తమిళనాడు రైతుల రుణాల రద్దు చెయ్యాలని హైకోర్టు ఆదేశం: స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు !
తమిళనాడు రైతుల రుణాలు రద్దు చెయ్యాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తమిళనాడు రైతుల రుణాలు రద్దుకు సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే విధించడంతో అన్నాదాతలు ఆందోళన చెందు
న్యూఢిల్లీ: తమిళనాడు రైతుల రుణాలు రద్దు చెయ్యాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తమిళనాడు రైతుల రుణాలు రద్దుకు సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే విధించడంతో అన్నాదాతలు ఆందోళన చెందుతున్నారు.
రుణాలు రద్దు చెయ్యాలని ఇటీవల తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేశారు. తమిళనాడు రైతుల కష్టాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నదాతలు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు తమిళనాడులోని కరువు ప్రాంతాల్లో రైతులు తీసుకున్న అన్ని రుణాలు రద్దు చెయ్యాలని ఆదేశించింది. మదురై బెంచ్ సైతం కరువు ప్రాంతాల్లోని రైతుల బ్యాంకు రుణాలు రద్దు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
మద్రాసు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడుతోందని, రైతుల రుణాల రద్దు విషయంలో మరో సారి తమ వాదనలు వినాలని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు రైతు రుణాల రద్దు పై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications