చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: కరెంట్ తక్కువని భర్తకే డౌట్, భార్యకు లాక్ డౌన్ లో ఏం పని ?, అనుమానంతో !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉద్యోగం చేస్తున్న భార్య రోజూ బయటకు వెళ్లి వస్తోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో కూడా భార్య ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో తాను ఇంట్లో ఉంటున్నానని, తన భార్య మాత్రం ఇంట్లో ఉండటం లేదని భర్త గొడవపడ్డాడు. భర్త ఎలక్ట్రీషిన్ పని చేస్తుంటే భార్య కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తోంది. మొదటి నుంచి భార్య మీద భర్తకు అనుమానం ఉంది. తనకు కరెంట్ తక్కువే, నా భార్యకు పరవ్ ఎక్కువ అని భర్తకు డౌట్. ఇదే విషయంలో దంపతులు ఇంట్లో గొడవ పడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని భార్యను ఎక్కడంటే అక్కడ పొడిచేసి దారుణంగా చంపేశాడు. నా భార్యను చంపేశాను. శవం మాత్రం ఇంట్లో ఉంది, మీరే తెచ్చుకోండి అంటూ భర్త పోలీసుల ముందు లొంగిపోవడం కలకలం రేపింది.

Khiladi: ఆంటీ సోరచేప, విశాలహృదయం, కొత్త ప్రియుడికి ఫ్రై, పాత ప్రియుడికి, భర్తకు ? పులుసు !Khiladi: ఆంటీ సోరచేప, విశాలహృదయం, కొత్త ప్రియుడికి ఫ్రై, పాత ప్రియుడికి, భర్తకు ? పులుసు !

హ్యాపీ లైఫ్..... ఇద్దరు పిల్లలు

హ్యాపీ లైఫ్..... ఇద్దరు పిల్లలు

చెన్నైలోని నీలక్కేరి ప్రాంతంలోని మెట్టూ కాలనీలో హరి (35), గౌమతి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న హరి, గౌమతి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. హరి, గౌమతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇద్దరు పిల్లలు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు.

ఉద్యోగం చేస్తున్న భార్య

ఉద్యోగం చేస్తున్న భార్య

చెన్నైలోనే హరి ఎలక్ట్రీషిన్ గా పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి చెన్నై కార్పోరేషన్ లో గౌమతి తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో తమిళనాడులో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ దెబ్బతో ఎలక్ట్రీషిన్ పనులు లేకపోవడంతో భర్త హరి ఇంట్లోనే ఉంటున్నాడు.

భార్య ఉద్యోగం అలాంటిది

భార్య ఉద్యోగం అలాంటిది

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కార్పోరేషన్, మునిసిపాటీ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం లేదు. చెన్నై కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న గౌమతి కూడా రోజూ విధులకు హజరౌతోంది. చెన్నైలో కరోనా వైరస్ అరికట్టడానికి ఆ సిటీలోని కార్పోరేషన్ ఉద్యోగులు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారు. గౌమతి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వెలుతోంది.

లాక్ డౌన్ లో నీకు ఏం పని ? తనకు కరెంట్ తక్కువని భర్తకే డౌట్

లాక్ డౌన్ లో నీకు ఏం పని ? తనకు కరెంట్ తక్కువని భర్తకే డౌట్


లాక్ డౌన్ కారణంగా నేను ఇంట్లో ఉంటున్నానని, నీవ్వు మాత్రం ఎందుకు ఉద్యోగానికి వెలుతున్నావని, నువ్వు కూడా ఇంట్లోనే ఉండాలని భర్త హరి అతని భార్య గౌమతికి చెప్పాడు. నేను కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్నానని, తనకు సెలవులు ఇవ్వడం లేదని, నేను కచ్చితంగా ఉద్యోగానికి వెళ్లాలని గౌమతి భర్తకు చెప్పింది. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి హరి, గౌమతి దంపతులు పదేపదే ఇంట్లో గొడవపడుతున్నారు. తనకు శరీరంలో కరెంట్ తక్కువగా ఉందని, అందుకే తన భార్య వేరే వాళ్లతో తిరుగుతోందని హరికి అనుమానం మొదలైయ్యింది.

భార్య శీలంపై అనుమానం..... కత్తితో పొడిచి చంపేశాడు

భార్య శీలంపై అనుమానం..... కత్తితో పొడిచి చంపేశాడు

మొదటి నుంచి భార్య గౌమతి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకునిందని భర్త హరికి అనుమానం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో బయటకు వెలుతున్న భార్య గౌమతి మీద భర్త హరికి మరింత అనుమానం పెరిగిపోయింది. ఉద్యోగం నుంచి రాత్రి ఇంటి వెళ్లిన భార్య గౌమతితో హరి గొడవపెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన హరి వంటగదిలో కూరగాయలు కత్తిరించే కత్తి తీసుకుని భార్య గౌమతి గొంతులో, శరీరంలోని వివిద చోట్ల పొడిచేశాడు.

 మీరు శవం తెచ్చుకోండి

మీరు శవం తెచ్చుకోండి

తీవ్రగాయాలైన గౌమతి ఇంట్లో అక్కడిక్కడే ప్రాణాలు వదిలేసింది. భార్య గౌమతి చనిపోయిందని నిర్దారించుకున్న భర్త హరి నేరుగా నీలక్కేరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నా భార్య గౌమతి నా మాట వినడం లేదు, ఆమెను చంపేశాను, వెళ్లి శవాన్ని తెచ్చుకోండి అంటూ భర్త హరి చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి ఇద్దరి పిల్లలు రోడ్డునపడ్డారు.

English summary
Illegal relationship: A 35-year-old woman was murdered allegedly by her husband in Neelankarai on Friday. The deceased, Gomathi (35), was working as a temporary staff with the Chennai Corporation, and the accused Hari (35), of Mettu Colony in Chennai, is an electrician by profession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X