AC Water: మరి ఇంత భక్తా.. ఏసీ నీటిని తాగడమేంటి..!

ఇండియాలో గుళ్లు, గోపురాలు చాలానే ఉంటాయి. అంతే స్థాయిలో భక్తి, భక్తులు ఉంటారు. గుళ్లకు వెళ్తూ దేవుళ్లను దర్శనాలు చేసుకుంటారు. ఎవరి భక్తి వారి ఇష్టం. అయితే అతి భక్తి కూడా ఒక్కోసారి చూసే వారికి హాస్యాన్ని తెప్పిస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో వ్రిందావన్ లో ప్రముఖ ప్రసిద్ధ ఆలయం బాంకే బిహారీ ఉంది. ఈ గుడిలో శ్రీకృష్ణుడు కొలువుదీరి ఉన్నాడు. దేవుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. కృష్ణుడిని దర్శించుకుంటారు. అక్కడే కాసేపు సేద తీరుతారు.

అయితే ఈ ఆలయం వెనక భాగంలో ఏనుగు తల శిల్పం ఉంది. ఇందులోంచి నీరు వస్తుంది. ఈ నీరు పవిత్ర జలంగా భావించిన భక్తులు కప్పుల్లో నీరు పట్టుకుని తాగుతున్నారు. పలువురు నెత్తిపై ఆ నీరు పడేలా చేసుకుంటున్నారు. ఇందుకు భక్తులు ఎగడుతున్నారు. అయితే ఓ వ్యక్తి దీన్నీ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తి వీడియో తీస్తూ ఈ నీరు కృష్ణుడి చరణామృతం కాదని చెప్పాడు.

In a temple in Uttar Pradesh AC water is being drunk as holy water

ఏసీ నుంచి వచ్చే నీరని భక్తులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ భక్తుల మాత్రం నీటి పవిత్ర జలంగా భావిస్తున్నారు. అయితే అక్కడ ఏసీకి సంబంధించి ఎలాంటి కనిపించ లేదు. నీరు ఏనుగు బొమ్మ నుంచే వస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో భక్తులంతా ఆ నీటిని పవిత్ర జలంగా భావిస్తున్నారు. ఆలయ సిబ్బంది వెంటనే నీరు రాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అది పవిత్ర జలం కాదని తెలిసినా తాగడమేంటని ప్రశ్నిస్తున్నారు.

చదువుకున్న వారు సైతం తీర్థమని తాగడం సరైంది కాదని చెబుతున్నారు. ఏసీ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందులో ఫంగస్ ఉంటుందని.. దీని ద్వారా అనారోగ్య బారిన పడతామని వివరిస్తున్నారు. మరి కొందరు అక్కడ ఏసీ సంబంధించి ఏమి కనిపించడం లేదని.. భక్తలందరూ ఆ నీటిని పవిత్ర జలంగా భావించడంలో తప్పులేదని కామెంట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+