Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్తను వదిలేసి బాయ్ ఫ్రెండ్ తో జంప్, నెల రోజులు కారులో తిరిగి క్లైమాక్స్ లో ఇద్దరూ ఆత్మహత్య !

చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు కుమారులు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. భర్తతో గొడవ పడుతున్న భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. తరువాత భర్త ఆమెను మళ్లీ ఇంటికి పిలుచుకుని వచ్చేవాడు. తరువాత భార్య ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. ఇటీవల భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లింది. పుట్టింటి నుంచి ఇద్దరు పిల్లలను పిలుచుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. నెల రోజుల నుంచి అనేక ప్రాంతాలు ప్రియుడితో కారులో తిరిగిన ఆమె సంతోషంగా గడిపింది. చివరికి కారులో పిల్లలను నిద్రపుచ్చి ప్రియుడితో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కన్యాకుమారిలో దంపతులు

కన్యాకుమారిలో దంపతులు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఇటీవల వరుసగా కలకలం రేపే నేరాలు జరుగుతున్నాయి. కన్యాకుమారి జిల్లాలోని కుళచల్ కడియపట్నం బీచ్ గ్రామంలో షామిని (29) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం షామిని రాజేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న రాజేష్, షామిని దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో 7 ఏళ్లు, 3 ఏళ్ల కుమారులు ఉన్నారు.

పుట్టింటికి వెళ్లిపోతున్న భార్యకు ప్రియుడు

పుట్టింటికి వెళ్లిపోతున్న భార్యకు ప్రియుడు

.పిల్లలు పుట్టిన తరువాత రాజేష్, షామిని దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. భర్త రాజేష్ తో గొడవ పడుతున్న షామిని ఆమె పుట్టింటికి వెళ్లిపోయేది. తరువాత రాజేష్ అతని భార్య షామినికి నచ్చచెప్పి తరువాత మళ్లీ ఇంటికి పిలుచుకుని వచ్చేవాడు. చాలాకాలంగా రాజేష్, షామిని దంపతుల మద్య ఈతంతం జరుగుతోంది.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

షామిని పిల్లలను ఆటోలో సుసాయినాథన్ (36) ఆనే వ్యక్తి ఆటోలో పిలుచుకుని స్కూల్ దగ్గర వదిలిపెట్టడం, తరువాత స్కూల్ నుంచి పిలుచుకుని రావడం చేస్తున్నాడు. భర్త రాజేష్ తో నిత్యం గొడవలు పడుతున్న షామినికి సుసాయినాథ్ దగ్గర అయ్యాడు, షామిని తాను సుఖంగా జీవించడం లేదని సుసాయినాథన్ కు చెప్పింది, రానురాను షామిని, సుసాయినాథన్ కు దగ్గర అయ్యి అతనితో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేసింది.

ప్రియుడి భార్యకు షామిని మ్యాటర్ తెలిసి ?

ప్రియుడి భార్యకు షామిని మ్యాటర్ తెలిసి ?

సుసాయినాథన్‌కు నాలుగు సంవత్సరాల క్రితం వేరే మహిళతో పెళ్లి జరిగింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సుసాయినాథన్, షామిని అక్రమ సంబందం గురించి తెలుసుకున్న సుసాయినాథన్ భార్య కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిది. భార్య ఇంట్లో లేకపోవడంతో సుసాయినాథన్ అతని ప్రియురాలు షామిని ఇంటికే పిలుచుకుని వెళ్లి అక్కడే ఆమెతో ఎంజాయ్ చేశాడు.

ప్రియుడితో జంప్

ప్రియుడితో జంప్

భర్త రాజేష్ తో మళ్లీ గొడవపడిన షామిని గత నెల 18న షామిని, ఆమె 2 ఈ క్రమంలో గత నెల 18న షామిని ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉన్న షామిని మూడు రోజుల తరువాత ప్రియుడు సుసాయినాథన్ కు ఫోన్ చేసింది. ట్రావెల్స్ కూడా ఉండటంతో ఓ కారులో సుసాయినాథన్ అతని ప్రియురాలు షామిని చెప్పినచోటకు వెళ్లాడు, ఇద్దరు కుమారులను పిలుచుకుని ఇంటి పుట్టింటి నుంచి బయటకు వచ్చిన షామిని ఆమె ప్రియుడు సుసాయినాథన్ తో కలిసి పారిపోయింది.

చర్చి దగ్గర ఆత్మహత్య

చర్చి దగ్గర ఆత్మహత్య

నాగర్‌కోయిల్‌ సమీపంలోని ఆరల్‌వాయిమొళి దేవసగాయం మౌంట్‌ ప్రాంతంలో ఓ లగ్జరీ కారు ఆగి ఉందని, ఆ సమీపంలోనే ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆరల్వాయిమొళి పోలీసులు చర్చి డోర్ వద్ద పడి ఉన్న జంట మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. షామిని, ఆమె ప్రేమికుడు సుసాయినాథన్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. సమీపంలో పార్క్ చేసిన కారులో ఉన్న షామిని కుమారులను రక్షించిన పోలీసులు ఇద్దరు అబ్బాయిలను ఆసుపత్రికి తరలించారు.

నెల రోజుల నుంచి కారులో ప్రియుడితో ?

నెల రోజుల నుంచి కారులో ప్రియుడితో ?

రోజుల తర్వాత దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.. సూసాయినాథన్ ట్రావెల్స్‌లో అద్దె కారు నడుపుతున్నాడు.. సూసాయినాథన్‌, అతని భార్యకు పెళ్లయినప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి. బయటకు వెళ్లి ప్రశాంతంగా జీవించాలని సుసాయినాథ్ షామిని నిర్ణయించుకున్నారు. నెల రోజుల క్రితం సుసాయినాథ్, షామిని ఇద్దరు పిల్లలతో కలిసి కారులో బయలుదేరి ఊరు ఊరు తిరుగుతున్నారు. ఈ నెల రోజులుగా ఇద్దరు పిల్లలతో షామిని ఆమె ప్రియుడు సుసాయినాథన్ తో చాలా ప్రాంతాలకు వెళ్లి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. పగలంతా కారులో తిరుగుతూ రాత్రిపూట షామిని, సుసాయినాథన్, పిల్లలతో కలిసి చర్చిలు, లాడ్జీల్లో బస చేశారు

బతకలేమని తెలుసుకున్నారు

బతకలేమని తెలుసుకున్నారు

మన కుటుంబాలకు పట్టుబడితే చంపేస్తారని మనం ఇష్టం వచ్చినట్లు బతకలేమని, చేతిలో ఉన్న డబ్బు అయిపోతోందని, మనం ఆత్మహత్య చేసుకుందామని షామిని, సుసాయినాథ్ నిర్ణయించుకున్నారు. రాత్రి చర్చి గేట్ దగ్గర పిల్లలకు భోజనం తినిపించిన షామిని తరువాత ప్రియుడు సుసాయినాథన్ తో కలిసి కొబ్బరి చెట్లకు వాడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం స్థానికులు గుర్తించడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+