Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !

చెన్నై: తల్లి చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న అమ్మాయి భర్తతో కాపురం చెయ్యడానికి అత్తారింటికి వెళ్లింది. కళ్లు మూసుకుని మూడు నెలలు భర్తతో కాపురం చేసిన భార్య నా మొగుడు నాకు నచ్చలేదు అని పుట్టింటికి వచ్చేసింది. భర్త హ్యాండ్ ఇచ్చిన భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. భార్యను ఎలాగైనా కాపురానికి పిలుచుకుని వెళ్లాలని భర్త ఆమె ఇంటికి వెళ్లాడు. నా భార్యను పంపించండి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటూ భార్య అతని అత్తను వేడుకున్నాడు. పంచాయితీలు జరుగుతున్న సమయంలో భార్య ప్రియుడు వెళ్లి భర్తను వెనుక నుంచి కత్తితో కసకస అని పొడిచేయడం కలకలం రేపింది.

 అమ్మాయి తల్లి, యువకుడు ఫ్రెండ్స్

అమ్మాయి తల్లి, యువకుడు ఫ్రెండ్స్

చెన్నై సిటిలోని ఎన్నోర్ అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జ్యోతి అనే మహిళ అదే ప్రాంతంలోని రెస్టారెంట్ లో పని చేస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కథలంపట్టి గ్రామానికి చెందిన కరుప్పస్వామి (30) అనే యువకుడు చెన్నై చేరుకుని జ్యోతి పని చేస్తున్న రెస్టారెంట్ లోనే ఉద్యోగంలో చేరాడు. ఒకేచోట ఉద్యోగాలు చేస్తున్న జ్యోతి, కరుప్పస్వామి స్నేహితులు అయ్యారు.

 ఆంటీ కూతురు అందంగా ఉందని !

ఆంటీ కూతురు అందంగా ఉందని !

జ్యోతికి ఓ కుమార్తె ఉంది. తల్లితో అప్పుడప్పుడు రెస్టారెంట్ వెలుతున్న జ్యోతి కూతురిని కరుప్పస్వామి చూశాడు. జ్యోతి కూతురు చూడటానికి ఎర్రగా, పొడవుగా, బలంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని కరుప్పస్వామి అనుకున్నాడు. నేను నీ కూతురిని పెళ్లి చేసుకుంటానని జ్యోతికి చెప్పాడు. నా కూతురికి 16 సంవత్సరాలు అని జ్యోతి చెప్పడంతో పర్వాలేదు నేను పెళ్లి చేసుకుంటానని కరుప్పస్వామి ఆమెకు చెప్పాడు.

 పైసా కట్నం లేదని సింపుల్ గా పెళ్లి

పైసా కట్నం లేదని సింపుల్ గా పెళ్లి

కట్నం తీసుకోకుండానే తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి కరుప్పస్వామి సిద్దం కావడంతో జ్యోతి కూడా సరే అని చెప్పింది. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని జ్యోతికి ఆమె కూతురు చెప్పింది. ఇష్టం లేకపోయినా తల్లి జ్యోతి బలవంతంగా కరుప్పస్వామితో మూడు నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఆమె కూతురి వివాహం సింపుల్ గా జరిపించేసింది.

 మూడు నెలలకే జెండా ఎత్తేసిన భార్య

మూడు నెలలకే జెండా ఎత్తేసిన భార్య

కరుప్పస్వామిని పెళ్లి చేసుకున్న జ్యోతి కూతురు అతనితో వేరే ఇంటిలో కాపురం చేసింది. మూడు నెలలు ఆమె కళ్లు మూసుకుని కాపురం చేసింది. తరువాత చిన్నచిన్న విషయాలకు కరుప్పస్వామితో అతని భార్య గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. నెల రోజుల నుంచి ఇదే పంచాయితీ జరుగుతున్నా కరుప్పస్వామి సర్దుకుని పోతున్నాడు. కొన్ని రోజుల క్రితం భర్త కరుప్పస్వామికి హ్యాండ్ ఇచ్చిన అతని భార్య ఎన్నోర్ లోని తల్లి జ్యోతి ఇంటికి వెళ్లిపోయింది.

 కాళ్లు పట్టుకొవడానికి వచ్చిన భర్త...... కసక్ అని పొడిచిన ప్రియుడు

కాళ్లు పట్టుకొవడానికి వచ్చిన భర్త...... కసక్ అని పొడిచిన ప్రియుడు

తన భార్యను ఎలాగైనా కాపురానికి పిలుచుకుని వెళ్లాలని కరుప్పస్వామి ఆమె ఇంటికి వెళ్లాడు. నీ కూతురిని ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటానని, నన్ను నమ్మాలని కురప్పస్వామి అత్త జ్యోతికి, అక్కడున్న పెద్దలకు చెప్పాడు. భార్య కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకడుగు వెయ్యకుండా కరప్పుస్వామి ప్రాధేయపడ్డాడు. అదే సమయంలో భార్య ప్రియుడు వసంత్ కుమార్ అనే యువకుడు వెళ్లి కరుప్పస్వామిని వెనుక నుంచి కత్తితో కసక్ అని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

 భర్త ప్రాణం చాలా గట్టిది...... భార్య, ప్రియుడు ?

భర్త ప్రాణం చాలా గట్టిది...... భార్య, ప్రియుడు ?

ప్రియుడు వసంత్ కుమార్ కత్తితో పొడవడంతో కరుప్పస్వామి కుప్పకూలిపోయాడు. వెంటనే కరుప్పస్వామిని చెన్నైలోని స్టాల్నీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన ఎన్నోర్ పోలీసులు కరుప్పస్వామి భార్య, ఆమె ప్రియుడు వసంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

 పెళ్లికి ముందే లేచిపోయిన భార్య

పెళ్లికి ముందే లేచిపోయిన భార్య

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే వసంత్ కుమార్, జ్యోతి కూతురు ప్రేమించుకున్నారని, ఇంటి నుంచి పారిపోయి మూడు నెలలు కాపురం చేశారని, తరువాత జ్యోతి ఆమె కూతురిని పట్టుకుని ఇంటికి పిలుచుకుని వచ్చిందని ఎన్నోర్ పోలీసులు అన్నారు.

Recommended Video

    Manoj Tiwary కి మంత్రి పదవి, Ashoke Dinda డెబ్యూ అదుర్స్ | West Bengal || Oneindia Telugu
     రెండు కేసులతో భార్య ఫ్యామిలీకి షాక్

    రెండు కేసులతో భార్య ఫ్యామిలీకి షాక్

    పెళ్లి చేసుకున్న తరువాత కూడా జ్యోతి కూతురు వసంత్ కుమార్ తో అక్రమ సంబంధం సాగించిందని, ఎలాగైనా భర్త కరుప్పస్వామిని చంపేసి ప్రియుడు వసంత్ కుమార్ తో కలిసి ఉండాలని స్కేచ్ వేసిందని విచారణలో అంగీకరించిందని పోలీసులు అన్నారు. కరుప్పస్వామిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన అతని మైనర్ భార్యను, ఆమె ప్రియుడు వసంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసుతో పాటు మైనర్ కు పెళ్లి చేశారని జ్యోతి మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+