపేంద్ర సింగ్, అతని గర్ల్ ఫ్రెండ్ మోనికా, హత్యకు సహకరించిన పల్లవిని అరెస్టు చేశామని ఆగ్రా పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications