Wife: పుట్టింటిలో బావతో భార్య ?, అత్తారింటికి వెళ్లిన భర్త ఫినిష్, కూతురికి పెళ్లి వయసు వచ్చింది !

చెన్నై/ సేలం: దంపతులకు పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉంది. ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న భర్తకు, అతని భార్యకు గొడవలు మొదలైనాయి. మాట్లాడితే పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. భార్య ఆమె బావతో చాలా క్లోజ్ గా ఉంటున్నది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. చివరికి భార్య ఆమె కూతురు, కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి వస్తుందని భర్త ఎదరు చూశాడు. చివరికి రాజీ చేసుకుని భార్యను ఇంటికి పిలుచుకురావాలని భర్త అతని అత్తారింటికి వెళ్లాడు. ఆ సందర్బంలో గొడవ జరగడంతో భార్య, ఆమె బావ కలిసి భర్తను చంపేయడం కలకలం రేపింది.

 దంపతులు హ్యాపీ

దంపతులు హ్యాపీ

తమిళనాడులోని సేలం జిల్లాలోని సంగకిరి యూనియన్ మోరూర్ లోని దాసనాయకన్ పాళ్యంలో ధనపాల్ (44) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సరిత (38) అనే మహిళను ధనపాల్ వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాపురం చేసిన ధనపాల్, సరిత దంపతులు చాలా అన్యోన్యంగా ఉన్నారు.

 పెళ్లి వయసుకు వచ్చిన కూతురు

పెళ్లి వయసుకు వచ్చిన కూతురు

ధనపాల్ ప్రముఖ కంపెనీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ధనపాల్, సరిత దంపతులకు జయశ్రీ (20), నితీష్ కుమార్ (18) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయశ్రీ పెళ్లి వయసుకు వచ్చింది. కాలేజ్ చదువుత పూర్తి అయిన తరువాత కూతురికి పెళ్లి చెయ్యాలని ధనపాల్ అనుకున్నాడు. ధనపాల్ కొడుకు నతీష్ కుమార్ కాలేజ్ లో చదువుతున్నాడు.

 బావతో రొమాన్స్ చేస్తున్న భార్య ?

బావతో రొమాన్స్ చేస్తున్న భార్య ?

మూడు సంవత్సరాలుగా ధనపాల్, సరిత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. మాట్లాడితే పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య సరిత తీరుతో ఆమె భర్త ధనపాల్ విసిగిపోయాడు. సరిత ఆమె బావ శరవణన్ తో చాలా క్లోజ్ గా ఉంటున్నది. బావ శరవణన్ తో సరిత రొమాన్స్ చేస్తోందని తెలిసింది. ఇదే విషయంలో ధనపాల్, సరిత దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

 అత్తారింటికి వెళ్లిన భర్త

అత్తారింటికి వెళ్లిన భర్త

చివరికి సరిత ఆమె కూతురు, కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య సరిత, కూతురు, కొడుకు తిరిగి ఇంటికి వస్తారని ధనపాల్ ఇంతకాలం చాలా ఆశగా ఎదరు చూశాడు. చివరికి రాజీ చేసుకుని సరితను ఇంటికి పిలుచుకురావాలని ధనపాల్ అతని అత్తారింటికి వెళ్లాడు. ఆ సందర్బంలో ధనపాల్, సరిత కుటుంబ సభ్యలు మద్య పెద్ద గొడవజరిగింది.

 భార్య, ఆమె బావ చేతిలో భర్త ప్రాణం పోయింది

భార్య, ఆమె బావ చేతిలో భర్త ప్రాణం పోయింది

ఆ సందర్బంలో సరిత, ఆమె బావ శరవణన్చమామ కుమారస్వామి తదితరులు కలిసి ధనపాల్ మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన ధనపాల్ ను ఆసుపత్రికి తరించగా అప్పటికే అతని ప్రాణం పోయింది. ధనపాల్ హత్య కేసులో అతని భార్య సరిత, ఆమె బావ శరవణన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. భార్య సరిత, ఆమె బావ శరవణన్ కలిసి ధనపాల్ ను హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+