Crime News: బరువు తగ్గుతుందనుకుంటే.. ప్రాణం పోయింది..
ఓ వ్యక్తి బరువు తగ్గడం కోసం ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రాణమే పోయింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది.
చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లోని సోమంగళానికి చెందిన 21 ఏళ్ల వ్యక్తి వైద్య ప్రిస్క్రిప్షన్ లేకుండా బరువు తగ్గించే మాత్రలు వేసుకుని జనవరి 4 బుధవారం మరణించాడు. సూర్య అనే వ్యక్తి జిల్లాలోని స్థానిక పాల కంపెనీలో మిల్క్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు.

పోస్టుమార్టం
అతను ఇటీవల సన్నగా, బలహీనంగా మారాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
సూర్య మృతికి కారణమేమిటో, మాత్రలకు అతని మరణానికి ఏమైనా సంబంధం ఉందా అనేది తాము నిర్ధారించలేకపోయామని సోమంగళం పోలీసులు తెలిపారు. సూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, తదుపరి విచారణ జరుపుతున్నామన్నారు.

అనుమానాస్పద మృతి
సూర్య మాత్రలు వేసుకున్న విషయం అతని తల్లిదండ్రులకు తెలియదని, అతని ఇంట్లో కూడా ఎలాంటి మాత్రలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. సూర్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సూర్య అధిక బరువుతో ఉండడంతో అతని స్నేహితులు ఆటపట్టించేవారని చెబుతున్నరాు.

ఆన్‌లైన్
బరువు తగ్గించే మాత్రల కోసం ఆన్‌లైన్‌లో వెతకమని స్నేహితులు సూర్యకు సూచించినట్లు తెలిసింది. వారి సలహా తీసుకుని ఆన్‌లైన్‌లో మాత్రలు కొని డిసెంబర్ 22 నుంచి వాటిని తీసుకోవడం ప్రారంభించినట్లు చెబుతున్నారు. జనవరి 1న, సూర్య స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.












Click it and Unblock the Notifications