నోయిడాలో బాలికపై అంకుల్ రేప్: తిరగబడితే కాల్చేశాడు, ఆంటీ అరెస్ట్
నోయిడా: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో పదోతరగతి చదువుతున్న బాలిక పైన సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక తిరబడడంతో నిప్పు పెట్టారు. దీంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అమ్మాయిలతో నిందితులు అసభ్యంగా ప్రవర్తించేవారని పోలీసులు తెలిపారు. అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసేవారని చెప్పారు. ఇప్పుడు అత్యాచారం, హత్యకు గురైన అమ్మాయిని ఏడు నెలలు పాటు వేధించారు.
దీనిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన శనివారం జరిగింది. ఈ అఘాయిత్యం కేసులో నిందితుడు, అతని భార్య, మరో ఇద్దరిని.. మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

మృతి చెందిన బాలికకు చెందిన ఫోటోలను మార్ఫింగ్ చేసేవాడని పోలీసులు చెప్పారు. వాటిని చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గత ఎనిమిది నెలలుగు జరుగుతోంది. నిందితుల్లో బాలిక అంకల్, ఆంటీ ఉన్నారు. ఆంటీ కూడా ఆమె వద్ద నుండి డబ్బులు వసూలు చేసేదని తెలుస్తోంది.
సంఘటన జరిగిన (శనివారం) ఉదయం ఆంటీ, అంకుల్ బాలికను తమ ఇంటికి పిలిచారు. అక్కడే ఆ అంకుల్ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నిరాకరించడంతో ఎమ్మెమ్మెస్‌లు అందరికీ పంపిస్తానని, మీ తల్లిదండ్రులకు కూడా పంపిస్తానని బెదిరించాడు. తన కూతురు పైన అతను కిరోసిన్ పోసి నిప్పంటించాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications