Rains : ఆగస్టులో గత వందేళ్లలోనే అత్యల్ప వర్షాలు-సెప్టెంబర్ పై IMD రిపోర్ట్ ఇదే..
ఈ ఏడాది దేశంలోకి అడుగుపెట్టడమే మొహమాటంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు మొహం చాటేస్తున్నాయి. జూన్ లో ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి మరో నెల రోజులకు పైగా సమయం తీసుకున్నాయి. ఆ తర్వాత కూడా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీంతో ఆగస్టు నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు తాండవిస్తోంది. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం దేశంలో గత వందేళ్లలో నమోదైన అత్యల్ప వర్షపాతంగా నిలిచింది.
దేశంలో ఏటా ఆగస్టు నెలలో కురిసే వర్షాల కంటే 36 శాతం తక్కువగా ఈ ఏడాది కురిశాయి. అలాగే నాలుగు రుతుపవన నెలల్లో జూలైలో 28 సెం.మీ వర్షాలు కురవగా.. ఆగస్టులో కేవలం 25.4 సెం.మీ వర్షాలు మాత్రమే పడ్డాయి. ఎల్ నినో బలపడటం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అననుకూల పరిస్థితుల కారణంగా ఈశాన్య భారతదేశం, హిమాలయ రాష్ట్రాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఆగస్టు వర్షపాతం గణనీయంగా తక్కువగా నమోదైందని ఐఎండీ తెలిపింది.

మధ్య పసిఫిక్ వేడెక్కడానికి సూచికగా ఎల్ నినో కనిపిస్తోందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో భారతదేశంపై రుతుపవనాల వర్షపాతం తక్కువగా ఉంటుందని తెలిపింది. భారతదేశం చివరిసారిగా ఆగస్టులో 2005లో ఇంత తీవ్రమైన వర్షపాత లోటును నమోదు చేసింది. ఈ కొరత సాధారణం కంటే దాదాపు 25% తక్కువ. 2009లో భారతదేశం అర్ధ శతాబ్దంలో అతిపెద్ద కరువును చవిచూసింది. ఇప్పుడు ఆగస్టు వర్షపాతం రావాల్సిన దానికంటే 24% తక్కువగా నమోదైంది. .
ఆగస్టులో వర్షపాతం లోటు జాతీయ లోటును 10% కి తగ్గించింది. ప్రాంతీయ పరంగా చూస్తే తూర్పు, ఈశాన్య భారతదేశంలో 17%, మధ్య భారతదేశంలో 10%, దక్షిణ భారతదేశంలో 17% లోటు నమోదైంది. జూలై 31న ఐఎండీ ఆగస్టు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని సూచించింది. అయితే దాని అంచనాలకు మించి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు రుతుపవన నెలలలో చివరిది అయిన సెప్టెంబరులో రుతుపవన వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
అయితే సాధారణ వర్షపాతానికి అవకాశం ఉన్నప్పటికీ ... హిందూ మహాసముద్రంలో అనుకూలమైన పరిస్థితులు, బంగాళాఖాతంలో రెండు వర్షాలు కురిసే అల్పపీడన ప్రాంతాల కారణంగా అదనపు వర్షం కురవడం చాలా కష్టమని వెల్లడించింది.












Click it and Unblock the Notifications