Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్ !

చెన్నై/ కన్యాకుమారి: కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త కష్టపడి ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. ఉదయం బయటకు వెలుతున్న భర్త రాత్రి ఇంటికి వెలుతున్నాడు. పగలు అంతా ఇంట్లోనే ఉంటున్న భార్య పలువురు మగాళ్లతో పరిచయాలు పెంచుకుని నిత్యం ఫోన్లలో మాట్లాడుతోంది. ఇదే సమయంలో ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య ఆమె ప్రియుడు పిలిచిన ప్రాంతానికి వెళ్లి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఇంతకు ముందే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న ప్రియుడు రానురాను ఆమెకు దూరం కావాలని ప్రయత్నించాడు. ఉదయం భర్త వ్యాపారం చెయ్యడానికి బయటకు వెళ్లిపోయాడు. మద్యాహ్నం భర్తకు ఫోన్ చేసిన భార్య ఎలుకలను చంపడానికి ఇంట్లో పెట్టిన ఎలుకల ముందు తినేసి ఇద్దరు పిల్లలు కుప్పకూలిపోయారని చెప్పి బోరున విలపించింది. హడలిపోయిన తండ్రి వెంటనే ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్న బిడ్డ చనిపోయాడు. కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల విచారణలో బిడ్డల శరీరంలో ఎలాంటి విషం లేదని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది. బిడ్డ చనిపోక ముందు తల్లి అనేక మంది మగాళ్లతో ఫోన్లలో మాట్లాడిందని, ఆ ఫోన్ నెంబర్లు మొత్తం డిలీట్ అయ్యాయని, వెలుగు చూసింది. తల్లి ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అతను కొత్త కథ చెప్పడం మొదలు పెట్టాడు.

భార్య, బిడ్డలతో హ్యాపీ

భార్య, బిడ్డలతో హ్యాపీ

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తాండం సమీపంలోని కులక్కచ్చి ప్రాంతంలో జగదీష్ (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కార్తీక (24) అనే మహిళను జగదీష్ వివాహం చేసుకున్నాడు. జగదీష్, కార్తీక దంపతులకు సంజన (4), చరణ్ (18 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కార్తీకాతో సంతోషంగా కాపురం చేస్తున్న ఆమె భర్త జగదీష్ కష్టపడి ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు.

 ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

ఉదయం వ్యాపారం చెయ్యడానికి ఇంటి బయటకు వెలుతున్న జగదీష్ భర్త రాత్రి ఇంటికి వెలుతున్నాడు. పగలు అంతా ఇంట్లోనే ఉంటున్న కార్తీకా పలువురు మగాళ్లతో పరిచయాలు పెంచుకుని నిత్యం ఫోన్లలో మాట్లాడుతోంది. ఇదే సమయంలో ఇంటి సమీపంలో నివాసం ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్న సునీల్ ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది.

ప్రియురాలి మ్యాటర్ లీక్

ప్రియురాలి మ్యాటర్ లీక్

భర్త జగదీష్ బయటకు వెళ్లిన తరువాత భార్య ఆమె ప్రియుడు సునీల్ పిలిచిన ప్రాంతానికి వెళ్లి అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న కార్తీకాకు ఇంతకు ముందే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న ప్రియుడు సునీల్ రానురాను ఆమెకు దూరం కావాలని ప్రయత్నించాడు.

ఎలుకల మందు డ్రామాలు ఆడిన భార్య, కొడుకు ?

ఎలుకల మందు డ్రామాలు ఆడిన భార్య, కొడుకు ?

ఉదయం కార్తీకా భర్త జగదీష్ వ్యాపారం చెయ్యడానికి బయటకు వెళ్లిపోయాడు. మద్యాహ్నం భర్త జగదీష్ కు ఫోన్ చేసిన కార్తీకా ఎలుకలను చంపడానికి ఇంట్లో పెట్టిన ఎలుకల ముందు తినేసి ఇద్దరు పిల్లలు సంజనా, చరణ్ కుప్పకూలిపోయారని చెప్పి బోరున విలపించింది. హడలిపోయిన జగదీష్ ఇంటికి వెళ్లి ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చరణ్ చనిపోయాడని వైద్యులు చెప్పారు.

ఐసీయూలో కూతురు

ఐసీయూలో కూతురు


జగదీష్, కార్తీకాల కూతురు సంజనా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను కన్యాకుమారిలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల విచారణలో సంజనా, చరణ్ ల శరీరంలో ఎలాంటి విషం లేదని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది. కార్తీకా మీద పోలీసులకు అనుమానం మొదలు కావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కార్తీకా ఫోన్ లో నెంబర్లు డిలీట్

కార్తీకా ఫోన్ లో నెంబర్లు డిలీట్

కార్తీకా బిడ్డ చనిపోక ముందు ఆమె అనేక మంది మగాళ్లతో ఫోన్ లో మాట్లాడిందని, ఆ ఫోన్ నెంబర్లు మొత్తం డిలీట్ అయ్యాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చరణ్ చనిపోకముందు కార్తీకాతో ఆమె ప్రియుడు సునీల్ చాలాసేపు మాట్లాడాడని గుర్తించిన పోలీసులు కార్తీకా ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అతను మ్యాటర్ మొత్తం చెప్పాడు.

ప్రియుడి కోసం బిడ్డల హత్యకు స్కెచ్

ప్రియుడి కోసం బిడ్డల హత్యకు స్కెచ్


వివాహం అయిన విషయం దాచిపెట్టిన కార్తీకా తనను మోసం చెయ్యాలని అనుకుందని, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న తరువాత తాను ఆమెకు దూరం అవుతూ వచ్చానని సునీల్ అంటున్నాడని పోలీసులు చెప్పారు. తన ఇద్దరు పిల్లలను చంపేస్తే తనను సునీల్ వివాహం చేసుకుంటాడని తాను నా బిడ్డలను చంపడానికి స్కెచ్ వేశానని కార్తీకా అంగీకరించిందని పోలీసులు చెప్పారు. కొడుకు చరణ్ హత్య కేసులో కార్తీకాను జైలుకు పంపించడానికి పోలీసులు సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+