Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ముగ్గురు మొగుళ్లు, భార్య ఫినిష్, కిలాడీ లేడీకి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువని చంపేశాను, భర్త !

చెన్నై/ విరూద్ నగర్: ఐదు నెలల నుంచి దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వ్యాపారం చెయ్యడానికి ఉదయం బయటకు వెళ్లిపోతున్న భర్త రాత్రి లేటుగా ఇంటికి వెలుతున్నాడు. భర్త బయటకు వెళ్లినప్పటి నుంచి అతను ఇంటికి వెళ్లే వరకు భార్య ఇంట్లో ఉండటం, లేదంటే బయటకు వెళ్లిరావడం చేస్తోంది. నెల రోజుల నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. దంపతులు గొడవపడుతున్న విషయం స్థానికులకు తెలిసింది. వారం రోజుల క్రితం భార్యను ఇంట్లో దారుణంగా చంపేసిన భర్త ఇంటి బయట తాళం వేసుకుని మాయం అయిపోయాడు.

మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే భర్త మాత్రం పోలీసులకు చిక్కలేదు. వారం రోజుల తరువాత భర్త పోలీసులకు చిక్కాడు. నేను ఆమెకు మూడో భర్త అని, ఆమె నాకు రెండో భార్య అని నిందితుడు పోలీసులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. నా భార్యకు బాయ్ ఫ్రెండ్ ఎక్కువ అని, ఆమె రాసలీలలు, ఫోన్ లో బూతు పురాణం తట్టుకోలేక చంపేశానని మూడో భర్త పోలీసులకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

 ఐదు నెలల నుంచి కాపురం

ఐదు నెలల నుంచి కాపురం

తమిళనాడులోని విరూద్ నగర్ లోని శ్రీవిల్లిపుత్తూరులో రాజీవ్ కాలనీలోని క్రిష్ణన్ కాలనీలో కాలేశ్వరి, లక్ష్మణన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా ఆ కాలేశ్వరి, లక్ష్మణన్ దంపతులు అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. అద్దె ఇంటికి వెళ్లిన తరువాత దంపతులు కొన్ని నెలల సంతోషంగానే ఉన్నారు.

 రాత్రి అయితే ఇంట్లో ?

రాత్రి అయితే ఇంట్లో ?

వ్యాపారం చెయ్యడానికి ఉదయం బయటకు వెళ్లిపోతున్న లక్ష్మణన్ రాత్రి లేటుగా ఇంటికి వెలుతున్నాడు. భర్త లక్ష్మణన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత అతను ఇంటికి వెళ్లే వరకు అతని భార్య కాలేశ్వరి ఇంట్లో ఉండటం, లేదంటే బయటకు వెళ్లిరావడం చేస్తోంది. నెల రోజుల నుంచి రాత్రి అయితే కాలేశ్వరి, లక్ష్మణన్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

 భార్యను చంపేసి భర్త ఎస్కేప్

భార్యను చంపేసి భర్త ఎస్కేప్

కాలేశ్వరి, లక్ష్మణన్ దంపతులు ప్రతిరోజూ రాత్రిపూట గొడవలుపడుతున్న విషయం స్థానికులకు తెలిసింది. మే 14వ తేదీ రాత్రి కాలేశ్వరితో గొడవపడిన లక్ష్మణన్ గొడ్డలి తీసుకుని ఆమె తల మీద దాడి చేసి దారుణంగా చంపేశాడు. కాలేశ్వరి శవాన్ని ఇంట్లో పెట్టేశాడు. ఇంట్లో కాలేశ్వరిని దారుణంగా చంపేసిన లక్ష్మణన్ ఇంటి బయట తాళం వేసుకుని మాయం అయిపోయాడు.

 మొబైల్ ఫోన్ దెబ్బతో చిక్కిపోయాడు

మొబైల్ ఫోన్ దెబ్బతో చిక్కిపోయాడు

కాలేశ్వరి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల తరువాత కాలేశ్వరి హత్యకు గురైన విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే కాలేశ్వరి భర్త లక్ష్మణన్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. చివరికి శివకాశిలోని జమీన్ సల్వార్ పట్టి ప్రాంతంలో తలదాచుకున్న లక్ష్మణన్ ను అతని మొబైల్ ఫోన్ నెంబర్ సెల్ టవర్ ఆధారంగా పట్టుకున్నారు.

 నేను ఆమెకు మూడో భర్త

నేను ఆమెకు మూడో భర్త

కాలేశ్వరి గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని భర్తలను వదిలేసిందని లక్ష్మణన్ పోలీసులకు చెప్పాడు. రెండు సంవత్సరాల నుంచి కాలేశ్వరి, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నామని, ఆరు నెలల క్రితమే ఇద్దరూ పెళ్లి చేసుకున్నామని, నేను ఆమెకు మూడో భర్త అని, ఆమె నాకు రెండో భార్య అని నిందితుడు లక్ష్మణన్ పోలీసులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

 బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ

బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ

నా రెండో భార్య కాలేశ్వరికి బాయ్ ఫ్రెండ్ ఎక్కువ అని, నేను ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రాసలీలలు సాగిస్తోందని, నేను ఇంట్లో ఉన్న సమయంలో కూడా రాత్రి పూట ఫోన్ లో బాయ్ ఫ్రెండ్స్ త్ బూతులు మాట్లాడుతోందని, ఆ రోజు రాత్రి కూడా మొబైల్ లో మాట్లాడే విషయంలోనే గొడవ జరిగిందని లక్ష్మణన్ పోలీసులకు చెప్పాడు. నా రెండో భార్య కాలేశ్వరని విచ్చలవిడిగా తయారు కావడంతో సహనం తట్టుకోలేక ఆమెను చంపేశానని మూడో భర్త లక్ష్మణన్ పోలీసులకు చెప్పడంతో స్థానికులు షాక్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+