Paramour: మాయలేడి, నలుగురు భర్తలు, ఐదో ప్రియుడితో రొమాన్స్, క్లైమాక్స్ లో అడవిలో ?

అజ్మీర్/ రాజస్థాన్: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువతి కొంతకాలం ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో కొంతకాలం కాపురం చేసిన మహిళ అతనితో విడిపోయి మూడోసారి పెళ్లి చేసుకుంది. మూడో భర్తతో కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసిన మహిళ అతనికి విడాకులు ఇచ్చి నాలుగో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. అయితే మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె మాత్రం ఎవ్వరిమాట వినలేదు. నాలుగో భర్తతో కలిసి జీవిస్తున్న మహిళ మరో ప్రియుడిని సెట్ చేసుకుంది. ఇంతమందితో రొమాన్స్ చేసిన కిలాడీ లేడీ అటవి ప్రాంతంలో శవమై కనిపించడం కలకలం రేపింది.

 మొదటి భర్తకు విడాకులు

మొదటి భర్తకు విడాకులు

రాజస్థాన్ లోని అజ్మీర్లో శాంతాదేవి అలియాస్ దేవి అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న శాంతాదేవి కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తతో కాపురం చేస్తున్న శాంతాదేవికి మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రియుడి మోజులో పడిన శాంతాదేవి ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది.

 వరుసగా ముగ్గురు మోనగాళ్లు

వరుసగా ముగ్గురు మోనగాళ్లు

కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చిన శాంతాదేవి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో శాంతాదేవి కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది. తరువాత రెండో భర్తకు విడాకులు ఇచ్చిన శాంతాదేవి ముచ్చటగా మరో వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. మూడో భర్తతో కొంతకాలం కాపురం చేసిన శాంతాదేవి తరువాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది.

 నాలుగో భర్తతో కాపురం... ఐదో ప్రియుడు ఎంట్రీ

నాలుగో భర్తతో కాపురం... ఐదో ప్రియుడు ఎంట్రీ

ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చిన శాంతాదేవి తరువాత సేతుసింగ్ అనే వ్యక్తిని నాలుగో పెళ్లింది. సంవత్సరం క్రితం సేతుసింగ్ ను పెళ్లి చేసుకున్న శాంతాదేవి అజ్మీర్ లో కాపురం పెట్టింది. సేతుసింగ్ మేస్త్రీ పని చేస్తున్న. పగలు మొత్తం భర్త సేతుసింగ్ బయట ఉండటంతో ఇంట్లో ఖాళీగా ఉన్న శాంతాదేవి మరో యువకుడితో పరిచయం పెంచుకుంది.

 ఐదో ప్రియుడిని సెట్ చేసుకున్న కిలాడి

ఐదో ప్రియుడిని సెట్ చేసుకున్న కిలాడి

గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా శాంతాదేవి మాత్రం ఎవ్వరిమాట వినలేదు. నాలుగో భర్త సేతుసింగ్ తో కలిసి అజ్మీర్ లో జీవిస్తున్న శాంతాదేవి ఐదు నెలల క్రితం పరిచయం అయిన యువకుడితో రొమాన్స్ చేస్తోంది. తన భార్య శాంతాదేవి అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఆమె నాలుగో భర్త సేతుసింగ్ రగిలిపోయాడు.

 నాలుగో భర్త చేతిలో ఫినిష్

నాలుగో భర్త చేతిలో ఫినిష్

నువ్వు పద్దతి మార్చుకోవాలని శాంతాదేవికి ఆమె నాలుగో భర్త సేతుసింగ్ హెచ్చరించాడు, అయితే శాంతాదేవి మాత్రం పద్దతి మార్చుకోకుండా ఐదో ప్రియుడితో రొమాన్స్ చేసింది. శాంతాదేవిని నమ్మించిన సేతుసింగ్ అతని స్నేహితుడు ఖేమ్ సింగ్ ఆటోలో పిలుచుకుని వెళ్లి ఆజ్మీర్ జిల్లాలోని దియోఘర్ పుష్పక్ అటవి ప్రాంతంలో చంపేశాడు.

 ఐదో ప్రియుడి మోజులో ?

ఐదో ప్రియుడి మోజులో ?

ఆటో డ్రైవర్ ఖేమ్ సింగ్, అతని ప్రియురాలు రేణు, నాలుగో మొగుడు సేతుసింగ్ కలిసి శాంతాదేవి శవాన్ని అటవి ప్రాంతంలో విసిరేసి పారిపోయారు, నాలుగు రోజుల తరువాత శాంతాదేవి హత్య కేసులో ఆమె నాలుగో భర్త సేతుసింగ్, ఆటో డ్రైవర్ ఖేమ్ సింగ్, అతని గర్ల్ ఫ్రెండ్ రేణును పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+