Illegal affair: ఆంటిని చంపేసి ఇంట్లో అంత్యక్రియలు. చిల్లీ పౌడర్ చల్లేసి ప్రియుడు ఎస్కేప్ !
కొచ్చి/తిరువనంతపురం/ చెన్నై: భర్తతో కాపురం చేసిన భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కుటుంబ సమస్యల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చిన భార్య చిన్న కొడుకుతో కలిసి వేరుగా కాపురం ఉంటోంది. భార్యకు దూరం అయిన భర్త కూడా మరొక కొడుకుతో కలిసి వేరుగా ఉంటున్నాడు. మరో ఊరిలో కుటుంబ సభ్యుల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి వేరుగా వచ్చేసి ఆంటీ ఉంటున్న ఏరియాలోనే కాపురం ఉంటున్నాడు. కొడుకుతో కలిసి నివాసం ఉంటున్న ఆంటీతో భార్యను వదిలేసిన వ్యక్తికి పరిచయం అయ్యింది. ఇక అప్పటి నుంచి భర్తకు దూరం అయిన ఆంటీ, భార్యకు దూరం అయిన వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
భార్యకు విడాకుల ఇచ్చిన వ్యక్తితో ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె కొడుకుతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. కొడుకు అనారోగ్యానికి గురి కావడంతో ఆంటీ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఇదే సమయంలో విడాకులు తీసుకున్న భర్త మళ్లీ ఆంటీకి టచ్ లోకి వచ్చాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ మళ్లీ అతని భర్తకు దగ్గర అవుతోందని, ఈమె కూడా తనకు విడాకుల ఇచ్చేస్తుందని ప్రియుడిని అనుమానం వచ్చింది.
ఆంటీని చంపేసిన ప్రియుడు పోలీసలకు చిక్కకుండా అనేక స్కెచ్ లు వేశాడు. ఇంట్లో శవాన్ని పూడ్చేసిన ప్రియుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇంటి ఆవరణంలో నాలుగు అడుగుల లోతు గోతి తీసి ఆంటీని పూడ్చేశాడు. పోలీసులు జాగిలాలకు వాసన చిక్కకుండా శవం మీద కింద, భూమిలో మిరపపొడి చల్లాడు. శవం నుంచి దుర్వాసన రాకుండా జాజికాయ పొట్టు ఎక్కువగా వేశాడు. పక్కా క్రిమినల్ స్కెచ్ తో ఇంట్లోనే శవాన్ని పూడ్చేసిన ఆమె ప్రియుడు పక్క రాష్ట్రానికి పారిపోవడం కలకలం రేపింది.

భర్తను వదిలేసిన ఆంటీ
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలి పానిక్కన్ కుడి ప్రాంతంలో సిందు (46) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం రాజన్ అనే వ్యక్తితో వివాహం చేసుకున్న సిందుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కుటుంబ సమస్యల కారణంగా రాజన్, సిందు దంపతల మద్య అనేక సార్లు గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో రాజన్, సిందు కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు.

భార్యను వదిలేసిన ప్రియుడు
కేరళలోని ఇడుక్కిలో నివాసం ఉంటున్న బినోయ్ (48) అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. బినోయ్ దంపతుల మద్య నిత్యం గొడవలు జరిగాయి. తప్పు అంతా బినోయ్ దే అని అతని భార్య ఆరోపించింది. తప్పు మొత్తం తన భార్యదే అంటూ బినోయ్ వాదించాడు. దంపతుల మద్య నిత్యం గొడవలు జరగడంతో కొన్ని సంవత్సరాల క్రితం బినోయ్ అతని భార్యను వదిలేశాడు.

ఒకే ఏరియాలో ఆంటీ, బినోయ్ కాపురం
పానిక్కన్ కుడి ప్రాంతంలో సిందు ఆమె 13 ఏళ్ల చిన్న కుమారుడితో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. భార్యను వదిలేసిన బినోయ్ కూడా పానిక్కన్ కుడి ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడు. ఇదే సందర్బంలో రెండు సంవత్సరాల క్రితం సిందు, బినోయ్ కి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటున్న సిందుతో బినోమ్ మాట్లాడటం మొదలు పెట్టాడు.

అక్రమ సంబంధం
కుటంబ సభ్యుల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్న బినోయ్ సిందు నివాసం ఉంటున్న ఏరియాలోనే కాపురం ఉండటంతో ప్రతిరోజు ఆమెను పలకరిస్తున్నాడు. కొడుకుతో కలిసి నివాసం ఉంటున్న సిందు భార్యను వదిలేసిన బినోయ్ తో ఎక్కువగా పరిచయం పెంచుకుంది. అప్పటి నుంచి భర్తకు దూరం అయిన సిందు ఆంటీ, భార్యకు దూరం అయిన బినోయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

అందరికి తెలిసిపోయిందని హ్యాపీగా ఎంజాయ్
భార్యకు విడాకుల ఇచ్చిన బినోయ్ తో సిందు అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె కొడుకుతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. అందరికి విషయం తెలిసిపోయిందని అనుకున్న బినోయ్, సిందు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు.

కొడుకు ఆసుపత్రిలో చేరితే మళ్లీ టచ్ లోకి వచ్చిన మాజీ భర్త
ఇటీవల. కొడుకు అనారోగ్యానికి గురి కావడంతో అతనిని సిందు ఆసుపత్రిలో చేర్పించింది కొడుకు ఆరోగ్యం కుదటపడాలని సిందు ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఇదే సమయంలో విడాకులు తీసుకున్న సిందు భర్త రాజన్ మళ్లీ ఆంటీకి టచ్ లోకి వచ్చాడు. కొడుకికి చికిత్స చేయించడానికి రాజన్ కూడా మాజీ భార్య సిందుకు సహాయం చెయ్యడం మొదలు పెట్టాడు.

ప్రియుడికి అనుమానం పెరిగిపోయింది
తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న సిందు మళ్లీ ఆమె భర్తకు దగ్గర అవుతోందని, ఈమె కూడా తనకు విడాకుల ఇచ్చేస్తుందని ప్రియుడు బినోయ్ కు అనుమానం వచ్చింది. ఆసుపత్రిలో నుంచి కొడును డిశ్చార్జి చేసిన సిందు అతన్ని పిలుచుకుని మాజీ భర్త రాజన్ ఊరికి వెళ్లింది. అక్కడ మాజీ భర్త రాజన్ కుటుంబ సభ్యుల దగ్గర కొడుకును వదిలిపెట్టిన సిందు ఆమె ఇంటికి చేరుకుంది. నువ్వు ఎందుకు మళ్లీ నీ మాజీ భర్తతో తిరుగుతున్నావు అంటూ బినోయ్ అక్రమ సంబందం పెట్టుకున్న ప్రియురాలు సిందును నిలదీశాడు.

ప్రియురాలిని చంపేసి కిచెన్ లో పాతిపెట్టేశాడు
ఇదే విషయంలో సిందు, బినోయ్ మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సహనం కోల్పోయిన బినోయ్ అతని ప్రియురాలు సిందును అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. తరువాత కత్తి తీసుకుని సిందును దారుణంగా చంపేసిన ప్రియుడు బినోయ్ పోలీసలకు చిక్కకుండా అనేక స్కెచ్ లు వేశాడు. ఇంట్లోని కిచెన్ లో సిందు శవాన్ని పూడ్చేసిన ప్రియుడు బినోయ్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు.

దుర్వాసన రాకూడదని చిల్లీ పౌడర్, జాజికాయ పొట్టు
ఇంటి కిచెన్ లో నాలుగు అడుగుల లోతు గొయ్యి తీసిన బినోయ్ అతని ప్రియురాలు సిందు శవాన్ని అందులో పూడ్చేశాడు. పోలీసులు జాగిలాలు (కుక్కలు)కు వాసన చిక్కకుండా శవం మీద కింద, భూమిలో మిరపపొడి చల్లాడు. శవం నుంచి దుర్వాసన రాకుండా జాజికాయ పొట్టు ఎక్కువగా వేశాడు. సిందును ఇంట్లో పూడ్చేసిన బినోయ్ ఇంటి బయట తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. వారం రోజుల తరువాత సిందు కొడుకు ఊరి నుంచి వచ్చాడు. సిందు ఎక్కడ కనపడకపోవడంతో కొడుకుకి, సిందు తండ్రికి అనుమానం వచ్చింది.

అన్నీ అనుమానాలే
సిందు కోసం ఆమె కొడుకు వెతుక్కుంటూ బినోయ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటిలోపల కిచెన్ లో మట్టి బయట ఉన్న విషయం గుర్తించి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇడుక్కి ఎస్పీ కరుప్పస్వామి, డీఎస్పీ ఇమ్యానుయేల్ సంఘటనా స్థలానికి చేరుకుని కిచెన్ లో గోతి తీసి చూడగా సిందు శవం బయటకు పడింది. సిందు ముక్కుకు వేసుకున్న ముక్కు పడుక, ఆమె పళ్లను ఆమె కొడుకు గుర్తు పట్టాడు.
Recommended Video

ప్రియుడి కోసం లుక్ ఔట్ నోటీసులు
హత్యకు గురైయ్యింది సిందు అని నిర్దారించుకున్న పోలీసులు శవాన్ని ఇడుక్కి మెడికల్ కాలేజ్ కు తరలించారు. సిందును హత్య చేసిన బినోయ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, అతని మొబైల్ ఫోన్ చివరిసారిగా తమిళనాడు ప్రాంతంలో ఉందని జిల్లా ఎస్పీ కరుప్పస్వామి అన్నారు. బినోయ్ ను పట్టుకోవడానికి కేరళ, తమిళనాడులో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని జిల్లా ఎస్పీ కరుప్పస్వామి మీడియాకు చెప్పారు. బినయ్ ను పట్టుకోవడానికి కేరళ, తమిళనాడులో పోలీసులు నాలుగు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications