Illegal affair: మూడు రోజులు భార్య ఎస్కేప్, పక్కాప్లాన్ తో భార్య బిడ్డలను చంపేసి ఆత్మహత్య !
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. భర్త సోదరుడి కుటుంబం కూడా ఇదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు. భార్య పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తోంది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను పంచాయితీలు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు దంపతులకు రాజీ చేస్తూ వాళ్లు సంతోషంగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల భార్య ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు ఎవ్వరికి చెప్పకుండా ఇద్దరు బిడ్డలను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. ఎక్కడికి వెళ్లిందో ?, ఎందుకు వెళ్లిందో అనే విషయం మాత్రం భర్తకు తెలీలేదు. ప్రియుడితో కలిసి ఆమె మూడు రోజులు ఎంజాయ్ చేసింది. మూడు రోజుల తరువాత సంతోషంగా ఇంటికి వచ్చిన భార్య మళ్లీ భర్తతో కలిసి ఉంటోంది. ఇంట్లో భార్య, బిడ్డలను చంపేసిన భర్త అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

హ్యాపీలైఫ్ అనుకున్న భర్త
దేశ రాజధాని ఢిల్లీలోని సమయ్ పూర్ లోని బద్లీ ఏరియాలో అమిత్ కుమార్ అలియాస్ అవినాష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన మిక్కీ అనే మహిళను అమిత్ కుమార్ వివాహం చేసుకున్నాడు. మిక్కీతో అమిత్ కుమార్ సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

పిల్లలు పుట్టిన తరువాత తేడాలు
అమిత్ కుమార్, మిక్కీ దంపతులకు ఆరేళ్ల కుమార్తె, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న అమిత్ కుమార్ అతని భార్య మిక్కీ, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అమిత్ కుమార్ సోదరుడి కుటుంబం కూడా ఇదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు. పిల్లలు పుట్టిన తరువాత అమిత్ కుమార్, మిక్కీ దంపతుల మధ్య తేడాలు వచ్చాయి.

బందువుతో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య !
అమిత్ కుమార్ భార్య మిక్కీ పదేపదే ఆమె పుట్టింటికి వెళ్లి వస్తోంది. మిక్కీ వివాహం కాక ముందు నుంచి ఆమె బంధువుతో అక్రమ సంబందం పెట్టుకుందని ఆమె భర్త అమిత్ కుమార్ కు వివాహం జరిగిన తరువాత తెలిసింది. ఇదే విషయంలో అమిత్ కుమార్, మిక్కీ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. గొడవలు జరుగుతున్నా మిక్కీ మాత్రం ఆమె పుట్టింటికి వెళ్లి వస్తోంది.

పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేదు
రానురాను పంచాయితీలు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు అమిత్ కుమార్, మిక్కీ దంపతుల మద్య రాజీ చేస్తూ వాళ్లు సంతోషంగా ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మిక్కీ ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో అమిత్ కుమార్ కూడా ఆ విషయంలో రాజీ కాలేకపోయాడని తెలిసింది.

మూడు రోజులు జెండా ఎత్తేసిన భార్య
కొన్ని రోజుల క్రితం అమిత్ కుమార్ ఎప్పటి లాగా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చెయ్యడానికి వెళ్లాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మిక్కీ ఆమె ప్రియుడికి ఫోన్ చేసింది. మిక్కీ ఆమె భర్త అమిత్ కుమార్ కు, కింద అదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు ఎవ్వరికి చెప్పకుండా ఇద్దరు బిడ్డలను ఇంట్లో వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

సైలెంట్ గా ఇంటికి వెళ్లిన భార్య
మిక్కీ ఎక్కడికి వెళ్లిందో ?, ఎందుకు వెళ్లిందో అనే విషయం మాత్రం ఆమె భర్త అమిత్ కుమార్ చెప్పలేదు. ప్రియుడితో కలిసి మూడు రోజులు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్లిన మిక్కీ సైలెంట్ గానే ఉండటంతో ఆమె భర్త అమిత్ కుమార్ రగిలిపోయాడు. మూడు రోజులు ప్రియుడితో సంతోషంగా గడిపి ఇంటికి వెళ్లిన మిక్కీ అదే మూడ్ లో ఉండిపోయింది.

రాత్రి నిద్రపోయారు...... అంతే !
రాత్రి అమిత్ కుమార్ అతని భార్య మిక్కీ, ఇద్దరు పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం ఎంతసేపు అయినా అమిత్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు బయటకు రాలేదు. అనుమానం వచ్చిన అమిత్ కుమార్ సోదరుడు వెళ్లి తలుపులు కొట్టాడు. అయినా తలుపులు తియ్యకపోవడంతో అమిత్ కుమార్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భార్య, పిల్లలకు విషం పెట్టి చంపేసి ఆత్మహత్య
పోలీసులు తలుపులు పలగొట్టి చూడగా మిక్కీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు చలనం లేకుండా పడి ఉన్నారు. అమిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూసింది. అమిత్ కుమార్ అతని భార్య మిక్కీ, ఇద్దరు పిల్లలకు విషయం పెట్టి హత్య చేసి తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు. భార్య విషయంలో అమిత్ కుమార్ గొడవ పడేవాడని కుటుంబ సమస్యల కారణంగానే అతను ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసు అధికారులు అంటున్నారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతోనే అమిత్ కుమార్ అతని భార్యను, ఇద్దరు కన్న బిడ్డలను చంపేసి అతను ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications