Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

11 జిల్లాలకు ఆరెంజ్..మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ: జనం బిక్కుబిక్కు

తిరువనంతపురం: భారీ వర్షాల ధాటికి కేరళ కకావికలమైంది. ఎడతెరిపి లేకుండా కురుసిన అతి భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని నిలువెల్లా ముంచెత్తాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. కనీవినీ ఎరుగని వరద సంభవించింది. కొండ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం వీధుల్లో ప్రవహించింది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 28 మంది మరణించారు. ఇది చాలదన్నట్లుగా కేరళలో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

మళ్లీ ఆరెంజ్.. ఎల్లో అలర్ట్స్

మళ్లీ ఆరెంజ్.. ఎల్లో అలర్ట్స్

ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. బుధవారం నాడు రాష్ట్రం మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాజధాని తిరువనంతపురం సహా మొత్తం 14 జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. తిరువనంతపురం, పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. కాసరగోడ్, అళప్పుజ, కొల్లం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఆయా జిల్లాలన్నింటిలోనూ బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ఇడుక్కి, పథనంథిట్ట జిల్లాలపై తీవ్ర ప్రభావం..

తిరువనంతపురం మినహాయిస్తే.. ఆయా జిల్లాలన్నీ ఇప్పటికే వర్షబీభత్సంతో అల్లాడుతున్నాయి. ప్రత్యేకించి ఇడుక్కి, పథనంథిట్ట, కొట్టాయం జిల్లాలు అతలాకుతలమౌతున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో పర్వతాలకు ఆనుకుని ఉన్న కొట్టిక్కళ్, పెరువనంథనం, కొక్కయార్ వంటి గ్రామాల్లో ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. భారీ వర్షాలు, వరదల ధాటికి ఆయా గ్రామాలకు వెళ్లే మార్గం కూడా లేదు. రోడ్లు కొట్టుకుపోయాయి. ఛిన్నాభిన్నం అయ్యాయి.

ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత..

ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత..

పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడటంతో పలుచోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. వాహనాలు రాకపోకలు సాగించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. పర్వత ప్రాంతాలు, తేయాకు తోటలకు ఆనుకుని ఉండే గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అన్ని చోట్ల కూడా విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఫోన్లు పని చేయట్లేదు. ఇడుక్కి, పథనంథిట్ట, కొట్టాయం జిల్లాల్లో ఉన్న చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయి. పథనంథిట్టలోని మణియార్ రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు.

నదీ తీర ప్రాంతాల ప్రజల తరలింపు..

ఇడుక్కి జిల్లాలో ముళ్లైపెరియార్ రిజర్వాయర్, కక్కి డ్యామ్ గేట్లను ఎత్తేశారు అధికారులు. ఈ డ్యామ్ గేట్లను ఎత్తేయడం వల్ల చెంగన్నూర్, పండనాడ్, తిరువండూర్ తీర ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కక్కి రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి ప్రజలను కూడా తరలించినట్లు మంత్రి షాజి చెరియన్ తెలిపారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ నెలకొని ఉంది.

ఉప్పొంగిన కల్లాడ నది

ఉప్పొంగిన కల్లాడ నది

ఎర్నాకుళం జిల్లాలోని కల్లాడ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రత్యేకించి- మువట్టుపుళ వద్ద ఈ నది ఉప్పొంగింది. జనావాసాల్లోకి నీరు ప్రవహిస్తోంది. నదీ తర ప్రాంతాల్లో నివసిస్తోన్న వారిని అధికారులు, సహాయక సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ కేంద్రం జారీ చేసిన ఎల్లో అలర్ట్.. మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మరిన్ని భారీ వర్షాలు కురవడం వల్ల కల్లాడ నది ఉప్పొంగింది.

మళ్లీ అతి భారీ వర్షాలంటూ..

మళ్లీ అతి భారీ వర్షాలంటూ..

ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయ, పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. నౌకా దళాధికారుల సహాయాన్ని తీసుకుంది. సదరన్ నేవల్ కమాండ్ నుంచి పెద్ద ఎత్తున బలగాలు వర్ష ప్రభావ ప్రాంతాల్లో మోహరింపజేసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ బుధవారం నాడు అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం అధికారులు జారీ చేసిన ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఆందోళనకు గురి చేస్తోన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+