మైసూర్ రాజదర్బారులో షాకింగ్: మరోసారి వద్దని రాజవంశ వారసుడి పోస్ట్
మైసూరు: మైసూరులో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, రాజవంశీకులు ఎలాంటి లోటు లేకుండా సంప్రదాయ క్రతువులకు పెద్దపీట వేశారు. కన్నడిగుల భక్త దేవేరి చాముండీ మాతకు సువర్ణ అంబారీలో మంగళవారం బ్రహ్మరథం పట్టారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు అమ్మవారిపై పుష్పవర్షం కురిపించి కన్నడిగులకు మేలు చేకూర్చాలని మొక్కుకున్నారు. రాజవంశ వారసుడు యుదువీర కృష్ణదత్త చామరాజ ఒడెయరు సంప్రదాయ రీతుల్లో అమ్మవారిని అర్చించి, రాజమహల్ నడువాల్లో వివిధ క్రతువులకు నేతృత్వం వహించారు.

కాగా, దేశంలోనే మైసూర్ అత్యంత పరిశుభ్రమైన నగరం. ప్రధాని మోడీ కలల ప్రాజెక్టు స్వచ్ఛ భారత్‌లో ఈ నగరానికి మొదటి ర్యాంకు వచ్చింది. మైసూరు రాజభవనంలో జరిగే దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. కానీ ఈసారి ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలు మాత్రం మరో చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి.
నగరవాసులకు పరిశుభ్రత మీద పెద్దగా శ్రద్ధ లేదనే వాస్తవాన్ని చాటాయాని విమర్శలు వస్తున్నాయి. ప్యాలెస్‌లో జరిగిన దసరా వేడుకలకు సంబంధించి మైసూర్ రాజకుటుంబ వారసుడు యుధువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ ఇన్‌స్టాగ్రాంలో ఓ ఆసక్తికర ఫోటో పెట్టారు. దర్బారు హాలులో దసరా వేడుకలు ముగిసిన తర్వాత ఎంత దారుణంగా ఆ పరిసరాలు మారాయో.. ఆ ఫోటో చాటుతోంది.
దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, టీ కప్పులు యథేచ్చగా విసిరేసి వెళ్లిపోయారు. దీంతో రాజదర్బార్ చెత్తకుండిలా మారింది.
ఈ నేపథ్యంలో యుధువీర్ రాజదర్బార్ ఫోటోను పోస్ట్ చేశారు. అత్యంత పరిశుభ్రమైన నగరం అన్న కీర్తిని మనం సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదని, పరిశుభ్రతకు మారుపేరైన మన నగరంలో పరిస్థితి ఇలా ఉందని, రాజదర్బారు థియేటర్ కాదని, అక్కడ తినకూడదని, థియేటర్ మాదిరిగా అక్కడ చెత్త వేయదనే విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందని పేర్కొన్నారు.
మన సంప్రదాయ పడుగ, మన గొప్ప నగరం ప్రత్యేకతలను నిలబెట్టుకందామని, పవిత్రమైన భవనాన్ని ఇలా కించపరచడం ఇకముందు జరగకుండా చూసుకుందామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications