Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: బావ మీద మోజు, భర్తను సీక్రెట్ గా చంపేసి భార్య డ్రామాలు, సోదరి ఫ్యామిలీ!

చెన్నై/ చత్తీస్ గడ్: భర్తతో కాపురం చేస్తున్న భార్య హ్యీపీగా ఉండేది. తన మీద మోజు పడుతున్న బావతో భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఆమెను అనేకసార్లు మందలించి చితకబాదాడు. బావతో ఎంజాయ్ చేస్తున్న భార్య ఆమె భర్తకు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో భర్తను చంపేసిన భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాటకాలు ఆడింది.

నా సోదరితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయం తెలుసుకున్న తన సోదరి భర్త కుటుంబ సభ్యులు నా భర్తను చంపేశారని భార్య కేసు పెట్టింది. పోస్టుమార్టుం నివేదికలో భర్తను ఆమె భార్య ఎలా హత్య చేసింది అనే అసలు విషయం బయటపడటంతో భర్త కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

 హ్యాపీలైఫ్ లో బావ ఎంట్రీ

హ్యాపీలైఫ్ లో బావ ఎంట్రీ

చత్తీస్ గడ్ లోని బలరామ్ పూర్ జిల్లాలోని సనవాల్ సమీపంలోని గ్రామంలో సూరజ్, రూపా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త సూరజ్ తో చక్కగా కాపురం చేస్తున్న రూపా జీవితంలో ఆమె బావ ధనపాల్ (పేరు మార్చడం జరిగింది) ఎంట్రీ ఇచ్చాడు. బావ ధనపాల్ తో రూపా చనువు పెంచుకుంది.

బావ మోజు తీర్చుతున్న భార్య

బావ మోజు తీర్చుతున్న భార్య

బావ ధనపాల్ తో భార్య రూపా అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య రూపా అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త సూరజ్ ఆమెను అనేకసార్లు మందలించాడు. భర్త సూరజ్ హెచ్చరించినా మాట వినకుండా రూపా ఆమె బావ ధనపాల్ మోజు తీర్చుతూ ఆమె కోరికలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేసింది.

భర్తను చంపేసిన భార్య

భర్తను చంపేసిన భార్య

బావ ధనపాల్ తో ఎంజాయ్ చేస్తున్న భార్య రూపా ఆమె భర్త సూరజ్ కు అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో భర్త సూరజ్ అతని భార్య రూపాను పట్టుకుని చితకబాదేశాడు. జులై 17వ తేదీన రూపా ఆమె భర్త సూరజ్ గొంతును తాడుతో బిగించి చంపేసింది. భర్తను చంపేసి బావ ధనపాల్ తో కలిసి జీవించాలని డిసైడ్ అయిన భార్య రూపా కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాటకాలు ఆడింది.

నా భర్తకు అక్రమ సంబంధం ఉంది

నా భర్తకు అక్రమ సంబంధం ఉంది

తన భర్త సూరజ్ కు తన బావ భార్యతో అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తన భర్త మీద దాడి చేసి చంపేశారని రూపా కేసు పెట్టిందని, ఆ దిశగా మొదట కేసు విచారణ చేశామని సనవాల్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి అమిత్ బాగెల్ చెప్పారని స్థానిక మీడియా వెళ్లడించింది.

పోస్టుమార్టుం నివేదికతో షాక్

పోస్టుమార్టుం నివేదికతో షాక్

పోస్టుమార్టుం నివేదికలో సూరజ్ గొంతును తాడుతో బిగించి చంపేశారని అసలు విషయం వెలుగు చూడటంతో రూపా వ్యవహారం బయటకు వచ్చింది. తన బావతో అక్రమ సంబంధం విషయం తన భర్తకు తెలిసిపోయిందని రూపా ఆమె భర్త సూరజ్ గొంతు తాడుతో బిగించి హత్య చేసిందని పోస్టుమార్టుం నివేదికతో విచారణ చేసిన పోలీసులు పసిగట్టారు.

బావ మీద వ్యామోహం

బావ మీద వ్యామోహం

బావ ధనపాల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న రూపా ఆమె భర్త సూరజ్ గొంతును తాడుతో బిగించి హత్య చేసినట్లు రూపా అంగీకరించిందని పోలీసు అధికారి అమిత్ బిగల్ మీడియాకు చెప్పారు. బావ మోజు తీర్చుతున్న భార్య కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చెయ్యడం బలరామ్ పూర్ జిల్లాలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+