Illegal affair: భర్త పాల వ్యాపారం, నాటుకోడి భార్యకు ?, నా వైఫ్ కు మురిపాలు, ఎంజాయ్ !
చెన్నై: సంతోషంగా కాపురం చేసిన దంపతులు ఓ అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చారు. కష్టపడి పాల వ్యాపారం చేస్తున్న భర్త భార్యకు, ఇద్దరు పిల్లలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటున్నాడు. అర్దరాత్రి దాటిన తరువాత భర్తకు వ్యాపారం ప్రారంభం అయ్యి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తాను పాల వ్యాపారం చేస్తున్న సమయంలో తన భార్య ఆమె ప్రియుడికి మురిపాలు పంచిపెడుతోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే సమయంలో భార్య రోజూ చక్కగా అలంకరించుకుని, సింగారించుకని భర్త ఇంటికి వచ్చే సమయానికి అతనికి కనపడటంతో అతని అనుమానం మరింత పెరిగిపోయింది. రోజురోజుకు భార్య ప్రవర్తనలో మార్పులు రావడం భర్తకు తెలిసిపోయింది. భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఆమె మీద పగ పెంచుకున్నాడు. రాత్రి గొడవ ఎక్కువ కావడంతో సహనం కోల్పోయిన భర్త గ్రైండర్ లోని రాయి తీసుకున్న భార్యను ఒకే దెబ్బకు చంపేయడం కలకలం రేపింది.
Illegal affair: భార్యకు కొవ్వు, లాక్ డౌన్ లో భర్త ?, నరాలు జువ్వున లాగేశాయి, ఇద్దరు ప్రియులతో ?

హ్యాపీలైఫ్ లో ఇద్దరు పిల్లలు
కేంద్రపాలిత ప్రాంతంలోని మెట్టుపాళ్యంలోని కామరాజ్ వీధిలో బాబు (50), రాధిక అలియాస్ రుతిక లత (45) దంపతులు నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం బాబు, రాధికల వివాహం అయ్యింది. బాబు, రాధిక దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చామనఛాయ రంగులో ఉన్న రాధిక చాలా అందంగా ఉంటుందని భర్త బాబుకు అనుమానం. వివాహం జరిగిన 15 సంవత్సరాల పాటు రాధిక అతని భర్త బాబుతో సంతోషంగా కాపురం చేసిందని, తరువాత గొడవలు మొదైనాయని తెలిసింది.

భర్త పాల వ్యాపారం
బాబు మెట్టుపాళ్యంలో పాల వ్యాపారం చేస్తున్నాడు. అర్దరాత్రి దాటిన తరువాత 3 గంటలకు బాబు పాల వ్యాపారం చెయ్యడానికి ఇంటి నుంచి వెళ్లిపోతున్నాడు. ప్రతిరోజు వేకువ జామున 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పాల వ్యాపారం చెయ్యడానికే బాబుకు సమయం సరిపోతుంది. ఆ సమయంలో భార్య రాధిక మాత్రమే ఇంటిలో ఉంటోంది.

సూపర్ గా సింగారించుకుంటున్న భార్య
తాను బయటకు వెళ్లిన తరువాత తన భార్య రాధిక రోజూ చక్కగా అలంకరించుకుని, సింగారించుకుంటున్న విషయం భర్తకు తెలిసింది. భర్త బాబు ఇంటికి వెళ్లే సమయానికి రాధిక అతనికి సింగారించుకుని కనపడటంతో అతనికి అనుమానం మరింత పెరిగిపోయింది. నేను ఇంటిలో లేని సమయంలో నువ్వు ఎందుకు అంతగా సింగారించుకుంటున్నావు ? అని భర్త బాబు ప్రశ్నిస్తే భార్య రాధిక అతనికి ఎదురు తిరగడం మొదలుపెట్టింది.

ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది ?
తాను పాల వ్యాపారం చేస్తున్న సమయంలో తన భార్య రాధిక ఆమె ప్రియుడికి మురిపాలు పంచిపెడుతోందని భర్త బాబుకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో కొంతకాలంగా బాబు అతని భార్య రాధికతో గొడవపడుతున్నాడు. రానురాను రాధిక ప్రవర్తనలో మార్పులు రావడంతో భర్త బాబుకు మరింత అనుమానం పెరిగిపోయింది. తన భార్య రాధిక ఎరితోనే ఎంజాయ్ చేస్తోందని, వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని బాబు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

గ్రైండర్ రాయితో కొట్టి చంపేసిన భర్త
రాత్రి ఇంటికి వెళ్లిన టైమ్ లో రాధిక చాలా అందంగా రెడీ అయ్యి కనపడింది. ఆ టైమ్ లో నువ్వు ఎవ్వరి కోసం ఇంత నీట్ గా రెఢీ అయ్యావు అని భర్త బాబు ప్రశ్నించాడు. నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటాను అని భార్య రాధిక ఎదురు చెప్పింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త బాబు ఇంట్లో పిండి రుబ్బు కోవడానికి తెచ్చి పెట్టిన గ్రైండర్ లోని రాయి తీసుకుని భార్య రాధిక తల మీద చితకబాదేశాడు.

ఒకే దెబ్బతో భార్య ఫినిష్
గ్రైండర్ లోని పెద్ద రాయి గట్టిగా తగలడంతో తల పగిలి రాధిక అక్కడిక్కడే ప్రాణాలు వదిలేసింది. భార్య రాధిక చనిపోయిందని నిర్దారించుకున్నబాబు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తన తల్లి రాధికను మా తండ్రి బాబు చంపేశాడని పిల్లలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆవేశంలో చంపేశాడు
రాధిక హత్య విషయం తెలుసుకున్న ఇన్స్ పెక్టర్ జయశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి రాధిక శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య రాధిక ప్రవర్తన మీద అనుమానం రావడంతోనే ఆమె భర్త హత్య చేశాడని, కేసు విచారణలో ఉందని ఇన్స్ పెక్టర్ జయశంకర్ మీడియాకు చెప్పారు. గ్రైండర్ రాయితో భార్య రాధికను ఆమె భర్త బాబు దారుణంగా హత్య చేశాడని వెలుగు చూడటం పుదుచ్చేరిలో హాట్ టాపిక్ అయ్యింది.