Illegal affair: కత్తిలాంటి పెళ్లానికి కన్నింగ్ బుద్ది, భర్తను చంపేస్తే అతని ఉద్యోగం, ప్రియుడు ఫ్రీ !
ముంబాయి/నాగ్ పూర్/చెన్నై: మంచి ఉద్యోగం చేస్తున్న భర్తతో కాపురం చేస్తున్న కత్తిలాంటి పెళ్లాం కన్నింగ్ బుద్ది చూపించింది. భర్తను చంపడానికి కన్నింగ్ ల కంటే భయంకరమైన స్కెచ్ వేసింది. సొంత సోదరి భర్త అన్నతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. మంచి జీతం తీసుకుంటున్న భర్త మద్యంకు బానిస అయ్యాడు. మద్యం మత్తులో ఉన్న భర్త బెడ్ రూమ్ లో ఆపనికి నోయూజ్ అనుకుని ఆమె సోదరి బావతో ఎంజాయ్ చేసింది. ప్రియుడితో కలిసిన భార్య సూపర్ స్కెచ్ వేసింది. తన భర్తను చంపేస్తే అతని ఉద్యోగం తనకు వస్తుందని, అప్పుడు తన ప్రియుడితో ఎలాంటి సమస్య లేకుండా ఇంకా బాగా జీవితాంతం ఎంజాయ్ చెయ్యవచ్చని ఆలోచించింది. అల్లుడిని చంపేయడానికి కిలాడీ లేడీ తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భార్య, ఆమె ప్రియుడు, అతని ఫ్రెండ్, కిలాడీ లేడీ తల్లి కలిసి అతన్ని చంపేశారు. మంచి ఉద్యోగం, పక్కలోకి ప్రియుడు వస్తాడని అనుకున్న భార్యకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి.

భర్తకు మంచి ఉద్యోగం
మహారాష్ట్రలోని చంద్రాపుర జిల్లాలో మరోటి కాక్రే (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మరోటి కాక్రే రెండు సంవత్సరాల క్రితం ప్రజాక్త (25) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మరోటి కాక్రే ప్రముఖ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (WCL) కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భారీ మొత్తంలో నెలనెల జీతం తీసుకుంటున్న కాక్రే అతని భార్య ప్రజాక్తతో కలిసి హ్యాపీగా జీవనం సాగిస్తున్నాడు.

సోదరి బావతో ఎంజాయ్
కాక్రే భార్య ప్రజాక్త సోదరి స్వప్నాకు వివాహం అయ్యింది. స్వప్నా భర్తకు సంజయ్ టిక్లే అనే సోదరుడు ఉన్నాడు. ప్రజాక్త సోదరి స్వప్నాకు సంజయ్ స్వయానా బావ అవుతాడు. సోదరి ఇంటికి వెళ్లి వస్తున్న ప్రజాక్తకు సోదరి స్వప్నా బావ సంజయ్ దగ్గర అయ్యాడు. కొంతకాలం ఫోన్లో మాట్లాడుకున్న ప్రజాక్త, సంజయ్ తరువాత ఇంకా దగ్గర అయ్యారు.

భార్య అక్రమ సంబంధం
ప్రముఖ కంపెనీ అయిన WCL ఉద్యోగి మరోటి కాక్రే భార్య ప్రజాక్త సోదరి బావ సంజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కాక్రే ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ప్రియుడు సంజయ్ ని ఇంటికే పిలిపించుకుంటున్న ప్రజాక్త అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భర్త కాక్రే ఆఫీసులో బిజీగా ఉండటంతో అతని భార్య ప్రజాక్త బెడ్ రూమ్ లో ప్రియుడు సంజయ్ తో ఇంకా బిజీ అయిపోయింది.

భార్య విషయం తెలిసి తాగుబోతు అయిన భర్త
సోదరి స్వప్నా ఇంటికి అని చెప్పి ఆమె ఇంటికి వెలుతున్న ప్రజాక్త తరువాత ప్రియుడు సంజయ్ తో కలిసి బయటకు వెళ్లిపోయి విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. తన భార్య ప్రజాక్త ఆమె బావ సంజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త మరోటి కాక్రేకి తెలిసిపోయింది. ఇదే సమయంలో మరోటి కాక్రే మద్యంకు బానిస అయ్యాడు.

భార్యకు ఓ రేంజ్ లో బెండ్ తీసిన భర్త
ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వెలుతున్న కాక్రే అతని భార్య ప్రజాక్తను పట్టుకుని ఓ రైంజ్ లో బెండ్ తియ్యడం మొదలుపెట్టాడు. భర్త కాక్రే ప్రతిరోజు చితకబాదడంతో అతను కొట్టే దెబ్బలు తట్టుకోలేన ప్రజాక్త ఆమె తల్లికి విషయం చెప్పింది. కొంతకాలం క్రితం ప్రజాక్త కుటుంబ సభ్యులు పంచాయితీలు చేసినా భర్త కాక్రే మాత్రం మారలేదు.

కిలాడీ పెళ్లాం సూపర్ స్కెచ్
భర్త కాక్రేను చంపేస్తే అతను పని చేస్తున్న WCL కంపెనీలో అతని ఉద్యోగం తనకు వస్తుందని, తరువాత ప్రియుడు సంజయ్ తో కలిసి జీవితాంతం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాక్రే భార్య ప్రజాక్త ఆలోచించింది. తన భర్త కాక్రేని చంపేయాలని ప్రజాక్త ఆమె ప్రియుడు సంజయ్ కి చెప్పింది. అల్లుడిని హత్య చెయ్యడానికి ప్రజాక్త తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రియుడి ఫ్రెండ్ ఎంట్రీ
ప్రియురాలు ప్రజాక్త భర్త కాక్రేని హత్య చెయ్యడానికి సంజయ్ రంగంలోకి దిగాడు. స్నేహితుడు వికాస్ నాగ్రాకు డబ్బులు ఇచ్చిన సంజయ్ అతని ప్రియురాలు ప్రజాక్త భర్త కాక్రేని చంపేయాలని చెప్పాడు. వికాస్ WCL ఉద్యోగి కాక్రే మద్యం సేవించే బార్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కాక్రేని పరిచయం చేసుకున్న వికాస్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో మాటలు కలిపిన సంజయ్ ఫ్రెండ్ వికాస్ కాక్రేతో పీకలదాక మద్యం తాగించాడు. కాక్రే నిలబడలేని స్థితిలో ఉన్నంతగా మద్యం సేవించాడు.

పక్కాప్లాన్ రివర్స్
మద్యం మత్తులో ఊగుతున్న కాక్రేని వికాస్ అతని బైక్ లో పిలుచుకుని నిర్జన ప్రదేశంలోకి వెళ్లాడు. అక్కడ వికాస్ బ్లేడ్ తీసుకుని కాక్రే గొంతు కోసి చంపేశాడు. అదే సమయానికి ప్రజాక్త ప్రియుడు సంజయ్ కారులో అక్కడికి వెళ్లాడు. కాక్రే శవాన్ని కారులో తీసుకెళ్లి అతను పని చేస్తున్న WCL కంపెనీ సమీపంలోని వర్దా నది పక్కన విసిరేశారు. కాక్రే శవంతో పాటు అతని బైక్ అక్కడే పడేశారు. ప్రమాదవశాత్తు బైక్ జారిపడిపోవడంతో కాక్రే మరణించాడని చిత్రీకరించారు. అయితే కాక్రే భార్య ప్రజాక్త, ఆమె ప్రియుడు సంజయ్ తదితరులు వేసిన స్కెచ్ పూర్తిగారివర్స్ అయ్యింది.

భార్యను పట్టించిన మొబైల్ ఫోన్ కాల్స్ డేటా
కాక్రే శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టుంకు తరలించారు. కాక్రే గొంతు మీద బ్లేడ్ తో కోసి చంపేశారని పోస్టుమార్టుం నివేదిక వచ్చింది. ఇదే సమయంలో కాక్రే భార్య ప్రజాక్త ఫోన్ కాల్ డేటాను పూర్తిగా పరిశీలించారు. కాక్రే, సంజయ్ అక్రమ సంబంధం గురించి కాల్ డేటాలో బయటపడింది. సంజయ్, ప్రజాక్తను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు.
Recommended Video

కిలాడీ పెళ్లాం కన్నింగ్ స్కెచ్
తన భర్త మరోటి కాక్రేని హత్య చేస్తే అతని ఉద్యోగం తనకు వస్తుందని, తరువాత సంజయ్ తో జీవితాంతం కలిసి ఉండవచ్చని మేమే తన భర్త కాక్రేని చంపేశామని ప్రజాక్త అంగీకరించింది. భర్తను చంపించిన ప్రజాక్త, ఆమె తల్లి, ప్రియుడు సంజయ్, అతని స్నేహితుడు వికాస్ ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications