Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ప్రతిరోజు క్రైమ్ సీరియల్స్ చూస్తున్న భార్య, భర్తను చంపడం ఎలా ?, లవర్ తో కలిసి ఏం చేసిందంటే?

లక్నో/ఉత్తరప్రదేశ్: ఓ యువకుడికి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఓ యువతిని చూసి అతనితో పెళ్లి జరిపించారు. కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అయిన యువకుడు అతని భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. భార్య ఏమి అడిగినా భర్త కాదనకుండా ఆమెకు తీసిచ్చాడు. భర్త అతి ప్రేమను, అతని మంచితనాన్ని భార్య అతని చేతకాని తనంగా తీసుకుంది. కొంతకాలం తరువాత భార్య ఆమె భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

భర్త మీద అనేకసార్లు హత్యాయత్నం జరిగింది. చివరికి భర్త చనిపోయాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. భార్య ఇప్పటికే అనేకసార్లు ఆమె భర్తను హత్య చెయ్యడానికి ప్రయత్నించిందని, భర్త ప్రతిసారి బతికిపోవడంతో భార్య మళ్లీ కొత్తగా అనేక ప్లాన్ లు వేసిందని వెలుగు చూసింది. క్రైమ్ సీరియల్స్ చూస్తున్న భార్య ఆమెను ఏవిదంగంగా అంతం చేసింది అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.

భర్త కోటీశ్వరుడు

భర్త కోటీశ్వరుడు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలోని కల్యాణ్ పూర్ లోని షవ్లీ ప్రాంతంలో రిషబ్ తివారీ అలియాస్ తివారీ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రిషబ్ కు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రిషబ్ కుటుంబ సభ్యులు స్వప్నా (26) అనే యువతిని చూసి అతనితో చాలా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు.

భర్తకు అతని భార్య కనపడే ప్రపంచం

భర్తకు అతని భార్య కనపడే ప్రపంచం

కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అయిన రిషబ్ అతని భార్య స్వప్నాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. భార్య స్వప్నా ఏమి అడిగినా కాదనకుండా రిషబ్ ఆమెకు తీసిచ్చి ఆమె కోరికలు తీర్చుతున్నాడు. రిషబ్ అతి ప్రేమను, అతని మంచితనాన్ని అతని భార్య స్వప్నా అతని చేతకానితనంగా తీసుకుంది.

భర్త మీద హత్యాయత్నం

భర్త మీద హత్యాయత్నం

నవంబర్ 27వ తేదీన రిషబ్, అతని స్నేహితుడు మనీష్ కలిసి సకర్ పూర్ లో జరిగిన పెళ్లికి హాజరైనాడు. పెళ్లికి వెళ్లిన రిషబ్, మనీష్ బైక్ లో ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో గుర్తు తెలియన వ్యక్తి బైక్ నిలిపి రిషబ్ మీద దాడి చెయ్యడంతో అతని తలకు తీవ్రగాయాలైనాయి. తీవ్రగాయాలైన రిషబ్ ను రక్షించి స్వరూప్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇంటికి వెళ్లిన భర్త.... షాక్ అయిన భార్య

ఇంటికి వెళ్లిన భర్త.... షాక్ అయిన భార్య

డిసెంబర్ 1వ తేదీన రిషబ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన భర్త రిషబ్ ను చూసి అతని భార్య స్వప్నా షాక్ అయ్యింది. తీవ్రగాయాలై చికిత్సపొంది ఇంటికి వెళ్లిన భర్త రిషబ్ గురించి ఏమాత్రం పట్టించుకోని స్వప్నా సాయంత్రం వరకు గడిపింది. డిసెంబర్ 2వ తేదీన రిషబ్ అస్వస్థతకు గురై మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.

నీ భర్త ఫినిష్ అనే డైలాగ్ తో?

నీ భర్త ఫినిష్ అనే డైలాగ్ తో?

ఆసుపత్రికి వెళ్లిన రిషబ్ అక్కడే చనిపోయాడు. పోలీసులు రిషబ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. రిషబ్ మీద దాడి జరిగిన ప్రాంతంలో ఆరోజు ఎవరెవరు ఎక్కువగా ఫోన్ లో మాట్లాడారు అని పోలీసులు ఆరా తీశారు. ఆ సందర్బంలో గుప్తా అనే వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. గుప్తా రిషబ్ భార్య స్వప్నాకు ఫోన్ చేసి నీ భర్త చనిపోయాడు అని చెప్పాడని పోలీసులు తెలుసుకున్నారు.

ప్రియుడి కోసం భర్తను చంపేయాలని?

ప్రియుడి కోసం భర్తను చంపేయాలని?

రిషబ్ భార్య స్వప్నా ఆమె భర్త స్నేహితుడు గుప్తాతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసిందని పోలీసులకు తెలిసింది. భర్త రిషబ్ మీద స్వప్నా అనేకసార్లు హత్యాయత్నం చేసిందని, పాలల్లో విషం కలిపిందని, మోతాదుకు మించిన నిద్రమాత్రలు ఇచ్చిందని, ప్రతిసారి భర్త బతికిపోయాడని పోలీసులకు తెలిసింది.

కిరాయి హంతకుడు ఎంట్రీ

కిరాయి హంతకుడు ఎంట్రీ

ఇంట్లో ఎన్నిసార్లు చంపాలని చూసినా భర్త రిషబ్ బతికిపోవడంతో అతని భార్య స్వప్నా, ప్రియుడు గుప్తా కలిసి కాంట్రాక్ట్ కిల్లర్ తో 27వ తేదీ రాత్రి దాడి చేయించారని పోలీసులు అన్నారు. పోలీసుల విచారణలో స్వప్నా గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యి వెళ్లిన భర్త రిషబ్ కు అదే రోజు రాత్రి ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు ఇవ్వడం వలనే అతని ప్రాణం పోయిందని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది.

క్రైమ్ సీరియల్స్ చూస్తున్న భార్య

క్రైమ్ సీరియల్స్ చూస్తున్న భార్య

స్వప్నా ఇప్పటికే అనేకసార్లు ఆమె భర్త రిషబ్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించిందని, భర్త ప్రతిసారి బతికిపోవడంతో భార్య మళ్లీ కొత్తగా అనేక ప్లాన్ లు వేసిందని వెలుగు చూసింది. క్రైమ్ సీరియల్స్ ఎక్కువగా చూస్తున్న స్వప్నా ఆమె భర్త రిషబ్ ను ఏవిధంగా అంతం చెయ్యాలి అని స్కెచ్ లు చేసింది పోలీసుల విచారణలో వెలుగు చూసింది. స్వప్నా గురించి అసలు మ్యాటర్ తెలుసుకున్న రిషబ్ కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+