వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హస్తినలో ఓటేసిన శతాధిక వృద్ధుడు : ఆప్ గురించి తెలియదు, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆరోవిడత పోలింగ్ లో ఓటర్ల నుంచి చైతన్యం వెల్లివిరుస్తోంది. మధ్యాహ్నాం 12 గంటల వరకు 25 శాతం పైగా పోలింగ్ జరిగింది. ఇక ఢిల్లీలో శతాధిక వృద్ధుడు ఓటుహక్కు వినియోగించుకున్నాడు.

ఓటేసిన వృద్ధుడు
తిలక్ నగర్ లోని శాంత్‌ఘర్‌ పోలింగ్‌ బూత్‌లో శతాధిక వృద్ధుడు బచన్‌ సింగ్‌(111) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు 1951 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేస్తూన్నారు. పోలింగ్‌ బూత్‌ వరకు కారులో వచ్చిన ఆయన.. వీల్‌ చైర్‌ సహాయంతో లోపలికి వెళ్లి ఓటు వేశారు.

in delhi vote in 111 years old man : 1951 he has vote

సైకిల్ పై వచ్చి వేసేవాడు ..
2015 ఎన్నికల వరకు బచన్‌సింగ్‌ సైకిల్‌ పైనే వచ్చి ఓటు వేసేవారని ఆయన కుమారుడు జస్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. మూడు నెలల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడని .. అయినా ఎప్పుడూ ఎవరి సహాయం తీసుకునే వారు కాదన్నారు. రోజులో చాల సమయం గురుద్వారాలో ఉండేవారని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ

ఆప్ గురించి గానీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అని తన తండ్రికి తెలియదని అన్నారు. ప్రతిసారీ బీజ కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ఆరో విడతలో ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 1.43 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.

English summary
Bachan Singh (111) has been given the right to vote in the polling booth in Shilgar Nagar in Tilak Nagar. He has also voted in every election since 1951. He came in the car to the polling booth and went in with the help of the wheelchair
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X