Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పోలీసు ప్రియుడితో భార్య ఎస్కేప్, భర్త ఏమి చెయ్యలేడని ధీమా, సజీవదహనం చేశారు !

చెన్నై/ పరమకుడి: కాలేజ్ లో డిగ్రీ వరకు చదువుకున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని వివాహం చేసుకోవడానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న భార్య జీవితంలోకి ఆమె పాత బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చాడు. భార్య పాత బాయ్ ఫ్రెండ్ పోలీసుగా ఉద్యోగం చేస్తున్నాడు. పాత బాయ్ ఫ్రెండ్ లైన్ లోకి రావడంతో అప్పటి వరకు చక్కగా కాపురం చేస్తున్న భార్యలో మార్పులు వచ్చేశాయి. పాత బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో అతని భార్య గంటలు గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది. పుట్టింటికి వెలుతున్నానని భర్తకు చెప్పి వెలుతున్న భార్య ఆమె ప్రియుడితో షికార్లు తిరిగింది. మ్యాటర్ తెలుసుకున్న భర్త అతని భార్యకు బెండ్ తియ్యడంతో ఆమె రగిలిపోయింది. తన ప్రియుడు పోలీసు, నా మొగుడు నన్ను ఏమీ చెయ్యలేడు అనే ధైర్యంతో భార్య రెచ్చిపోయింది. పోలీసు ప్రియుడితో కలిసి భార్య పారిపోయింది. భర్త కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను పట్టుకుని వచ్చి రాజీ చేసి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి రెండు నెలలు భార్య కథ అనేక మలుపులు తిరిగింది. వివాహం చేసుకున్న తమ కూతురు మా పరువు తీస్తోందని రగిలిపోయిన తల్లిదండ్రులు ఆమెను సజీవదహనం చేసి ఎముకలు కూడా చిక్కకుండా చెయ్యడం కలకలం రేపింది.

 కాలేజ్ వరకు చదువుకుంది

కాలేజ్ వరకు చదువుకుంది

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని చత్రకుడి సమీపంలోని సెవ్వూరు గ్రామంలో కనగరాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో డిగ్రీ వరకు చదువుకున్న కౌశల్యా అనే యువతికి, కనగరాజ్ కు పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు చూపించిన కనగరాజ్ ను వివాహం చేసుకోవడానికి కౌసల్యా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాత బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ

పాత బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ


కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న కౌసల్యా ఆమె భర్త కనగరాజ్ తో చక్కగా కాపురం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. కౌసల్యా జీవితంలోకి ఆమె పాత బాయ్ ఫ్రెండ్ పార్థీబన్ ఎంట్రీ ఇచ్చాడు. రామనాథపురంలో పార్థీబన్ ను అనుకోకుండా కౌసల్యా కలిసింది. నువ్వు ఎక్కడ ఉన్నావు ?, ఏమి చేస్తున్నావు అంటూ పార్థీబన్ అతని పాత గర్ల్ ఫ్రెండ్ ను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

పోలీసు ప్రియుడు

పోలీసు ప్రియుడు

నేను కనగరాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో కలిసి జీవిస్తున్నానని కౌసల్యా ఆమె పాత బాయ్ ఫ్రెండ్ పార్ధీబన్ కు చెప్పింది. కౌసల్యా పాత బాయ్ ఫ్రెండ్ పార్థీబన్ మదురైలో పోలీసుగా ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు కౌసల్యా, పార్థీబన్ ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని ఆ రోజు సాయంత్రం వరకు ఇద్దరూ రామనాథపురంలోనే ఉండి తరువాత ఎవరిపాటికి వారు వెళ్లిపోయారు.

ప్రియుడితో భార్య గంటలు గంటలు !

ప్రియుడితో భార్య గంటలు గంటలు !

పాత బాయ్ ఫ్రెండ్ పార్థీబన్ లైన్ లోకి రావడంతో అప్పటి వరకు భర్త కనగరాజ్ తో చక్కగా కాపురం చేస్తున్న అతని భార్య కౌసల్యాలో మార్పులు వచ్చేశాయి. పాత బాయ్ ఫ్రెండ్ పార్థీబన్ కు ఫోన్ చేస్తున్న కౌసల్యా అతనితో గంటలు గంటలు మాట్లాడటం మొదలు పెట్టింది. నువ్వు ఎవరితో ఫోన్ లో ఇంతసేపు మాట్లాడుతున్నావు అంటూ చాలాసార్లు కనగరాజ్ అతని భార్య కౌసల్యాను ప్రశ్నించాడు. ఇదే విషయంలో కనగరాజ్, కౌసల్యా దంపతుల మద్య కొంతకాలం నుంచి గొడవలు జరగుతున్నాయి.

ప్రియుడు పోలీసు అనే ధైర్యంతో రెచ్చిపోయింది

ప్రియుడు పోలీసు అనే ధైర్యంతో రెచ్చిపోయింది


పుట్టింటికి వెలుతున్నానని భర్త కనగరాజ్ కు చెప్పి వెలుతున్న అతని భార్య కౌసల్యా ఆమె ప్రియుడు పార్థీబన్ తో షికార్లు తిరిగింది. భార్య కౌసల్యా అసలు మ్యాటర్ తెలుసుకున్న కనగరాజ్ అతని భార్యకు బెండ్ తియ్యడంతో ఆమె రగిలిపోయింది. తన ప్రియుడు పార్తీబన్ పోలీసు, నా మొగుడు కగనరాజ్ నన్ను ఏమీ చెయ్యలేడు అనే ధైర్యంతో కౌసల్యా ఇంకా రెచ్చిపోయింది. నేను నా భర్త కనగరాజ్ తో కలిసి జీవించలేనని, నీతో కలిసి వచ్చేస్తానని ప్రియుడు పార్థీబన్ కు చెప్పింది. పోలీసు ప్రియుడు పార్థీబన్ కూడా ఓకే చెప్పాడు.

ప్రియుడితో జెండా ఎత్తేసింది

ప్రియుడితో జెండా ఎత్తేసింది

చివరికి కౌసల్యా భర్త కనగరాజ్ కు హ్యాండ్ ఇచ్చి పోలీసు ప్రియుడు పార్థీబన్ తో కలిసి పారిపోయి మదురైలో ఇల్లు అద్దెకు తీసుకుని అతనితో అక్కడ కాపురం పెట్టింది. నా భార్య కౌసల్యా కనపడటంలేదని ఆమె భర్త కనగరాజ్ చట్రకుడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసులు గాలించి కౌసల్యా ఆచూకి తెలుసుకుని ఆమెను పట్టుకుని చత్రకుడికి పిలుచుకుని వచ్చారు.

మార్పు రావాలని పుట్టింటికి పంపించిన భర్త

మార్పు రావాలని పుట్టింటికి పంపించిన భర్త

పోలీసులు, పెద్దలు కౌసల్యాకు బుద్దిమాటలు చెప్పి, కౌన్సిలింగ్ నిర్వహించారు. కొంతకాలం తన భార్య కౌసల్యా పుట్టింటిలో ఉంటే మార్పులు వస్తాయని కనగరాజ్ అనుకుని ఆమెను వారి ఇంటికి పంపించాడు. కొంతకాలం తరువాత భార్య కౌసల్యా ఇంటికి వెళ్లిన కనగరాజ్ జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు పద్దతి మార్చుకుని నాతో వస్తే కాపురం చెయ్యడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదని భార్య కౌసల్యాకు నచ్చచెప్పాడు.

ఎలుకల మందు తాగేసిన భార్య

ఎలుకల మందు తాగేసిన భార్య

భర్తతో వెళ్లడానికి కౌసల్యా నిరాకరించింది. తరువాత పుట్టింటిలో ఉన్న కౌసల్యా ఇంటిలో ఎలుకల మందు తాగేసి స్పృహ కోల్పోయింది. విషయం గుర్తించిన కటుంబ సభ్యులు కౌసల్యాను పరమకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మూడు రోజులు చికిత్స చేయించి తరువాత ఆమెను రహస్యంగా ఇంటికి పిలుచుకుని వచ్చారు.

సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

ఒక్కసారి ప్రియుడితో కలిసి లేచిపోయిందని, మరోసారి ఆత్మహత్యాయత్నం చేసి మా పరువు తీసిందని కౌసల్యా మీద ఆమె తల్లిదండ్రులు ఆవేదనతో రగిలిపోయారు. కూతురు కౌసల్యాను నమ్మించి ఊరి శివార్లలోని పొలంలోకి పిలుచుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమె మీద పెట్రోలో పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. కౌసల్యా ఎముకలు కూడా చిక్కకుండా చేసి కాల్చి బూడిద చేసిన ఆమె తల్లిదండ్రులు తరువాత అల్లుడు కనగరాజ్ కు సమాచారం ఇచ్చారు.

బిత్తరపోయిన గ్రామస్తులు

బిత్తరపోయిన గ్రామస్తులు

తనకు తెలీకుండా తన భార్య కౌసల్య అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని కనగరాజ్ అత్తమామలను నిలదీశాడు. కౌసల్యా అంత్యక్రియలు జరిగిపోయాయని గ్రామస్తులకు, పోలీసులకు తెలిసిపోయింది. మొదట కౌసల్య ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో అంత్యక్రియలు చేశామని ఆమె కుటుంబ సభ్యులు అందరికి చెప్పారు. చివరికి పోలీసుల విచారణలో కౌసల్యాను తామే సజీవదహనం చేశామని వారు అంగీకరించారు. అక్రమ సంబందం కారణంగా కౌసల్యాను ఆమె కుటుంబ సభ్యులు సజీవదహనం చేశారని వెలుగు చూడటం పరమకుడిలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+