Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భార్యను చంపడం ఎలా ?, గూగుల్ లో వెతికి చంపేశాడు, ఆఫీసులో ప్రియురాలితో!

వడోదర/ అహమ్మదాబాద్: మంచి ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు లక్షణంగా ఉన్న కుమార్తె ఉంది. భర్త అతని భార్య, కుమార్తెతో సంతోషంగా కాలం గడిపాడు. ఆఫీసుకు వెళ్లి వస్తున్న భర్తలో మార్పులు రావడం అతని భార్య గమనించింది. రానురాను భర్త ఇంటికి వెళ్లి అతని భార్యతో గొడవపడటం మొదలుపెట్టాడు. రెండు మూడుసార్లు పెద్దలు దంపతులకు నచ్చ చెప్పారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న భర్త తరువాత అతని పాత పద్దతిని అవలంబించాడు. నేను ఫోన్ చేస్తే నీ ఫోన్ నిత్యం ఎంగేజ్ వస్తోందని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని గొడవపడుతున్న భర్త అతని భార్యను చితకబాదుతున్నాడు. వేకువ జామున భర్త అతని భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. నా భార్య, కుమార్తె చలనం లేకుండా పడి ఉన్నారని, నాకో ఏదో భయంగా ఉందని చెప్పాడు.

భార్య, కుమార్తెను అత్తమామలతో కలిసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ చనిపోయారని వైద్యులు చెప్పారు. తల్లీ కూతురిని హత్య చేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధం కారణంగా తల్లీ కూతురు హత్యకు గురైనారని వెలుగు చూడటంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనితో సరిగమపదనిస పాడిస్తున్నారు. గూగుల్ లో వెతికి వెతికి మరీ భార్య, కుమార్తెను చంపేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు

గుజరాత్ లోని వడోదరలోని సామా ప్రాంతంలో తేజస్ పటేల్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం ఇంట్లో చూపించిన శోభనా (36) అనే మహిళను తేజస్ పటేల్ వివాహం చేసుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్న తేజస్ పటేల్ అతని భార్య శోభనాతో సంతోషంగా కాపురం చేశాడు.

భర్తలో మార్పులు గమనించిన భార్య

భర్తలో మార్పులు గమనించిన భార్య

తేజస్ పటేల్, శోభనా దంపతులకు లక్షణంగా ఉన్న కావ్యా (6) అనే కుమార్తె ఉంది. తేజస్ పటేల్ అతని భార్య శోభనా, కుమార్తె కావ్యాతో సంతోషంగా కాలం గడిపాడు. ఆఫీసుకు వెళ్లి వస్తున్న తేజస్ పటేల్ లో రానురాను మార్పులు రావడం అతని భార్య శోభనా గమనించింది. రానురాను తేజస్ పటేల్ ఇంటికి వెళ్లడం ఆలస్యం తరువాత అతని భార్య శోభనాతో గొడవపడటం మొదలుపెట్టాడు.

సర్దుకుపోవాలని చెప్పిన పెద్దమనుషులు

సర్దుకుపోవాలని చెప్పిన పెద్దమనుషులు

ఇంట్లో పదేపదే తేజస్ పటేల్, శోభనా దంపతులు గొడవపడ్డారు. శోభాన కుటుంబ సభ్యులు కూడా వడోదరలోనే నివాసం ఉంటున్నారు. కుమార్తె శోభనా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. రెండు మూడుసార్లు పెద్దలు తేజస్ పటేల్, శోభనా దంపతులకు నచ్చ చెప్పారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న తేజస్ పటేల్ తరువాత అతని భార్య శోభనాతో పాత పద్దతిలోనే గొడవపడటం చేస్తున్నాడు.

 అత్తమామలకు ఫోన్ చేసిన తేజస్

అత్తమామలకు ఫోన్ చేసిన తేజస్

నేను ఫోన్ చేస్తే నీ ఫోన్ నిత్యం ఎంగేజ్ వస్తోందని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావని తేజస్ అతని భార్య శోభనాతో గొడవపడుతున్నాడు. తేజస్ పటేల్ ఎంత టార్చర్ పెట్టి చితకబాదుతున్నా అతని భార్య శోభనా చాలా ఓపికగా ఉండేది. అక్టోబర్ 11వ తేదీ వేకువ జామున తేజస్ పటేల్ అతని భార్య శోభనా తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. నా భార్య, కుమార్తె చలనం లేకుండా బెడ్ మీద పడి ఉన్నారని, నిద్రలేచి చూసే సరికి అలా జరిగిందని, నాకో ఏదో భయంగా ఉందని తేజస్ పటేల్ చెప్పాడు.

 కూపీలాగిన పోలీసులు

కూపీలాగిన పోలీసులు

శోభనా కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు, శోభనా, ఆమె కుమార్తె కావ్యాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శోభనాతో పాటు ఆమె కుమార్తె కావ్యా చనిపోయారని వైద్యులు చెప్పారు. శోభనా, ఆమె కూతురికి విషం పెట్టి గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కూపీలాగారు.

సినిమా స్టోరీలు చెప్పిన భర్త

సినిమా స్టోరీలు చెప్పిన భర్త

శోభనా, ఆమె కుమార్తె కావ్యా ఇంట్లోనే చనిపోవడంతో పోలీసులు తేజస్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ నివాసం ఉంటున్న డూప్లెక్స్ ఇంటిలో మొత్తం గాలించారు. టెర్రాస్ మీద కూడా గాలించిన పోలీసులకు పవర్ ఫుల్ విషం కలిపిన ఎలుకల మందు చిక్కింది. ఎలుకల మందు అర్దం ఎందుకు ఖాళీ అయ్యింది ?, మిగిలిన మందు ఎక్కడ ఉపయోగించారు ? అంటూ పోలీసులు తేజస్ పటేట్ ను విచారణ చేశారు. మూడు రోజుల పాటు తేజస్ పటేల్ పోలీసులకు ఏదేదో సినిమా స్టోరీలు చెప్పాడు.

బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం లీక్

బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం లీక్

తాను ఆఫీసులో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, ఆమెతో చాలాకాలం నుంచి ఎంజాయ్ చేస్తున్నానని, ఈ విషయం నా భార్య శోభనాకు తెలిసి గొడవలు మొదలైనాయని తేజస్ పటేల్ పోలీసులకు చెప్పాడు. తన భార్య శోభనా నా వ్యక్తిగత విషయాల్లో పదేపదే జోక్యం చేసుకోవడంతో ఆమెను, నా కూతురు కావ్యాను చంపేయాలని తాను డిసైడ్ అయ్యానని తేజస్ పటేల్ అంగీకరించాడని డీసీపీ లఖ్ దిర్సింహా జాలా మీడియాకు చెప్పారు.

గూగుల్ లో గాలించి భార్యను చంపేసిన భర్త

గూగుల్ లో గాలించి భార్యను చంపేసిన భర్త

తన భార్య శోభనా, కుమార్తె కావ్యాను హత్య చేసిన తరువాత కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని అని తాను గూగుల్ లో గాలించి అనేక స్కెచ్ లు పరిశీలించానని తేజస్ పటేల్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఎలుకలను చంపే కిల్లర్ పాయిజన్ ఉపయోగించి ఎలా చంపాలి, ఒకవేళ ప్రాణాలతో ఉంటే దిండుతో ఎలా ముఖం మీద అదిమిపట్టి చంపేయాలని అని గూగుల్ లో సోదా చేశానని తేజస్ పోలీసులకు చెప్పాడు.

కిల్లర్ పాయిజన్ తో?

కిల్లర్ పాయిజన్ తో?

అక్టోబర్ 10వ తేదీ రాత్రి ఆహారంలో కిల్లర్ పాయిజన్ కలిపి తన భార్య శోభనా, కుమార్తె కావ్యాకు ఇచ్చానని తేజస్ అన్నాడు. తన భార్య శోభనా ప్రాణాలు పోకపోవడంతో ఆమె గొంతు బిగించి చంపేశానని, తన కూతురు కావ్యా ముఖం మీద దిండుతో అదిమి చంపేశానని తేజస్ పటేల్ అంగీకరించాడని డీసీపీ లఖ్ దిర్సింహా జాలా మీడియాకు చెప్పారు.

భార్య, కూతురిని చంపేసి ప్రియురాలితో పెళ్లికి స్కెచ్

భార్య, కూతురిని చంపేసి ప్రియురాలితో పెళ్లికి స్కెచ్

భార్య శోభనా, కుమార్తె కావ్యాను చంపేసిన తరువాత తన ఆఫీసు ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని తేజస్ పటేల్ మూడు రోజుల విచారణలో అంగీకరించాడని డీసీపీ లఖ్ దిర్సింహా జాలా మీడియాకు చెప్పారు. భార్య, కుమార్తెను గూగుల్ స్కెచ్ తో హత్య చేసిన కాలాంతకుడు తేజస్ పటేల్ ఇప్పుడు జైలుపాలైనాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+