వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణం తీసిన ఫేస్ బుక్ పోస్టు, బైక్ లో వెళ్లి కాల్చిపారేశారు, నిందితులతో లింక్, ముస్లీం మతగురువు అరెస్టు!

|
Google Oneindia TeluguNews

అహమ్మదాబాద్/ న్యూఢిల్లీ: ఓ యువకుడు ఫేస్ బుక్ లో ఓ మతాన్ని కించపరిచేలా వివాదాస్పద పోస్టు చేశాడు. మా మతాన్ని కించపరిచే విధంగా ఆ యువకుడు పోస్టు చేశాడని కొందరు ముస్లీం పెద్దలు అసహనం వ్యక్తం చేసి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పేస్ బుక్ లో పోస్టు చేసిన వ్యక్తి గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో బైక్ లో వెళ్లిన ఇద్దరు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా కాల్చి చంపేశారు. పోలీసుల విచారణలో పేస్ బుక్ లో పోస్టు చేసిన వ్యక్తిని కాల్చి చంపారని వెలుగు చూసింది.

ఇదే సమయంలో కేసు విచారణ చేస్తున్న యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ముస్లీం మత గురువును అరెస్టు చేశారు. ఇప్పటికే యువకుడి హత్య కేసులో ఇద్దరు మతగురువులు అరెస్టు కాగా యువకుడిని కాల్చి చంపిన మరో ఇద్దరు యువకుల మీద కేసు నమోదు అయ్యిందని యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ పోలీసు అధికారులు అంటున్నారు.

Lady: వదిన మీద కన్నేసిన మరిది, మ్యాటర్ తెలిసి అన్న ఏం చేశాడంటే ?, పెళ్లికి ముందే పక్కాప్లాన్!Lady: వదిన మీద కన్నేసిన మరిది, మ్యాటర్ తెలిసి అన్న ఏం చేశాడంటే ?, పెళ్లికి ముందే పక్కాప్లాన్!

ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు

ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు

గుజరాత్ లోని ధుందుకా పట్టణంలో కిషన్ బోలియా అలియాస్ బోలియా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇటీవ కిషన్ బోలియా ఫేస్ బుక్ లో వివాదాస్ప పోస్టు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కిషన్ బోరియా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని ముస్లీం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు

కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు

మా మతాన్ని కించపరిచే విధంగా ఆ యువకుడు పోస్టు చేశాడని కొందరు ముస్లీం పెద్దలు అసహనం వ్యక్తం చేసి ఇప్పటికే గుజరాత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేసి పేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తి గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు.

కాల్చిపారేసిన యువకులు

కాల్చిపారేసిన యువకులు

జనవరి 25వ తేదీన కిషన్ బోరియా గుజరాత్ లోని ధుందుకా పట్టణంలో వెలుతున్నాడు. ఆ సమయంలో బైక్ లో వెళ్లిన ఇంతియాజ్ పఠాన్ (270, షబ్బీర్ చోప్డా (25) అనే ఇద్దరు యువకులు కిషన్ బోలియా మీద కాల్పులు జరిపి దారుణంగా చంపేశారు. కిషన్ బోలియా హత్యకు గురి కావడంతో ధందుకా పట్టణంతో పాటు గుజరాత్ లో ఆందోళన మొదలైనాయి.

ఢిల్లీలో ముస్లీం మతగురువు అరెస్టు

ఢిల్లీలో ముస్లీం మతగురువు అరెస్టు

కిషన్ బోలియా ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టు చేశాడని ఆరోపిస్తూ అతన్ని కాల్చి చంపేశారని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ పోలీసు అధికారులు గుర్తించారు. కిషన్ బోలియాను ఇంతియాజ్ పఠాన్, చోప్డా హత్య చేశారని వెలుగు చూసింది. ఇంతియాజ్ పఠాన్, షబ్బీర్ చోప్డా నిత్యం ఢిల్లీలోని ముస్లీం మత గురువు మౌల్వీ కమర్గాని ఉస్మానీతో సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారని, అందుకే ఆయన్ను అరెస్టు చేశామని గుజరాత్ యాంటి టెర్రరిజం స్వ్కాడ్ పోలీసు అధికారులు తెలిపారు.

ఇద్దరు మత గురువుల అరెస్టు తో?

ఇద్దరు మత గురువుల అరెస్టు తో?

కిషన్ బోలియాను హత్య చేసిన ఇంతియాజ్ పఠాన్, షబ్బీర్ చోప్డాను ముస్లీం మత పెద్ద మౌల్వీ కమర్గాని ఉస్మానీ రెచ్చగొట్టి కిషన్ బోలియాను హత్య చేయించాడని ఆరోపణలు ఉన్నాయని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ ఎస్పీ ఇంతియాజ్ షేక్ గుజరాత్ మీడియాకు చెప్పారు.

ఇదే కేసులో ఇప్పటికే గుజరాత్ కు చెందిన ముస్లీం మత గురువు మోహమ్మద్ అయూబ్ జవ్రవావాలను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Facebook post: A Muslim cleric was arrested from Delhi by the Gujarat Anti Terrorism Squad in connection with murder of a man in Gujarat's Dhandhuka town recently over an alleged objectionable Facebook post that the accused claimed hurt their religious sentiments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X